1 Chronicles · chapter 29 · verse 5
1 Chronicles 29:5 in Telugu
ఈ దినమునయెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చు వారెవరైన మీలో ఉన్నారా?
Ee dinamunayehovaaku pratishthitamugaa manahpoorvakamugaa ichchu vaarevaraina meelo unnaaraa?
1 Chronicles 29:5 in English
- King James Version (KJV)
- The gold for [things] of gold, and the silver for [things] of silver, and for all manner of work [to be made] by the hands of artificers. And who [then] is willing to consecrate his service this day unto the LORD?
- World English Bible (WEB)
- of gold for the things of gold, and of silver for the things of silver, and for all kinds of work to be made by the hands of artisans. Who then offers willingly to consecrate himself today to the LORD?”
- American Standard Version (ASV)
- of gold for the [things of] gold, and of silver for the [things of] silver, and for all manner of work [to be made] by the hands of artificers. Who then offereth willingly to consecrate himself this day unto Jehovah?
- Bible in Basic English (BBE)
- Gold for the gold things, and silver for the silver things, and for every sort of work to be done by the expert workmen. Who then will come forward, offering himself this day for the Lord's work?
- Darby Translation (DBY)
- gold for [things of] gold, and silver for [things of] silver, and for all manner of work by the hands of artificers. And who is willing to offer to Jehovah this day?
- Webster's Bible (WBS)
- The gold for [things] of gold, and the silver for [things] of silver, and for all manner of work [to be made] by the hands of artificers. And who [then] is willing to consecrate his service this day to the LORD?
- Young's Literal Translation (YLT)
- even gold for [things of] gold, and silver for [those of] silver, and for all the work by the hand of artificers; and who [is] he that is offering willingly to consecrate his hand to-day to Jehovah?'
Read in context
- 3మరియు నా దేవుని మందిముమీద నాకు కలిగియున్న మక్కువచేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించియుంచిన వస్తువులు గాక, నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను.
- 4గదుల గోడల రేకుమూతకును బంగారపు పనికిని బంగారమును, వెండిపనికి వెండిని పనివారు చేయు ప్రతివిధమైన పనికి ఆరువేల మణుగుల ఓఫీరు బంగారమును పదునాలుగువేల మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను
- 5ఈ దినమునయెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చు వారెవరైన మీలో ఉన్నారా?
- 6అప్పుడు పితరుల యిండ్లకు అధిపతులును ఇశ్రాయేలీయుల గోత్రపు అధి పతులును సహస్రాధిపతులును శతాధిపతులును రాజు పనిమీద నియమింపబడిన అధిపతులును కలసి
- 7మనఃపూర్వకముగా దేవుని మందిరపుపనికి పదివేల మణుగుల బంగారమును ఇరువదివేల మణుగుల బంగారపు ద్రాములను ఇరువదివేల మణుగుల వెండిని ముప్పదియారువేల మణుగుల యిత్తడిని రెండులక్షల మణుగుల యినుమును ఇచ్చిరి.
Cross references
- Exodus 35:5–9 నిర్గమకాండము 35:5–9మీరు మీలోనుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధిపుట్టిన ప్రతివాడు యెహోవా సేవనిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్ననార మేకవెండ్రుకలు, ఎఱ్ఱరంగువేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱ, ప్రదీపమునకు తైలము, అభిషేకతైలమునకును పరిమళ ద్రవ్య ధూపమునకును సుగంధ సంభారములు, ఏఫోదుకును పతకమునకును లేత పచ్చలును చెక్కు రత్నములును తీసికొని రావలెను.
- Ezra 7:15–16 ఎజ్రా 7:15–16మరియు యెరూషలేములో నివాసముగల ఇశ్రాయేలీయుల దేవునికి రాజును అతనియొక్క మంత్రులును స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసికొని పోవలెను. మరియు బబులోను ప్రదేశమందంతట నీకు దొరకు వెండి బంగా రములంతయును, జనులును యాజకులును యెరూష లేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసికొని పోవలెను.
- Ezra 1:4–6 ఎజ్రా 1:4–6మరియు యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆ యా స్థలములలోనివారు తమ యొద్ద నివసించువారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను. అప్పుడు యూదా పెద్దలును, బెన్యామీనీయుల పెద్దలును, యాజకులును లేవీయులును ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరు వారితో కూడుకొని వచ్చి, యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. మరియు వారి చుట్టు నున్న వారందరును స్వేచ్ఛగా అర్పించినవి గాక, వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తు వులను ఇచ్చి వారికి సహాయము చేసిరి.
- Ezra 2:68–69 ఎజ్రా 2:68–69కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములోనుండు యెహోవా మందిరమునకు వచ్చి, దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి. పని నెరవేర్చుటకు తమ శక్తికొలది ఖజానాకు పదునారు వేల మూడువందల తులముల బంగారమును రెండు లక్షల యేబది వేల తులముల వెండిని యాజకులకొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి.
- Numbers 7:10–89 సంఖ్యాకాండము 7:10–89బలిపీఠము అభిషేకింప బడిననాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్ఠార్పణములను తెచ్చిరి; ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణ ములను తెచ్చిరి. బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలెనని యెహోవా మోషేకు సెల విచ్చెను. మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మినాదాబు కుమారుడును యూదా గోత్రికుడనైన నయస్సోను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండిగిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱె పిల్లను అపరాధ పరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము. రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూయారు కుమారుడును ఇశ్శాఖారీయులకు ప్రధానుడు నైన నెతనేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణ మునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండ నూనెతో కలిసిన గోధుమపిండిని ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడె లను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూయారు కుమారుడైన నెతనేలు అర్పణము. మూడవ దినమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జెబూలూను కుమారులకు ప్రధానుడునైన ఏలీయాబు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది హేలోను కుమారుడైన ఏలీయాబు అర్పణము. నాలుగవ దినమున అర్పణమును తెచ్చినవాడు షెదే యూరు కుమారుడును రూబేనీయులకు ప్రధానుడునైన ఏలీసూరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండిగిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడె లను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడా దివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అర్పణము. అయిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూరీష దాయి కుమారుడును షిమ్యోనీయులకు ప్రధానుడునైన షెలుమీయేలు. ఒ అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణ మునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్నకోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్ల లను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అర్పణము. ఆరవ దినమున అర్పణమును తెచ్చినవాడు దెయూ వేలు కుమారుడును గాదీయులకు ప్రధానుడునైన ఎలీయా సాపా. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్య ముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని ధూపద్రవ్యముతో నిండి యున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టే లును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది దెయూ వేలు కుమారుడైన ఎలీయాసాపా అర్పణము. ఏడవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీ హూదు కుమారుడును ఎఫ్రాయిమీయులకు ప్రధానుడు నైన ఎలీషామా. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణ మునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును, ఏడాది గొఱ్ఱెపిల్లను పాప పరిహారార్థబలిగా ఒక మేక పిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేక పోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణ ముగా తెచ్చెను. ఇది అమీహూదు కుమారుడైన ఎలీ షామా అర్పణము. ఎనిమిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు పెదా సూరు కుమారుడును మనష్షీయులకు ప్రధానుడునైన గమలీ యేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్య ముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను అపరాధపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది పెదాసూరు కుమారుడైన గమలీయేలు అర్పణము. తొమ్మిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు గిద్యోనీ కుమారుడును బెన్యామీనులకు ప్రధానుడునైన అబీదాను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణ మునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తుల ముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధమపిండిని ధూప ద్రవ్యముతో నిండియున్న పది షెకెలుల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేక పోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది గిద్యోనీ కుమారుడైన అబీదాను అర్పణము. పదియవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీష దాయి కుమారుడును దానీయులకు ప్రధానుడునైన అహీ యెజెరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూటముప్పది తులముల యెత్తు గల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్య ముగా ఆ రెంటిలో నూనెతో కలిసి నిండిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడె లను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడా దివి అయిదు గొఱ్ఱెపిల్ల లను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఆమీషదాయి కుమారుడైన అహీయెజెరు అర్పణము. పదకొండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఒక్రాను కుమారుడును ఆషేరీయులకు ప్రధానుడునైన పగీయేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండి యున్న పది తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడె లను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు అర్పణము. పండ్రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఏనాను కుమారుడు నఫ్తాలీయులకు ప్రధానుడునైన అహీర. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తుల ముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తినిఒ దహనబలిగా ఒక చిన్నకోడెను ఒకపొట్టె లును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఏనాను కుమారుడైన అహీర అర్పణము. బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇశ్రాయేలీయుల ప్రధానులు అర్పించిన ప్రతిష్ఠార్పణములు ఇవి, వెండి గిన్నెలు పండ్రెండు, వెండి ప్రోక్షణపాత్రలు పండ్రెండు, బంగారు ధూపార్తులు పండ్రెండు, ప్రతి వెండిగిన్నె నూట ముప్పది తులములది. ప్రతి ప్రోక్షణపాత్ర డెబ్బది తులములది; ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుధ్ద మైన తులపు పరిమాణ మునుబట్టి రెండు వేల నాలుగువందల తులములది. ధూపద్రవ్యముతో నిండిన బంగారు ధూపా ర్తులు పండ్రెండు; వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి పది తులములది. ఆ ధూపార్తుల బంగారమంతయు నూట ఇరువది తులములది; దహనబలి పశువులన్నియు పండ్రెండు కోడెలు, పొట్టేళ్లు పండ్రెండు, ఏడాదివైన గొఱ్ఱెపిల్లలు పండ్రెండు, వాటి నైవేద్యములును పాపపరిహారార్థమైన మగమేకపిల్లలు పండ్రెండు, సమా ధానబలి పశువులన్నియు ఇరువది నాలుగు కోడెలు, పొట్టేళ్లు అరువది, మేకపోతులు అరువది, ఏడాదివైన గొఱ్ఱెపిల్లలు అరువది. మోషే యెహోవాతో మాట లాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లినప్పుడు సాక్ష్యపు మందసము మీద నున్న కరుణాపీఠముమీద నుండి, అనగా రెండు కెరూబుల నడమనుండి తనతో మాటలాడిన యెహోవా స్వరము అతడు వినెను, అతడు ఆయనతో మాటలాడెను.
- Exodus 25:2–9 నిర్గమకాండము 25:2–9నాకు ప్రతిష్ఠార్పణ తీసికొనిరండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద దాని తీసికొనవలెను. మీరు వారియొద్ద తీసికొన వలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపునార, మేకవెండ్రుకలు, ఎరుపురంగు వేసిన పొట్టేళ్లతోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమున కును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు, లేతపచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను. నేను నీకు కను పరచువిధముగా మందిరముయొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను.
- Numbers 7:2–3 సంఖ్యాకాండము 7:2–3దాని ఉపకరణములన్నిటిని బలి పీఠమును దాని పాత్రలన్నిటిని చేయించి, అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబ ములలో ప్రధానులును గోత్ర ముఖ్యులును లెక్కింప బడిన వారిమీద అధిపతులునైన ఇశ్రాయేలీయులలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి. వారు ఇద్దరిద్దరికి ఒక్కొక బండి చొప్పునను, ప్రతివానికి ఒక్కొక యెద్దు చొప్పునను, ఆరు గూడు బండ్లను పండ్రెండు ఎద్దులను యెహోవా సన్నిధికి తీసికొని వచ్చిరి. వారు మందిరము ఎదుటికి వాటిని తీసికొని వచ్చిరి.