1 Kings · chapter 21 · verse 3
1 Kings 21:3 in Telugu
అందుకు నాబోతు - నా పిత్రార్జితమును నీ కిచ్చుటకు నాకు ఎంతమాత్రమును వల్లపడదని చెప్పగా
Anduku naabotu - naa pitraarjitamunu nee kichchutaku naaku entamaatramunu vallapadadani cheppagaa
1 Kings 21:3 in English
- King James Version (KJV)
- And Naboth said to Ahab, The LORD forbid it me, that I should give the inheritance of my fathers unto thee.
- World English Bible (WEB)
- Naboth said to Ahab, “May the LORD forbid me, that I should give the inheritance of my fathers to you!”
- American Standard Version (ASV)
- And Naboth said to Ahab, Jehovah forbid it me, that I should give the inheritance of my fathers unto thee.
- Bible in Basic English (BBE)
- But Naboth said to Ahab, By the Lord, far be it from me to give you the heritage of my fathers.
- Darby Translation (DBY)
- And Naboth said to Ahab, Jehovah forbid it me, that I should give the inheritance of my fathers to thee!
- Webster's Bible (WBS)
- And Naboth said to Ahab, The LORD forbid it me, that I should give the inheritance of my fathers to thee.
- Young's Literal Translation (YLT)
- And Naboth saith unto Ahab, 'Far be it from me, by Jehovah, my giving the inheritance of my fathers to thee;'
Read in context
- 1ఈ సంగతులైన తరువాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలువాడైన నాబోతునకు ఒక ద్రాక్షతోట కలిగియుండగా
- 2అహాబు నాబోతును పిలిపించినీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని యున్నది గనుక అది నాకు కూరతోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటె మంచి ద్రాక్షతోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన యెడల దానిని క్రయమునకిమ్మని అడిగెను.
- 3అందుకు నాబోతు - నా పిత్రార్జితమును నీ కిచ్చుటకు నాకు ఎంతమాత్రమును వల్లపడదని చెప్పగా
- 4నా - పిత్రార్జితమును నీ కియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి అహాబు మూతి ముడుచుకొనినవాడై కోపముతో తన నగరునకు పోయి మంచముమీద పరుండి యెవరితోను మాటలాడకయు భోజనము చేయకయు ఉండెను.
- 5అంతట అతని భార్యయైన యెజెబెలు వచ్చినీవు మూతి ముడుచుకొనినవాడవై భోజనము చేయక యుండెదవేమని అతని నడుగగా
Cross references
- Numbers 36:7 సంఖ్యాకాండము 36:7ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రములోనుండి వేరొక గోత్రములోనికి పోకూడదు. ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన పితరుల గోత్రస్వాస్థ్యమును హత్తుకొని యుండవలెను.
- Leviticus 25:23 లేవీయకాండము 25:23భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే, మీరు నాయొద్ద కాపురమున్న పరదేశులు.
- Ezekiel 46:18 యెహెజ్కేలు 46:18జనులు తమ స్వాస్థ్యము ననుభ వింపకుండ అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు; నా జనులు తమ భూములను విడిచి చెదరిపోకుండునట్లు అతడు తన భూమిలోనుండి తన కుమారులకు భాగముల నియ్యవలెను.
- Job 27:5 యోబు 27:5మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పు కొననుమరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను.
- 1 Samuel 24:6 1 సమూయేలు 24:6ఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవానుబట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను.
- Genesis 44:17 ఆదికాండము 44:17అందుకతడు అట్లు చేయుట నాకు దూరమవునుగాక; ఎవనిచేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడుగా నుండును; మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్లుడని చెప్పగా
- 1 Corinthians 6:15 1 కొరింథీయులకు 6:15మీ దేహములు క్రీస్తునకు అవయవములై యున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క అవయవములుగా చేయుదునా? అదెంతమాత్రమును తగదు.
- Romans 7:7 రోమీయులకు 7:7కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మ శాస్త్రము చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును.
- 1 Samuel 12:23 1 సమూయేలు 12:23నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడ నగుదును. అది నాకు దూరమగునుగాక. కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును.
- Romans 3:4 రోమీయులకు 3:4నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లును నీవు వ్యాజ్యెమాడునప్పుడు గెలుచునట్లును. అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు.
- 1 Chronicles 11:19 1 దినవృత్తాంతములు 11:19నేను ఈలాగు చేయకుండ నా దేవుడు నన్ను కాచునుగాక; ప్రాణమునకు తెగించి యీ నీళ్లు తెచ్చిన యీ మనుష్యుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయెను; ఈ ముగ్గురు పరా క్రమశాలులు ఇట్టి పనులు చేసిరి.
- Romans 3:6 రోమీయులకు 3:6అట్లనరాదు. అట్లయిన యెడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును?