1 Corinthians · chapter 10 · verse 1
1 Corinthians 10:1 in Telugu
సహోదరులారా, యీ సంగతి మీకు తెలియ కుండుట నాకిష్టములేదు. అదేదనగా, మన పితరులందరు మేఘముక్రింద నుండిరి. వారందరును సముద్రములో నడచిపోయిరి;
Sahodarulaaraa, yee sangati meeku teliya kunduta naakishtamuledu. Adedanagaa, mana pitarulandaru meghamukrinda nundiri. Vaarandarunu samudramulo nadachipoyiri;
1 Corinthians 10:1 in English
- King James Version (KJV)
- Moreover, brethren, I would not that ye should be ignorant, how that all our fathers were under the cloud, and all passed through the sea;
- World English Bible (WEB)
- Now I would not have you ignorant, brothers, that our fathers were all under the cloud, and all passed through the sea;
- American Standard Version (ASV)
- For I would not, brethren, have you ignorant, that our fathers were all under the cloud, and all passed through the sea;
- Bible in Basic English (BBE)
- For it is my desire, my brothers, that you may keep in mind how all our fathers were under the cloud, and they all went through the sea;
- Darby Translation (DBY)
- For I would not have you ignorant, brethren, that all our fathers were under the cloud, and all passed through the sea;
- Webster's Bible (WBS)
- Moreover, brethren, I would not that ye should be ignorant, that all our fathers were under the cloud, and all passed through the sea;
- Young's Literal Translation (YLT)
- And I do not wish you to be ignorant, brethren, that all our fathers were under the cloud, and all passed through the sea,
Read in context
- 1సహోదరులారా, యీ సంగతి మీకు తెలియ కుండుట నాకిష్టములేదు. అదేదనగా, మన పితరులందరు మేఘముక్రింద నుండిరి. వారందరును సముద్రములో నడచిపోయిరి;
- 2అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి;
- 3అందరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి;
Cross references
- Exodus 14:29 నిర్గమకాండము 14:29అయితే ఇశ్రాయేలీయులు ఆరిననేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను గోడవలె నుండెను.
- Nehemiah 9:11–12 నెహెమ్యా 9:11–12మరియు నీ జనులయెదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రముమధ్య పొడినేలను నడచిరి, ఒకడు లోతునీట రాయి వేసినట్లు వారిని తరిమినవారిని అగాధజలములలో నీవు పడవేసితివి. ఇదియుగాక పగటికాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును రాత్రికాలమందు వారు వెళ్లవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్నిస్తంభములో ఉండినవాడవును అయి యుండి వారిని తోడుకొనిపోతివి.
- Psalm 78:13–14 కీర్తనలు 78:13–14ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను ఆయన నీటిని రాశిగా నిలిపెను పగటివేళ మేఘములోనుండియు రాత్రి అంతయు అగ్నిప్రకాశములోనుండియు ఆయన వారికి త్రోవ చూపెను
- Psalm 106:7–11 కీర్తనలు 106:7–11ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక యుండిరి నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక యుండిరి సముద్రమునొద్ద ఎఱ్ఱసముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. అయినను తన మహా పరాక్రమమును ప్రసిద్ధి చేయు టకై ఆయన తన నామమునుబట్టి వారిని రక్షించెను. ఆయన ఎఱ్ఱసముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానముమీద నడుచునట్లు వారిని అగాధజలములలో నడిపించెను. వారి పగవారి చేతిలోనుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.
- Psalm 105:39 కీర్తనలు 105:39వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను రాత్రి వెలుగిచ్చుటకై అగ్నిని కలుగజేసెను.
- Exodus 14:19–22 నిర్గమకాండము 14:19–22అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; ఆ మేఘస్తంభము వారి యెదుటనుండి పోయి వారి వెనుక నిలిచెను అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను; అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని, రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులకు సమీపింపలేదు. మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.
- Exodus 13:21–22 నిర్గమకాండము 13:21–22వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజలయెదుటనుండి తొలగింపలేదు.
- Psalm 77:16–20 కీర్తనలు 77:16–20దేవా, జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులుపడెను అగాధజలములు గజగజలాడెను. మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వణకి కంపించెను. నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహా జలములలో ఉండెను. నీ యడుగుజాడలు గుర్తింపబడక యుండెను. మాషే అహరోనులచేత నీ ప్రజలను మందవలె నడి పించితివి.
- Hebrews 11:29 హెబ్రీయులకు 11:29విశ్వాసమునుబట్టి వారు పొడి నేలమీద నడిచినట్లు ఎఱ్ఱసముద్రములో బడి నడచిపోయిరి. ఐగుప్తీయులు ఆలాగు చేయజూచి మునిగిపోయిరి.
- 1 Corinthians 14:38 1 కొరింథీయులకు 14:38ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే యుండనిమ్ము.
- Psalm 78:53 కీర్తనలు 78:53వారు భయపడకుండ ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను.
- Numbers 14:14 సంఖ్యాకాండము 14:14యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడినవాడ వనియు, నీ మేఘము వారిమీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు గదా.
Original words (Greek)
- Moreover · G1161δέ dé
- brethren · G80ἀδελφός adelphós
- would · G2309θέλω thélō
- that · G3756οὐ ou
- ye · G5209ὑμᾶς hymâs
- ignorant · G50ἀγνοέω agnoéō
- that · G3754ὅτι hóti
- all · G3956πᾶς pâs
- our · G2257ἡμῶν hēmōn
- fathers · G3962πατήρ patḗr
- were · G2258ἦν ēn
- under · G5259ὑπό hypó
- cloud · G3507νεφέλη nephélē
- and · G2532καί kaí
- all · G3956πᾶς pâs
- passed · G1330διέρχομαι diérchomai
- through · G1223διά diá
- sea · G2281θάλασσα thálassa