1 Samuel · chapter 2 · verse 20
1 Samuel 2:20 in Telugu
యెహోవా సన్నిధిని మనవిచేసికొనగా నీకు దొరకిన యీ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానము నిచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్లిరి.
Yehovaa sannidhini manavichesikonagaa neeku dorakina yee santaanamunaku pratigaa yehovaa neeku santaanamu nichchunugaaka ani elee elkaanaanu atani bhaaryanu deevinchina taruvaata vaaru intiki velliri.
1 Samuel 2:20 in English
- King James Version (KJV)
- And Eli blessed Elkanah and his wife, and said, The LORD give thee seed of this woman for the loan which is lent to the LORD. And they went unto their own home.
- World English Bible (WEB)
- Eli blessed Elkanah and his wife, and said, “May the LORD give you offspring from this woman for the petition which was asked of the LORD.” Then they went to their own home.
- American Standard Version (ASV)
- And Eli blessed Elkanah and his wife, and said, Jehovah give thee seed of this woman for the petition which was asked of Jehovah. And they went unto their own home.
- Bible in Basic English (BBE)
- And every year Eli gave Elkanah and his wife a blessing, saying, May the Lord give you offspring by this woman in exchange for the child you have given to the Lord. And they went back to their house.
- Darby Translation (DBY)
- And Eli blessed Elkanah and his wife, and said, Jehovah give thee seed of this woman for the loan which is lent to Jehovah. And they went to their own home.
- Webster's Bible (WBS)
- And Eli blessed Elkanah and his wife, and said, The LORD give thee issue of this woman for the loan which is lent to the LORD. And they went to their own home.
- Young's Literal Translation (YLT)
- And Eli blessed Elkanah, and his wife, and said, 'Jehovah doth appoint for thee seed of this woman, for the petition which she asked for Jehovah;' and they have gone to their place.
Read in context
- 18బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్యచేయు చుండెను.
- 19వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి యేటేట బలి అర్పించుటకు తన పెనిమిటితోకూడ వచ్చినప్పుడు దాని తెచ్చి వాని కిచ్చుచు వచ్చెను.
- 20యెహోవా సన్నిధిని మనవిచేసికొనగా నీకు దొరకిన యీ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానము నిచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్లిరి.
- 21యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతియై ముగ్గురు కుమాళ్లను ఇద్దరు కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి యెదుగుచుండెను.
- 22ఏలీ బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నియు, వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకువచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి యిట్లనెను
Cross references
- 1 Samuel 1:27–28 1 సమూయేలు 1:27–28ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నా కనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను; తాను బ్రదుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను.
- Luke 2:34 లూకా 2:34సుమెయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలు పడునట్లు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడియున్నాడు;
- Ruth 4:11 రూతు 4:11అందుకు పురద్వారముననుండిన ప్రజలందరును పెద్దలునుమేము సాక్షులము, యెహోవా నీ యింటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలినదానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక;
- Genesis 27:27–29 ఆదికాండము 27:27–29అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దుపెట్టుకొనెను. అప్పుడతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి యిట్లనెను. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసనవలె నున్నది. ఆకాశపుమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీ కనుగ్రహించుగాక జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధు జనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక
- Genesis 14:19 ఆదికాండము 14:19అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవునివలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు,
- Numbers 6:23–27 సంఖ్యాకాండము 6:23–27మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక; యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక; యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయులమీద నా నామ మును ఉచ్చరించుటవలన నేను వారిని ఆశీర్వదించెదను.
- Ruth 2:12 రూతు 2:12యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమెకుత్తర మిచ్చెను.
- 1 Samuel 1:11 1 సమూయేలు 1:11సైన్యములకధి పతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను,
Original words (Hebrew)
- Eli · H5941עֵלִי ʻÊlîy
- blessed · H1288בָרַךְ bârak
- Elkanah · H511אֶלְקָנָה ʼElqânâh
- wife · H802אִשָּׁה ʼishshâh
- said · H559אָמַר ʼâmar
- give · H7760שׂוּם sûwm
- seed · H2233זֶרַע zeraʻ
- woman · H802אִשָּׁה ʼishshâh
- loan · H7596שְׁאֵלָה shᵉʼêlâh
- lent · H7592שָׁאַל shâʼal
- went · H1980הָלַךְ hâlak
- home · H4725מָקוֹם mâqôwm