Skip to content
ThuthiThuthiThuthi

Yesuni Bhajiyimpave Manasaa Nee Dosamulu Song Lyricsయేసుని భజియింపవే మనసా నీ దోసములు

Yesuni Bhajiyimpave Manasaa Nee Dosamulu Lyrics in Telugu & English

Present

Chorus

యేసుని భజియింపవే మనసా నీ దోసములు చనఁ జేసి కృపతోఁ

బ్రోచునే మనసా వాసి కెక్కిన క్రీస్తు మోక్షని వాసిగా కిఁక వేరేలేరని

దోసిలొగ్గి నుతించితే నిను త్రోసివేయఁడు దోసకారని

||యేసు||

Yesuni Bhajiyimpave Manasaa Nee Dosamulu Chanan Jesi Krupaton

Brochune Manasaa Vaasi Kekkina Kreestu Mokshani Vaasigaa Kinka Verelerani

Dosiloggi Nutinchite Ninu Trosiveyandu Dosakaarani

||Yesu||

Verse 1

ఏటికే నీ కీదురాశలు నీ కెప్పుదును చెవి నాటవుగ ప్రభు యేసు

వాక్యములు వాటముగ నా తుది దినమున నీటుమీఱఁగ నిత్యజీవ కి

రీటమును నీకిత్తు నని తన నోటఁ బల్కిన మాటఁ దప్పఁడు

||యేసు||

Etike Nee Keeduraashalu Nee Keppudunu Chevi Naatavuga Prabhu Yesu

Vaakyamulu Vaatamuga Naa Tudi Dinamuna Neetumeeranga Nityajeeva Ki

Reetamunu Neekittu Nani Tana Notan Balkina Maatan Dappandu

||Yesu||

Verse 2

ఖండనగ నిను చెండియాడఁడు యెల్లప్పుడుందన మిత్రుడని రక్షించు

నతఁడితఁడు అండఁబాయక నిన్ను ప్రతి దిన గండములను హరించునని

నీ వుండ గోరిన నిండు నెమ్మది దండిఁగ నీకుండఁ జెప్పును

||యేసు||

Khandanaga Ninu Chendiyaadandu Yellappudundana Mitrudani Rakshinchu

Natanditandu Andanbaayaka Ninnu Prati Dina Gandamulanu Harinchunani

Nee Vunda Gorina Nindu Nemmadi Dandinga Neekundan Jeppunu

||Yesu||

Verse 3

లోక సైతాను దుర్భోధలు నీ వాలింపక యా లోకరక్షకుని సుబోధలు

ఏక మనసుతో రాత్రిఁబగలు ప రాకులేకను గాచు నా ప్రభు రాకడను

నీవెఱింగినను పర లోకశుభ సుఖసౌఖ్య మొసఁగును

||యేసు||

Loka Saitaanu Durbhodhalu Nee Vaalimpaka Yaa Lokarakshakuni Subodhalu

Eka Manasuto Raatrinbagalu Pa Raakulekanu Gaachu Naa Prabhu Raakadanu

Neeveringinanu Para Lokashubha Sukhasaukhya Mosangunu

||Yesu||

Verse 4

వంచనలు మది నుంచకే మనసా నీ దుర్గుణము తలఁ ద్రుంచి ప్రభుని

సేవింపనే మనసా అంచితముగా క్రీస్తుఁ డీప్ర పంచ జనుల భవాబ్ధినావగ

నెంచి నీ భవభార మతనిపై నుంచి సతము ప్రార్థించు మనసా

||యేసు||

Vanchanalu Madi Nunchake Manasaa Nee Durgunamu Talan Drunchi Prabhuni

Sevimpane Manasaa Anchitamugaa Kreestun Deepra Pancha Janula Bhavaabdhinaavaga

Nenchi Nee Bhavabhaara Matanipai Nunchi Satamu Praarthinchu Manasaa

||Yesu||

Verse 5

నిన్ను పాప బంధముల నుండి రక్షించుటకు స ర్వోన్నతుని కుమారుఁ

డై వెలసి ఎన్నఁగ నీవొందు దుఃఖము లన్నిటిని తా ననుభవించెను

విన్న తక్షణ మేసుక్రీస్తుని విశ్వసించి సుఖించు మనసా

||యేసు||

Ninnu Paapa Bandhamula Nundi Rakshinchutaku Sa Rvonnatuni Kumaarun

Dai Velasi Ennanga Neevondu Duhkhamu Lannitini Taa Nanubhavinchenu

Vinna Takshana Mesukreestuni Vishvasinchi Sukhinchu Manasaa

||Yesu||

The English letters on this page are generated from the Telugu. Spotted a mistake or know who wrote or sang this song? Tell us.

More Telugu Christian songs starting with Y