1 Samuel · chapter 12 · verse 21
1 Samuel 12:21 in Telugu
ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అను సరించుదురు. నిజముగా అవి మాయయే.
Aayananu visarjimpakudi, aayananu visarjimpuvaaru prayojanamu maalinavai rakshimpaleni maayaa svaroopamulanu anu sarinchuduru. Nijamugaa avi maayaye.
1 Samuel 12:21 in English
- King James Version (KJV)
- And turn ye not aside: for [then should ye go] after vain [things], which cannot profit nor deliver; for they [are] vain.
- World English Bible (WEB)
- Don’t turn away to go after vain things which can’t profit or deliver, for they are vain.
- American Standard Version (ASV)
- and turn ye not aside; for [then would ye go] after vain things which cannot profit nor deliver, for they are vain.
- Bible in Basic English (BBE)
- And do not go from the right way turning to those false gods in which there is no profit and no salvation, for they are false.
- Darby Translation (DBY)
- and turn ye not aside; for [it would be] after vain things which cannot profit nor deliver; for they are vain.
- Webster's Bible (WBS)
- And turn ye not aside: for then [would ye go] after vain [things] , which cannot profit nor deliver; for they [are] vain.
- Young's Literal Translation (YLT)
- and ye do not turn aside after the vain things which do not profit nor deliver, for they [are] vain,
Read in context
- 19సమూయేలుతో ఇట్లనిరిరాజును నియమించుమని మేము అడుగుటచేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితివిు. కాబట్టి మేము మరణము కాకుండ నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము.
- 20అంతట సమూయేలు జనులతో ఇట్లనెనుభయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయి నను యెహోవాను విసర్జింపకుండ ఆయనను అనుసరించుచు పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి.
- 21ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అను సరించుదురు. నిజముగా అవి మాయయే.
- 22యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము గలిగి యున్నాడు; తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు.
- 23నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడ నగుదును. అది నాకు దూరమగునుగాక. కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును.
Cross references
- Habakkuk 2:18 హబక్కూకు 2:18చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుటవలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించినదానియందు నమ్మిక యుంచుటవలన ప్రయోజన మేమి? అబద్ధములు బోధించు పోతవిగ్రహములయందు నమ్మిక యుంచుటవలన ప్రయోజనమేమి?
- Jeremiah 16:19 యిర్మీయా 16:19యెహోవా, నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతములనుండి జనములు నీ యొద్దకు వచ్చిమా పితరులు వ్యర్థమును మాయా రూపమును నిష్ప్రయో జనమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పుదురు.
- Jeremiah 10:15 యిర్మీయా 10:15అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు, విమర్శకాలములో అవి నశించి పోవును,
- Jeremiah 14:22 యిర్మీయా 14:22జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వాననియ్యగలదా? మా దేవుడవైన యెహోవా, నీవే గదా దాని చేయుచున్నావు? నీవే యీ క్రియలన్నియు చేయు చున్నావు; నీకొరకే మేము కనిపెట్టుచున్నాము.
- Deuteronomy 11:16 ద్వితీయోపదేశకాండము 11:16మీ హృదయము మాయలలో చిక్కి త్రోవవిడిచి యితర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండ మీరు జాగ్రత్త పడుడి.
- Jeremiah 2:13 యిర్మీయా 2:13నా జనులు రెండు నేరములు చేసియున్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి యున్నారు, తమకొరకు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొనియున్నారు.
- Isaiah 46:7 యెషయా 46:7వారు భుజముమీద దాని నెక్కించుకొందురు దాని మోసికొనిపోయి తగినచోట నిలువబెట్టుదురు ఆ చోటు విడువకుండ అది అక్కడనే నిలుచును ఒకడు దానికి మొఱ్ఱపెట్టినను ఉత్తరము చెప్పదు వాని శ్రమ పోగొట్టి యెవనిని రక్షింపదు.
- Isaiah 45:20 యెషయా 45:20కూడి రండి జనములలో తప్పించుకొనినవారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి తమ కొయ్యవిగ్రహమును మోయుచు రక్షింపలేని దేవతకు మొఱ్ఱపెట్టువారికి తెలివిలేదు.
- 1 Corinthians 8:4 1 కొరింథీయులకు 8:4కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట విషయము: లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.
- Isaiah 44:9–10 యెషయా 44:9–10విగ్రహమును నిర్మించువారందరు మాయవంటివారు వారికిష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు తామే అందుకు సాక్షులు, వారు గ్రహించువారు కారు ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు. ఎందుకును పనికిరాని విగ్రహమును పోతపోసి దాని నొక దేవునిగా నిరూపించువాడెవడు?
- Jonah 2:8 యోనా 2:8అసత్యమైన వ్యర్థదేవతలయందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు.
- Jeremiah 10:8 యిర్మీయా 10:8జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు; బొమ్మల పూజవలన వచ్చు జ్ఞానము వ్యర్థము.