1 Corinthians · chapter 4 · verse 12
1 Corinthians 4:12 in Telugu
స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. నిందింప బడియు దీవించుచున్నాము; హింసింపబడియు ఓర్చు కొనుచున్నాము;
Svahastamulato panichesi kashtapaduchunnaamu. Nindimpa badiyu deevinchuchunnaamu; hinsimpabadiyu orchu konuchunnaamu;
1 Corinthians 4:12 in English
- King James Version (KJV)
- And labour, working with our own hands: being reviled, we bless; being persecuted, we suffer it:
- World English Bible (WEB)
- We toil, working with our own hands. When people curse us, we bless. Being persecuted, we endure.
- American Standard Version (ASV)
- and we toil, working with our own hands: being reviled, we bless; being persecuted, we endure;
- Bible in Basic English (BBE)
- And with our hands we do the hardest work: when they give us curses we give blessings, when we undergo punishment we take it quietly;
- Darby Translation (DBY)
- and labour, working with our own hands. Railed at, we bless; persecuted, we suffer [it];
- Webster's Bible (WBS)
- And labor, working with our own hands. Being reviled, we bless; being persecuted, we suffer it;
- Young's Literal Translation (YLT)
- and labour, working with [our] own hands; being reviled, we bless; being persecuted, we suffer;
Read in context
- 10మేముక్రీస్తు నిమిత్తము వెఱ్ఱివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు; మేము బలహీనులము, మీరు బలవంతులు; మీరు ఘనులు, మేము ఘనహీనులము.
- 11ఈ గడియవరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము; పిడిగుద్దులు తినుచున్నాము; నిలువరమైన నివాసములేక యున్నాము;
- 12స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము. నిందింప బడియు దీవించుచున్నాము; హింసింపబడియు ఓర్చు కొనుచున్నాము;
- 13దూషింపబడియు బతిమాలుకొను చున్నాము లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటివరకు ఎంచబడియున్నాము.
- 14మిమ్మును సిగ్గుపరచవలెనని కాదుగాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధిచెప్పుటకు ఈ మాటలు వ్రాయు చున్నాను.
Cross references
- 1 Peter 3:9 1 పేతురు 3:9ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.
- Matthew 5:11 మత్తయి 5:11నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.
- Romans 12:14 రోమీయులకు 12:14మిమ్మును హింసించువారిని దీవించుడి; దీవించుడి గాని శపింపవద్దు.
- 1 Peter 4:12–14 1 పేతురు 4:12–14ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమనుగూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతో షించు నిమిత్తము, క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై యున్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైనయెడల మహిమాస్వరూపియైన ఆత్మ, అనగా దేవుని ఆత్మ, మీమీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు.
- Acts 18:3 అపొస్తలుల కార్యములు 18:3వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తిగలవాడు గనుక వారితో కాపురముండెను; వారు కలిసి పనిచేయుచుండిరి.
- Luke 6:28 లూకా 6:28మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును బాధించువారికొరకు ప్రార్థనచేయుడి.
- Romans 12:20 రోమీయులకు 12:20కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు.
- 1 Peter 2:23 1 పేతురు 2:23ఆయన దూషింప బడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.
- Luke 23:34 లూకా 23:34యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి.
- 1 Peter 3:14 1 పేతురు 3:14మీరొకవేళ నీతినిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే; వారి బెదరింపునకు భయపడకుడి కలవరపడకుడి;
- Matthew 5:44 మత్తయి 5:44నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.
- John 15:20 యోహాను 15:20దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు; నా మాట గైకొనినయెడల, మీ మాటకూడ గైకొందురు.