1 Chronicles · chapter 1 · verse 28
1 Chronicles 1:28 in Telugu
ఇస్సాకు ఇష్మాయేలు.
Issaaku ishmaayelu.
1 Chronicles 1:28 in English
- King James Version (KJV)
- The sons of Abraham; Isaac, and Ishmael.
- World English Bible (WEB)
- The sons of Abraham: Isaac and Ishmael.
- American Standard Version (ASV)
- The sons of Abraham: Isaac, and Ishmael.
- Bible in Basic English (BBE)
- The sons of Abraham: Isaac and Ishmael.
- Darby Translation (DBY)
- The sons of Abraham: Isaac and Ishmael.
- Webster's Bible (WBS)
- The sons of Abraham; Isaac, and Ishmael.
- Young's Literal Translation (YLT)
- Sons of Abraham: Isaac and Ishmael.
Read in context
- 26అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము.
- 27అబ్రాహాము కుమారులు,
- 28ఇస్సాకు ఇష్మాయేలు.
- 29వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు తరువాత కేదారు అద్బయేలు మిబ్శాము
- 30మిష్మా దూమా మశ్శా హదదు తేమా
Cross references
- Genesis 16:11–16 ఆదికాండము 16:11–16మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు; అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటిబుగ్గకు బెయేర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేషుకును బెరెదుకును మధ్య నున్నది. తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము ఎనుబదియారు ఏండ్ల వాడు.
- Genesis 21:12 ఆదికాండము 21:12అయితే దేవుడు ఈ చిన్న వాని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకు వలన అయినది యే నీ సంతానమనబడును.
- Genesis 21:9–10 ఆదికాండము 21:9–10అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము; ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండడని అబ్రాహాముతో అనెను.
- Genesis 17:19–21 ఆదికాండము 17:19–21దేవుడు నీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును; నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు; అతని తరువాత అతని సంతానముకొరకు నిత్యనిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేనతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసెదను; అతడు పండ్రెండు మంది రాజులను కనును; అతనిని గొప్ప జనముగా చేసెదను; అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను.
- Genesis 21:2–5 ఆదికాండము 21:2–5ఎట్లనగా దేవుడు అబ్రాహాముతో చెప్పిన నిర్ణయకాలములో శారా గర్భవతియై అతని ముసలి తనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రాహాము తనకు పుట్టిన వాడును తనకు శారా కనిన వాడు నైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రాహాము కాజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు.