1 Corinthians · chapter 7 · verse 32
1 Corinthians 7:32 in Telugu
మీరు చింతలేని వారై యుండవలెనని కోరుచున్నాను. పెండ్లికానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు.
Meeru chintaleni vaarai yundavalenani koruchunnaanu. Pendlikaanivaadu prabhuvunu elaagu santoshapettagalanani prabhuvu vishayamaina kaaryamulanu goorchi chintinchuchunnaadu.
1 Corinthians 7:32 in English
- King James Version (KJV)
- But I would have you without carefulness. He that is unmarried careth for the things that belong to the Lord, how he may please the Lord:
- World English Bible (WEB)
- But I desire to have you to be free from cares. He who is unmarried is concerned for the things of the Lord, how he may please the Lord;
- American Standard Version (ASV)
- But I would have you to be free from cares. He that is unmarried is careful for the things of the Lord, how he may please the Lord:
- Bible in Basic English (BBE)
- But it is my desire for you to be free from cares. The unmarried man gives his mind to the things of the Lord, how he may give pleasure to the Lord:
- Darby Translation (DBY)
- But I wish you to be without care. The unmarried cares for the things of the Lord, how he shall please the Lord;
- Webster's Bible (WBS)
- But I would have you without anxious care. He that is unmarried, is anxious for the things that belong to the Lord, how he may please the Lord:
- Young's Literal Translation (YLT)
- And I wish you to be without anxiety; the unmarried is anxious for the things of the Lord, how he shall please the Lord;
Read in context
- 30ఏడ్చువారు ఏడ్వనట్టును సంతోషపడువారు సంతోష పడనట్టును కొనువారు తాము కొనినది తమది కానట్టును
- 31ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింప నట్టును ఉండవలెను; ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది.
- 32మీరు చింతలేని వారై యుండవలెనని కోరుచున్నాను. పెండ్లికానివాడు ప్రభువును ఏలాగు సంతోషపెట్టగలనని ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు.
- 33పెండ్లియైనవాడు భార్యను ఏలాగు సంతోషపెట్టగలనని లోకవిషయమైనవాటిని గూర్చి చింతించుచున్నాడు.
- 34అటువలెనే పెండ్లికాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయియుండుటకు ప్రభువు విషయమైన కార్యములనుగూర్చి చింతించుచుందురు గాని పెండ్లియైనది భర్తను ఏలాగు సంతోషపెట్టగలనని లోక విషయమైనవాటిని గూర్చి చింతించుచున్నది.
Cross references
- Matthew 6:25–34 మత్తయి 6:25–34అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి; ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా? మీలో నెవడు చింతించుటవలన తన యెత్తు మూరెడెక్కువ చేసికొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింప నేల? అడవిపువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలో చించుడి. అవి కష్టపడవు, ఒడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానివలెనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంక రించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయ ముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో యేమి త్రాగుదుమో యేమి ధరించు కొందుమో అని చింతింపకుడి; అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును. రేపటినిగూర్చి చింతింపకుడి; రేపటి దినము దాని సంగతులనుగూర్చి చింతించును; ఏనాటికీడు ఆనాటికి చాలును.
- 1 Timothy 5:5 1 తిమోతికి 5:5అయితే నిజముగా అనాథయైన విధవరాలు ఏకాకియై యుండి, దేవునిమీదనే తన నిరీక్షణనుంచుకొని, విజ్ఞాపనలయందును ప్రార్థనలయందును రేయింబగలు నిలుకడగా ఉండును.
- Philippians 4:6 ఫిలిప్పీయులకు 4:6దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి.
- Psalm 55:22 కీర్తనలు 55:22నీ భారము యెహోవామీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.
- Matthew 13:22 మత్తయి 13:22ముండ్లపొదలలో విత్త బడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును.