1 Chronicles · chapter 11 · verse 4
1 Chronicles 11:4 in Telugu
తరువాత దావీదును ఇశ్రాయేలీయులందరును యెరూషలే మనబడిన యెబూసునకు పోయిరి; ఆ దేశవాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి.
Taruvaata daaveedunu ishraayeleeyulandarunu yerooshale manabadina yeboosunaku poyiri; aa deshavaasulaina yebooseeyulu achchata undiri.
1 Chronicles 11:4 in English
- King James Version (KJV)
- And David and all Israel went to Jerusalem, which [is] Jebus; where the Jebusites [were], the inhabitants of the land.
- World English Bible (WEB)
- David and all Israel went to Jerusalem (also called Jebus); and the Jebusites, the inhabitants of the land, were there.
- American Standard Version (ASV)
- And David and all Israel went to Jerusalem (the same is Jebus); and the Jebusites, the inhabitants of the land, were there.
- Bible in Basic English (BBE)
- Then David and all Israel went to Jerusalem (which is Jebus); and the Jebusites, the people of the land, were there.
- Darby Translation (DBY)
- And David and all Israel went to Jerusalem, which is Jebus; where the Jebusites were, the inhabitants of the land.
- Webster's Bible (WBS)
- And David and all Israel went to Jerusalem, which [is] Jebus; where the Jebusites [were] , the inhabitants of the land.
- Young's Literal Translation (YLT)
- And David goeth, and all Israel, to Jerusalem — it [is] Jebus — and there the Jebusite, the inhabitants of the land.
Read in context
- 2ఇంతకు ముందు సౌలు రాజైయున్నప్పుడు నీవు ఇశ్రాయేలీయులను నడిపించువాడవై యుంటివినా జనులగు ఇశ్రాయేలీ యులను నీవు ఏలి వారిమీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చెను అని మనవిచేసిరి.
- 3ఇశ్రాయేలీయుల పెద్దలందరును హెబ్రోనులోనున్న రాజు నొద్దకు రాగా దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధనచేసెను; అప్పుడు వారు సమూ యేలుద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలీయులమీద రాజుగా అభిషేకము చేసిరి.
- 4తరువాత దావీదును ఇశ్రాయేలీయులందరును యెరూషలే మనబడిన యెబూసునకు పోయిరి; ఆ దేశవాసులైన యెబూసీయులు అచ్చట ఉండిరి.
- 5అప్పుడునీవు వీనియందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్థులు దావీదుతో అనగా దావీదు దావీదు పట్టణమనబడిన సీయోను కోటను పట్టుకొనెను.
- 6ఎవడు మొదట యెబూ సీయులను హతము చేయునో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియునగునని దావీదు సెలవియ్యగా సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటె ముందుగా ఎక్కి ఆ యాధిపత్యమును పొందెను.
Cross references
- Judges 1:21 న్యాయాధిపతులు 1:21యెరూషలేములో నివసించు యెబూసీ యులను బెన్యామీనీయులు వెళ్లగొట్టలేదు; యెబూసీ యులు బెన్యామీనీయులతో కూడ నేటివరకు యెరూష లేములో నివసించుచున్నారు.
- Joshua 15:8 యెహోషువ 15:8ఆ సరిహద్దు పడమట బెన్హిన్నోములోయ మార్గముగా దక్షిణదిక్కున యెబూసీయుల దేశమువరకు, అనగా యెరూషలేమువరకు నెక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పువరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ తుదనున్నది.
- Joshua 15:63 యెహోషువ 15:63యెరూషలేములో నివసించిన యెబూసీ యులను యూదా వంశస్థులు తోలివేయ లేకపోయిరి గనుక యెబూసీయులు నేటివరకు యెరూషలేములో యూదా వంశస్థులయొద్ద నివసించుచున్నారు.
- 1 Chronicles 11:5 1 దినవృత్తాంతములు 11:5అప్పుడునీవు వీనియందు ప్రవేశింపకూడదని యెబూసు కాపురస్థులు దావీదుతో అనగా దావీదు దావీదు పట్టణమనబడిన సీయోను కోటను పట్టుకొనెను.
- Genesis 15:21 ఆదికాండము 15:21అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతానమున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను.
- Joshua 18:28 యెహోషువ 18:28వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనీయులకు కలిగిన స్వాస్థ్యము.
- Exodus 3:17 నిర్గమకాండము 3:17ఐగుప్తు బాధలోనుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, అనగా కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులున్న దేశమునకు మిమ్ము రప్పించెదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము.
- Genesis 10:16 ఆదికాండము 10:16హివ్వీయులను అర్కీయులను సినీయులను
- 2 Samuel 5:6–10 2 సమూయేలు 5:6–10యెబూసీయులు దేశములో నివాసులై యుండగా రాజును అతని పక్షమువారును యెరూ షలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచినీవు వచ్చినయెడల ఇచ్చటి గ్రుడ్డి వారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి అయినను దావీదు పురమన బడిన సీయోను కోటను దావీదు స్వాధీన పరచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయు వారందరు నీటి కాలువపైకి వెళ్లి, దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతము చేయవలెనని చెప్పెను. అందును బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు; అతడు ఇంటిలోనికి రాలేడని సామెతపుట్టెను. దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదుపురమను పేరు పెట్టెను. మరియు మిల్లోనుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను.
- Judges 19:10–12 న్యాయాధిపతులు 19:10–12అతడు అక్కడ ఆ రాత్రి గడప నొల్లక లేచి వెళ్లి, యెబూసను యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్ట బడిన రెండు గాడిదలును అతని ఉపపత్నియు అతనితో కూడ ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలావ్రాలెను గనుక అతని దాసుడుమనము యెబూసీయులదైన యీ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బసచేయుదము రండని తన యజమానునితో చెప్పగా అతని యజమానుడుఇశ్రాయేలీయులు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము. గిబియావరకు ప్రయా ణము చేయుదమనెను.