Yesu Naamam Betti Paadudama Kreestu Daasulato Lyrics in Telugu & English
Chorus
యేసు నామం బెత్తి పాడుదమ క్రీస్తు దాసులతోఁ బొత్తుఁ గూడు దమ
||యేసు||
Yesu Naamam Betti Paadudama Kreestu Daasulaton Bottun Goodu Dama
||Yesu||
Verse 1
ఇహసంబంధుల పొందుఁ జాలింతమ మహా మహుఁడౌ దేవుని యాజ్ఞఁ
బాలింతమ
||యేసు||
Ihasambandhula Pondun Jaalintama Mahaa Mahundau Devuni Yaajnyan
Baalintama
||Yesu||
Verse 2
శుభవార్తర్థము లన్ని శోధింతమ యేసువిభు సత్యమిలలోన నుభవింతమ
||యేసు||
Shubhavaartarthamu Lanni Shodhintama Yesuvibhu Satyamilalona Nubhavintama
||Yesu||
Verse 3
దోషములను బైటఁ బెట్టుదము కపట వేషభాషలఁ గ్రుంగఁ బట్టు దమ
||యేసు||
Doshamulanu Baitan Bettudamu Kapata Veshabhaashalan Grungan Battu Dama
||Yesu||
Verse 4
మన రక్షకుని పాట్లు మది నెంతమ మనసు లోపలి గర్వము లణుపుదమ
||యేసు||
Mana Rakshakuni Paatlu Madi Nentama Manasu Lopali Garvamu Lanupudama
||Yesu||
Verse 5
జనుల నిందల కెల్ల నోర్చెదమ బోధ కనిపెట్టి ప్రభు చెంత నేర్చ దమ
||యేసు||
Janula Nindala Kella Norchedama Bodha Kanipetti Prabhu Chenta Nercha Dama
||Yesu||
Verse 6
మానావమానముల్ భరియింతమ యోర్వ లేని గుణముల వేరుఁ
బెరుకుదమ
||యేసు||
Maanaavamaanamul Bhariyintama Yorva Leni Gunamula Verun
Berukudama
||Yesu||
Verse 7
పరిశుద్ధాత్మను బొంద నడుగుదమ బుద్ది పరమానందము జాడ నడుపు
దమ
||యేసు||
Parishuddhaatmanu Bonda Nadugudama Buddi Paramaanandamu Jaada Nadupu
Dama
||Yesu||
Verse 8
సకల మానవు లాత్మ సరిచూతమ యింక మొక మిచ్చకపు మాట
ల్విడిచెదమ
||యేసు||
Sakala Maanavu Laatma Sarichootama Yinka Moka Michchakapu Maata
Lvidichedama
||Yesu||
Verse 9
దినము ప్రార్థనఁ జేయ గురి యుంతమ చెడ్డ మనసు బద్ధకముపై
నెదిరింతమ
||యేసు||
Dinamu Praarthanan Jeya Guri Yuntama Chedda Manasu Baddhakamupai
Nedirintama
||Yesu||
Verse 10
గురు బోధ స్థలికి బిరబిరఁ బోదమ బుద్ధి తిర ముంచి వాక్యార్థ మెఱు
గుదమ
||యేసు||
Guru Bodha Sthaliki Birabiran Bodama Buddhi Tira Munchi Vaakyaartha Meru
Gudama
||Yesu||
The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.