Numbers · chapter 6 · verse 23
Numbers 6:23 in Telugu
మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను.
Meeru ishraayeleeyulanu eelaagu deevimpavalenu.
Numbers 6:23 in English
- King James Version (KJV)
- Speak unto Aaron and unto his sons, saying, On this wise ye shall bless the children of Israel, saying unto them,
- World English Bible (WEB)
- “Speak to Aaron and to his sons, saying, ‘This is how you shall bless the children of Israel.’ You shall tell them,
- American Standard Version (ASV)
- Speak unto Aaron and unto his sons, saying, On this wise ye shall bless the children of Israel: ye shall say unto them,
- Bible in Basic English (BBE)
- Say to Aaron and his sons, These are the words of blessing which are to be used by you in blessing the children of Israel; say to them,
- Darby Translation (DBY)
- Speak unto Aaron and unto his sons, saying, On this wise ye shall bless the children of Israel: saying unto them,
- Webster's Bible (WBS)
- Speak to Aaron and to his sons, saying, On this wise ye shall bless the children of Israel, saying to them,
- Young's Literal Translation (YLT)
- 'Speak unto Aaron, and unto his sons, saying, Thus ye do bless the sons of Israel, saying to them,
Read in context
- 21మ్రొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దాని గూర్చిన విధియు, అతడు నాజీరైయున్నందున యెహో వాకు అర్పింపవలసిన దాని గూర్చిన విధియు ఇదే. తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధిని బట్టి ఇదియంతయు చేయవలెనని చెప్పుము.
- 22యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు అహరోనుతోను అతని కుమారులతోను ఈలాగనుము
- 23మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను.
- 24యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక;
- 25యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక;
Cross references
- Genesis 48:20 ఆదికాండము 48:20ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిమువలెను మనష్షేవలెను దేవుడు నిన్ను చేయును గాకని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరనెను. ఆలాగు అతడు మనష్షేకంటె ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను.
- Deuteronomy 21:5 ద్వితీయోపదేశకాండము 21:5అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలెను. యెహోవాను సేవించి యెహోవా నామ మున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటిమాటచేత ప్రతి వివాదమును దెబ్బవిషయమైన ప్రతి వ్యాజ్యెమును విమర్శింపబడవలెను.
- 1 Chronicles 23:13 1 దినవృత్తాంతములు 23:13అమ్రాము కుమారులు అహరోను మోషే; అహరోనును అతని కుమారులును నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి.
- Hebrews 7:1 హెబ్రీయులకు 7:1రాజులను సంహారముచేసి, తిరిగి వచ్చుచున్న అబ్రాహామును
- 2 John 1:3 2 యోహాను 1:3సత్యప్రేమలు మనయందుండగా తండ్రియైన దేవుని యొద్దనుండియు, తండ్రియొక్క కుమారుడగు యేసుక్రీస్తునొద్దనుండియు కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును.
- Leviticus 9:22–23 లేవీయకాండము 9:22–23అప్పుడు అహరోను పాపపరిహారార్థబలిని దహనబలిని సమాధానబలిని అర్పించి, ప్రజలవైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగివచ్చెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడా రములోనికి పోయి వెలుపలికివచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలకందరికి కనబడెను.
- Hebrews 11:20–21 హెబ్రీయులకు 11:20–21విశ్వాసమునుబట్టి ఇస్సాకు జరుగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. విశ్వాసమునుబట్టి యాకోబు అవసానకాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికఱ్ఱ మొదలుమీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను.
- Genesis 28:3–4 ఆదికాండము 28:3–4సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రాహామున కిచ్చిన దేశమును, నీవు స్వాస్థ్యముగా చేసికొనునట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడ నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాక అని అతని దీవించి యాకోబును పంపివేసెను.
- Genesis 47:7 ఆదికాండము 47:7మరియు యోసేపు తన తండ్రియైన యాకోబును లోపలికి తీసికొని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను.
- 2 Corinthians 13:14 2 కొరింథీయులకు 13:14ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
- Genesis 14:19–20 ఆదికాండము 14:19–20అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవునివలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతి కప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్ని టిలో ఇతనికి పదియవవంతు ఇచ్చెను.
- Genesis 27:27–29 ఆదికాండము 27:27–29అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దుపెట్టుకొనెను. అప్పుడతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి యిట్లనెను. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసనవలె నున్నది. ఆకాశపుమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీ కనుగ్రహించుగాక జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధు జనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక