1 Chronicles · chapter 5 · verse 25
1 Chronicles 5:25 in Telugu
అయితే వారు తమ పితరుల దేవునిమీద తిరుగుబాటుచేసి, దేవుడు తమ ముందర నాశనము చేసిన జనసమూహముల దేవతలతో వ్యభిచరించిరి.
Ayite vaaru tama pitarula devunimeeda tirugubaatuchesi, devudu tama mundara naashanamu chesina janasamoohamula devatalato vyabhicharinchiri.
1 Chronicles 5:25 in English
- King James Version (KJV)
- And they transgressed against the God of their fathers, and went a whoring after the gods of the people of the land, whom God destroyed before them.
- World English Bible (WEB)
- They trespassed against the God of their fathers, and played the prostitute after the gods of the peoples of the land whom God destroyed before them.
- American Standard Version (ASV)
- And they trespassed against the God of their fathers, and played the harlot after the gods of the peoples of the land, whom God destroyed before them.
- Bible in Basic English (BBE)
- And they did evil against the God of their fathers, worshipping the gods of the people of the land, whom God had put to destruction before them.
- Darby Translation (DBY)
- And they transgressed against the God of their fathers, and went a whoring after the gods of the peoples of the land, whom God had destroyed before them.
- Webster's Bible (WBS)
- And they transgressed against the God of their fathers, and went astray after the gods of the people of the land, whom God destroyed before them.
- Young's Literal Translation (YLT)
- And they trespass against the God of their fathers, and go a-whoring after the gods of the peoples of the land whom God destroyed from their presence;
Read in context
- 23మనష్షే అర్ధగోత్రమువారును ఆ దేశమందు కాపుర ముండి వర్ధిల్లుచు, బాషాను మొదలుకొని బయల్హెర్మోను వరకును శెనీరువరకును హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి.
- 24వారి పితరుల యిండ్లకు పెద్దలైనవారెవరనగా ఏఫెరు ఇషీ ఎలీయేలు అజ్రీయేలు యిర్మీయా హోదవ్యా యహదీయేలు; వీరు కీర్తిపొందిన పరాక్రమశాలులై తమ పితరుల యిండ్లకు పెద్దలైరి.
- 25అయితే వారు తమ పితరుల దేవునిమీద తిరుగుబాటుచేసి, దేవుడు తమ ముందర నాశనము చేసిన జనసమూహముల దేవతలతో వ్యభిచరించిరి.
- 26కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రమువారిని చెరపట్టి నేటికిని కనబడు చున్నట్లుగా హాలహునకును హాబోరునకును హారాకును గోజాను నదీప్రాంతములకును వారిని కొనిపోయెను.
Cross references
- Psalm 106:34–39 కీర్తనలు 106:34–39యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. వారి విగ్రహములకు పూజచేసిరి అవి వారికి ఉరి ఆయెను. మరియు వారు తమ కూమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము, అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి కనానుదేశపువారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి ఆ రక్తమువలన దేశము అపవిత్రమాయెను తమ క్రియలవలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వ్యభిచరించినవారైరి.
- Revelation 17:5 ప్రకటన 17:5దాని నొసట దాని పేరు ఈలాగు వ్రాయబడియుండెను మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహా బబులోను.
- Hosea 1:2 హోషేయ 1:2మొదట యెహోవా హోషేయద్వారా ఈ మాట సెలవిచ్చెను జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించియున్నారు గనుక నీవు పోయి, వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి, వ్యభిచారమువల్ల పుట్టిన పిల్లలను తీసికొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను.
- Exodus 34:15 నిర్గమకాండము 34:15ఆ దేశపు నివాసులతో నిబంధనచేసికొనకుండ జాగ్రత్త పడుము; వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన యెడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండ చూచుకొనుము.
- Hosea 9:1 హోషేయ 9:1ఇశ్రాయేలూ, అన్యజనులు సంతోషించునట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు; నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి, నీ కళ్లములన్నిటిమీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపుకూలిని ఆశించితివి.
- 2 Kings 17:7–18 2 రాజులు 17:7–18ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశ ములో నుండియు, ఐగుప్తురాజైన ఫరోయొక్క బలము క్రిందనుండియు, తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపముచేసి యితర దేవతలయందు భయభక్తులు నిలిపి తమయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనముల కట్టడలను, ఇశ్రాయేలురాజులు నిర్ణ యించిన కట్టడలను అనుసరించుచు ఉండిరి. మరియు ఇశ్రాయేలువారు తమ దేవుడైన యెహోవా విషయములో కపటము గలిగి దుర్బోధలు బోధించుచు, అడవి గుడిసెల నివాసులును ప్రాకారములు గల పట్టణనివాసులును తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని యెత్తయిన కొండలన్నిటిమీదనేమి, సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి, అంతటను విగ్రహములను నిలువబెట్టి దేవతా స్తంభములను నిలిపి తమ యెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనులవాడుక చొప్పున ఉన్నతస్థలములలో ధూపము వేయుచు, చెడుతనము జరిగించుచు, యెహోవాకు కోపము పుట్టించి చేయకూడదని వేటినిగూర్చి యెహోవా తమ కాజ్ఞాపించెనో వాటిని చేసి పూజించు చుండిరి. అయిననుమీ దుర్మార్గములను విడిచిపెట్టి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టియు, నా సేవకులగు ప్రవక్తలద్వారా మీకప్పగించినట్టియు ధర్మశాస్త్రమునుబట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి, ప్రవక్త లందరిద్వారాను దీర్ఘదర్శులద్వారాను యెహోవా ఇశ్రా యేలువారికిని యూదావారికిని సాక్ష్యము పలికించినను, వారు విననివారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణ యించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైనదాని అనుస రించుచు, వ్యర్థులైవారి వాడుకలచొప్పున మీరు చేయ కూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టునున్న ఆ జనుల మర్యాదల ననుసరించి వారివంటివారైరి. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని యనుసరింపక పోత విగ్రహములైన రెండు దూడలను చేసి దేవతాస్తంభ ములను నిలిపి ఆకాశసమూహమునకు నమస్కరించి బయలు దేవతను పూజించిరి. మరియు తమ కుమారులను కుమార్తె లను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసికొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని, ఆయనకు కోపము పుట్టిం చిరి. కాబట్టి యెహోవా ఇశ్రాయేలువారియందు బహుగా కోపగించి, తన సముఖములోనుండి వారిని వెళ్ల గొట్టెను గనుక యూదాగోత్రము గాక మరి యేగోత్రమును శేషించి యుండలేదు.
- Judges 2:12 న్యాయాధిపతులు 2:12తమ చుట్టునుండు జనుల దేవతలలో ఇతరదేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహో వాకు కోపము పుట్టించిరి.
- Deuteronomy 32:15–18 ద్వితీయోపదేశకాండము 32:15–18యెషూరూను క్రొవ్వినవాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను. వారు అన్యుల దేవతలచేత ఆయనకు రోషము పుట్టిం చిరిహేయకృత్యములచేత ఆయనను కోపింపజేసిరి వారు దేవత్వములేని దయ్యములకు తామెరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి. నిన్ను కనిన దేవుని మరచితివి.
- 2 Chronicles 25:14–15 2 దినవృత్తాంతములు 25:14–15అమజ్యా ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తరువాత అతడు శేయీరువారి దేవతలను తీసికొనివచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపము వేసెను. అందుకొరకు యెహోవా కోపము అమజ్యా మీద రగులుకొనెను. ఆయన అతనియొద్దకు ప్రవక్తను ఒకని పంపగా అతడునీ చేతిలోనుండి తమ జనులను విడిపింప శక్తిలేని దేవతలయొద్ద నీవెందుకు విచారణ చేయుదువని అమజ్యాతో ననెను.
- Judges 2:17 న్యాయాధిపతులు 2:17తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గమునుండి త్వరగా తొలగి పోయి యితర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి; తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి.
- Judges 8:33 న్యాయాధిపతులు 8:33గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు చుట్టునుండు తమ శత్రువులచేతిలోనుండి తమ్మును విడి పించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనక