1 Corinthians · chapter 1 · verse 25
1 Corinthians 1:25 in Telugu
దేవుని వెఱ్ఱితనము మనుష్యజ్ఞానముకంటె జ్ఞానముగలది, దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది.
Devuni verritanamu manushyajnyaanamukante jnyaanamugaladi, devuni balaheenata manushyula balamukante balamainadi.
1 Corinthians 1:25 in English
- King James Version (KJV)
- Because the foolishness of God is wiser than men; and the weakness of God is stronger than men.
- World English Bible (WEB)
- because the foolishness of God is wiser than men, and the weakness of God is stronger than men.
- American Standard Version (ASV)
- Because the foolishness of God is wiser than men; and the weakness of God is stronger than men.
- Bible in Basic English (BBE)
- Because what seems foolish in God is wiser than men; and what seems feeble in God is stronger than men.
- Darby Translation (DBY)
- Because the foolishness of God is wiser than men, and the weakness of God is stronger than men.
- Webster's Bible (WBS)
- Because the foolishness of God is wiser than men; and the weakness of God is stronger than men.
- Young's Literal Translation (YLT)
- because the foolishness of God is wiser than men, and the weakness of God is stronger than men;
Read in context
- 23అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.
- 24ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు.
- 25దేవుని వెఱ్ఱితనము మనుష్యజ్ఞానముకంటె జ్ఞానముగలది, దేవుని బలహీనత మనుష్యుల బలముకంటె బలమైనది.
- 26సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని
- 27ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు,
Cross references
- Romans 11:33–36 రోమీయులకు 11:33–36ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొంద గలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్.
- 1 Corinthians 1:18 1 కొరింథీయులకు 1:18సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.
- Zechariah 4:6–7 జెకర్యా 4:6–7అప్పుడతడు నాతో ఇట్లనెను జెరుబ్బాబెలు నకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే; శక్తిచేత నైనను బలముచేతనై ననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదునుభూమి వగుదువు; కృప కలుగును గాక కృప కలుగునుగాక అని జనులు కేకలువేయగా అతడు పైరాయి తీసికొని పెట్టించును.
- 2 Corinthians 13:4 2 కొరింథీయులకు 13:4బలహీనతనుబట్టి ఆయన సిలువవేయబడెను గాని, దేవుని శక్తినిబట్టి జీవించుచున్నాడు. మేమును ఆయనయందుండి బలహీనులమై యున్నాము గాని, మీ యెడల దేవుని శక్తినిబట్టి, ఆయనతో కూడ జీవముగల వారము.
- Judges 7:2–8 న్యాయాధిపతులు 7:2–8యెహోవానీతో నున్న జనులు ఎక్కువ మంది, నేను వారిచేతికి మిద్యానీయులను అప్పగింపతగదు; ఇశ్రాయేలీయులునా బాహుబలము నాకు రక్షణ కలుగచేసికొనెననుకొని నామీద అతిశయించుదురేమో. కాబట్టి నీవుఎవడు భయపడి వణకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్లవలెనని జనులు వినునట్లుగా ప్రకటించు మని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలోనుండి ఇరువది రెండువేలమంది తిరిగి వెళ్లి పోయిరి. పదివేలమంది నిలిచియుండగా యెహోవాఈ జను లింక ఎక్కువమంది, నీళ్లయొద్దకు వారిని దిగజేయుము, అక్కడ నీకొరకు వారిని శోధించెదను. ఇతడు నీతో కూడ పోవలెనని నేను ఎవనిగూర్చి చెప్పు దునో వాడు నీతో పోవలెను; ఇతడు నీతో పోకూడదని యెవనిగూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెల విచ్చెను. అతడు నీళ్లయొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవాకుక్కగతుకునట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకుమోకాళ్లూని క్రుంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. చేతితో నోటికందించుకొని గతికినవారిలెక్క మూడు వందల మంది; మిగిలిన జనులందరు నీళ్లు త్రాగుటకు మోకాళ్లూని క్రుంగిరి. అప్పుడు యెహోవాగతికిన మూడు వందల మనుష్యులద్వారా మిమ్మును రక్షించెదను; మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను; జనులందరు తమ తమ చోట్లకు వెళ్లవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరిని తమ గుడారములకు వెళ్లనంపెను గాని ఆ మూడువందల మందిని నిలుపుకొనెను. మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా నుండెను.
- Zechariah 12:7–8 జెకర్యా 12:7–8మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులును, తమకు కలిగిన ఘనతనుబట్టి యూదావారిమీద అతిశయపడకుండునట్లు యెహోవా యూదావారిని మొదట రక్షించును. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్ష కుడుగా నుండును; ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదువంటివారుగాను, దావీదు సంతతి వారు దేవునివంటి వారుగాను జనుల దృష్టికి యెహోవా దూతలవంటి వారుగాను ఉందురు.
- 1 Corinthians 1:27–29 1 కొరింథీయులకు 1:27–29ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైనవారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్ని కలేనివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు.
- Exodus 14:2–4 నిర్గమకాండము 14:2–4ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్య నున్న బయల్సెఫోను నెదుటను, దిగవలెనని వారితో చెప్పుము; దాని యెదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలీయులనుగూర్చి - వారు ఈ దేశములో చిక్కుబడి యున్నారు; అరణ్యము వారిని మూసి వేసెనని అను కొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచె దను; అతడు వారిని తరుమగా; నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును; నేను యెహోవానని ఐగుప్తీయుల
- 1 Kings 20:14–22 1 రాజులు 20:14–22ఇది యెవరిచేత జరుగునని అహాబు అడుగగా అతడురాజ్యాధిపతులలో ఉన్న ¸యౌవనులచేత జరుగునని యెహోవా సెల విచ్చుచున్నాడని చెప్పెను. యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలెనని రాజు అడుగగా అతడునీవే అని ప్రత్యుత్తరమిచ్చెను. వెంటనే అతడు రాజ్యాధిపతులలో ఉన్న వారి లెక్కచూడగా వారు రెండువందల ముప్పది ఇద్దరైరి. తరువాత జనులను, అనగా ఇశ్రాయేలు వారినందరిని లెక్కింపగా వారు ఏడువేల మందియైరి. మధ్యాహ్నమందు వీరు బయలుదేరగా బెన్హదదును అతనికి సహకారులైన ఆ ముప్పది ఇద్దరు రాజులును గుడారములలో త్రాగి మత్తులై యుండిరి. రాజ్యాధిపతులలోనున్న ఆ ¸యౌవనులు ముందుగా బయలు దేరినప్పుడు సంగతి తెలిసికొనుటకై బెన్హదదు కొందరిని పంపెను. షోమ్రోనులోనుండి కొందరు వచ్చియున్నారని బంటులు తెలియజేయగా అతడువారు సమాధానముగా వచ్చినను యుద్ధము చేయ వచ్చినను వారిని సజీవులుగా పట్టుకొనిరండని ఆజ్ఞాపించెను. రాజ్యాధిపతులలోనున్న ఆ ¸యౌవనులును వారితో కూడనున్న దండువారును పట్టణములోనుండి బయలుదేరి ప్రతివాడు తన్ను ఎదిరించిన వానిని చంపగా సిరియనులు పారిపోయిరి. ఇశ్రాయేలువారు వారిని తరుము చుండగా సిరియా రాజైన బెన్హదదు గుఱ్ఱమెక్కి రౌతులతో గూడ తప్పించుకొని పోయెను. అంతట ఇశ్రాయేలు రాజు బయలుదేరి గుఱ్ఱములను రథములను ఓడించి సిరియనులను బహుగా హతము చేసెను. అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజునొద్దకు వచ్చినీవు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టి యుండుము, ఏడాదినాటికి సిరియారాజు నీమీదికి మరల వచ్చునని అతనితో చెప్పెను.
- Joshua 6:2–5 యెహోషువ 6:2–5అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెనుచూడుము; నేను యెరికోను దాని రాజును పరాక్రమముగల శూరులను నీచేతికి అప్పగించుచున్నాను. మీరందరు యుద్ధసన్న ద్ధులై పట్టణమును ఆవరించి యొకమారు దానిచుట్టు తిరుగ వలెను. ఆలాగు ఆరు దినములు చేయుచు రావలెను. ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువవలెను. ఏడవ దినమున మీరు ఏడు మారులు పట్టణముచుట్టు తిరుగుచుండగా ఆ యాజకులు బూరల నూదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరలధ్వని వినునప్పుడు జను లందరు ఆర్భాటముగా కేకలు వేయవలెను, అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ యెదుటికి చక్కగా ఎక్కుదురు అనెను.
- Judges 15:15–16 న్యాయాధిపతులు 15:15–16అతడు గాడిదయొక్క పచ్చి దవడ యెముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దానిచేత వెయ్యిమంది మనుష్యులను చంపెను. అప్పుడు సమ్సోను గాడిద దవడ యెముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపియున్నాను గాడిద దవడ యెముకతో వెయ్యిమంది నరులను చంపియున్నాను అనెను.
- 1 Samuel 17:40–51 1 సమూయేలు 17:40–51తన కఱ్ఱ చేత పట్టుకొని యేటి లోయలో నుండి అయిదు నున్నని రాళ్లను ఏరుకొని తనయొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీ యుని చేరువకు పోయెను. డాలు మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకువచ్చి చుట్టు పారచూచి దావీదును కనుగొని, అతడు బాలుడై యెఱ్ఱటివాడును రూపసియునై యుండుట చూచి అతని తృణీకరించెను. ఫిలిష్తీయుడుకఱ్ఱ తీసి కొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా? అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగముల కును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీ యుడు దావీదుతో అనగా దావీదునీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును; నేను నిన్ను చంపి నీ తల తెగవేతును; ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయులయొక్క కళేబరములను ఆకాశపక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటెచేతను రక్షించువాడుకాడని యీ దండువా రందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఆ ఫిలిష్తీ యుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యముతట్టు త్వరగా పరుగెత్తిపోయి తన సంచిలో చెయ్యివేసి అందులోనుండి రాయి యొకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయునినుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురుచొచ్చినందున వాడు నేలను బోర్లపడెను. దావీదు ఫిలిష్తీయునికంటె బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్లపడగా దావీదు పరుగెత్తిపోయి ఫిలిష్తీయునిమీద నిలుచుండి వాని కత్తి వర దూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారి పోయిరి.