1 Chronicles · chapter 28 · verse 6
1 Chronicles 28:6 in Telugu
నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని యున్నాను, నేను అతనికి తండ్రినైయుందును అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును.
Nenu nee kumaarudaina solomonunu naaku kumaarunigaa erparachukoni yunnaanu, nenu ataniki tandrinaiyundunu atadu naa mandiramunu naa aavaranamulanu kattinchunu.
1 Chronicles 28:6 in English
- King James Version (KJV)
- And he said unto me, Solomon thy son, he shall build my house and my courts: for I have chosen him [to be] my son, and I will be his father.
- World English Bible (WEB)
- He said to me, ‘Solomon, your son, shall build my house and my courts; for I have chosen him to be my son, and I will be his father.
- American Standard Version (ASV)
- And he said unto me, Solomon thy son, he shall build my house and my courts; for I have chosen him to be my son, and I will be his father.
- Bible in Basic English (BBE)
- And he said to me, Solomon your son will be the builder of my house and the open spaces round it; for I have taken him to be my son, and I will be his father.
- Darby Translation (DBY)
- And he said to me, Solomon thy son, he shall build my house and my courts; for I have chosen him to be my son, and I will be his father.
- Webster's Bible (WBS)
- And he said to me, Solomon thy son, he shall build my house and my courts: for I have chosen him [to be] my son, and I will be his father.
- Young's Literal Translation (YLT)
- and saith to me, Solomon thy son, he doth build My house, and My courts, for I have fixed on him to Me for a son, and I — I am to him for a father,
Read in context
- 4ఇశ్రాయేలీయులమీద నిత్యము రాజునై యుండుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నా తండ్రి యింటివారందరిలోను నన్ను కోరుకొనెను, ఆయన యూదాగోత్రమును, యూదాగోత్రపువారిలో ప్రధానమైనదిగా నా తండ్రి యింటిని నా తండ్రి యింటిలో నన్నును ఏర్పరచుకొని నాయందు ఆయన దయచూపి ఇశ్రాయేలీయులమీద రాజుగా నియమించియున్నాడు.
- 5యెహోవా నాకు అనేకమంది కుమారులను దయచేసి యున్నాడు, అయితే ఇశ్రాయేలీయులపైని యెహోవా రాజ్యసింహాసనముమీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెను
- 6నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని యున్నాను, నేను అతనికి తండ్రినైయుందును అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును.
- 7మరియు నేటిదినమున చేయుచున్నట్లు అతడు ధైర్యమువహించి నా ఆజ్ఞలను నా న్యాయవిధులను అనుసరించినయెడల, నేనతని రాజ్యమును నిత్యము స్థిరపరచుదును.
- 8కాబట్టి మీరు ఈ మంచిదేశమును స్వాస్థ్యముగా అనుభవించి, మీ తరువాత మీ సంతతివారికి శాశ్వత స్వాస్థ్యముగా దానిని అప్ప గించునట్లు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన యాజ్ఞలన్నియు ఎట్టివో తెలిసికొని వాటిని గైకొనుడి అని యెహోవా సమాజమునకు చేరిన ఇశ్రాయేలీయులందరు చూచుచుండగను మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను.
Cross references
- 2 Samuel 7:13–14 2 సమూయేలు 7:13–14అతడు నా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను; నేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడై యుండును; అతడు పాపముచేసినయెడల నరులదండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని
- 1 Chronicles 22:9–10 1 దినవృత్తాంతములు 22:9–10నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును; చుట్టు ఉండు అతని శత్రు వులనందరిని నేను తోలివేసి అతనికి సమాధానము కలుగ జేతును; అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్ట బడును; అతని దినములలో ఇశ్రాయేలీయులకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును. అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును, అతడు నాకు కుమారుడై యుండును, నేనతనికి తండ్రినై యుందును, ఇశ్రాయేలీయులమీద అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరచుదును.
- Hebrews 3:6 హెబ్రీయులకు 3:6అయితే క్రీస్తు కుమారుడైయుండి, ఆయన యింటిమీద నమ్మకముగా ఉన్నాడు; ధైర్యమును నిరీక్షణవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినయెడల మనమే ఆయన యిల్లు.
- Zechariah 6:12–13 జెకర్యా 6:12–13అతనితో ఇట్లనుముసైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగాచిగురు అను ఒకడు కలడు; అతడు తన స్థలములోనుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. అతడే యెహోవా ఆలయము కట్టును; అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై యేలును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలు గును.
- 2 Chronicles 1:9 2 దినవృత్తాంతములు 1:9దేవా యెహోవా, నీవు నా తండ్రియైన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము; నేల ధూళియంత విస్తారమైన జనులమీద నీవు నన్ను రాజుగా నియమించియున్నావు
- 1 Chronicles 17:11–14 1 దినవృత్తాంతములు 17:11–14నీ జీవిత దినములు తీరి నీ పితరులయొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారులవలన కలుగు నీ సంతతిని నేను స్థాపనచేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసెదను. నేను అతనికి తండ్రినైయుందును, అతడు నాకు కుమారుడై యుండును; నీకంటె ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందును నారాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచెదను, అతని సింహాసనము ఎన్నటికిని స్థిరముగా నుండునని అతనికి తెలియజేయుము.
- Hebrews 4:5 హెబ్రీయులకు 4:5ఇదియునుగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పియున్నాడు.
- Hebrews 3:3 హెబ్రీయులకు 3:3ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటె దానిని కట్టిన వాడెక్కువ ఘనతపొందినట్టు,