1 Corinthians · chapter 14 · verse 32
1 Corinthians 14:32 in Telugu
మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి.
Mariyu pravaktala aatmalu pravaktala svaadheenamulo unnavi.
1 Corinthians 14:32 in English
- King James Version (KJV)
- And the spirits of the prophets are subject to the prophets.
- World English Bible (WEB)
- The spirits of the prophets are subject to the prophets,
- American Standard Version (ASV)
- and the spirits of the prophets are subject to the prophets;
- Bible in Basic English (BBE)
- And the spirits of the prophets are controlled by the prophets;
- Darby Translation (DBY)
- And spirits of prophets are subject to prophets.
- Webster's Bible (WBS)
- And the spirits of the prophets are subject to the prophets.
- Young's Literal Translation (YLT)
- and the spiritual gift of prophets to prophets are subject,
Read in context
- 30అయితే కూర్చున్న మరి యొకనికి ఏదైనను బయలు పరచబడిన యెడల మొదటివాడు మౌనముగా ఉండవలెను.
- 31అందరు నేర్చుకొనునట్లును అందరు హెచ్చరిక పొందునట్లును మీరందరు ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును.
- 32మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి.
- 33ఆలాగే పరిశుద్ధుల సంఘము లన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు.
- 34స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది.
Cross references
- 1 John 4:1 1 యోహాను 4:1ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకము లోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.
- Acts 4:19–20 అపొస్తలుల కార్యములు 4:19–20అందుకుపేతురును యోహానును వారినిచూచి దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి; మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;
- 1 Samuel 10:10–13 1 సమూయేలు 10:10–13వారు ఆ కొండదగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూ హము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వము అతని నెరిగినవారందరు అతడు ప్రవక్తలతో కూడనుండి ప్రకటించుట చూచికీషు కుమారునికి సంభవించిన దేమిటి? సౌలును ప్రవక్తలలో నున్నాడా? అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా ఆ స్థల మందుండు ఒకడువారి తండ్రి యెవడని యడిగెను. అందుకు సౌలును ప్రవక్తలలో నున్నాడా? అను సామెత పుట్టెను. అంతట అతడు ప్రకటించుట చాలించి ఉన్నత స్థలమునకు వచ్చెను.
- Job 32:8–11 యోబు 32:8–11అయినను నరులలో ఆత్మ ఒకటి యున్నది సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగ జేయును. వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహు వయస్సుగలవారు ఒకప్పుడు న్యాయము తెలిసినవారుకారు. కావున నేనునా మాట నంగీకరించుడని మనవి చేసి కొనుచున్నాను. నేను సహితము నా తాత్పర్యము తెలుపుదును. ఏమి పలుకుదుమా అని మీరు యోచనచేయుచుండగా నేను మీ మాటలకొరకు కనిపెట్టుకొంటిని మీ అభిప్రాయములు చెవిని వేసికొనుటకై
- 1 Corinthians 14:29–30 1 కొరింథీయులకు 14:29–30ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును; తక్కినవారు వివేచింపవలెను. అయితే కూర్చున్న మరి యొకనికి ఏదైనను బయలు పరచబడిన యెడల మొదటివాడు మౌనముగా ఉండవలెను.
- 2 Kings 2:5 2 రాజులు 2:5యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చినేడు యెహోవా నీయొద్ద నుండి నీ గురువును పరమునకు తీసికొని పోవునని నీ వెరుగు దువా అని ఎలీషాను అడుగగా అతడునేనెరుగుదును మీరు ఊరకుండుడనెను.
- 2 Kings 2:3 2 రాజులు 2:3బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషాయొద్దకు వచ్చినేడు యెహోవా నీయొద్దనుండి నీ గురువును పరమునకు తీసికొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడునేనెరుగు దును, మీరు ఊరకుండుడనెను.
- Jeremiah 20:9 యిర్మీయా 20:9ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను, అని నేనను కొంటినా? అది నా హృదయములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికి యున్నాను, చెప్పక మానలేదు.
- 1 Samuel 19:19–24 1 సమూయేలు 19:19–24దావీదు రామాదగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను; వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు, సమూయేలు వారిమీద నాయకుడుగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతలమీదికి వచ్చెను గనుక వారును ప్రకటింప నారంభించిరి. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను గాని వారును అటువలెనే ప్రకటించుచుండిరి. సౌలు మూడవసారి దూతలను పంపెను గాని వారును ప్రకటించుచుండిరి. కడవరిసారి తానే రామాకు పోయి సేఖూ దగ్గరనున్న గొప్ప బావియొద్దకు వచ్చిసమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడురామా దగ్గర నాయోతులో వారున్నా రని చెప్పెను. అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ప్రయాణము చేయుచు రామాదగ్గరనున్న నాయోతునకు వచ్చువరకు ప్రకటించుచుండెను, మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆ నాటి రాత్రింబగళ్లు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు, పైబట్టలేనివాడై పడియుండెను. అందు వలన సౌలును ప్రవక్తలలోనున్నాడా అను సామెత పుట్టెను.