1 Samuel · chapter 6 · verse 16
1 Samuel 6:16 in Telugu
ఫిలిష్తీయుల సర్దారులు అయిదుగురు అంతవరకు చూచి నాడే ఎక్రోనునకు తిరిగి వెళ్లిరి
Philishteeyula sardaarulu ayiduguru antavaraku choochi naade ekronunaku tirigi velliri
1 Samuel 6:16 in English
- King James Version (KJV)
- And when the five lords of the Philistines had seen [it], they returned to Ekron the same day.
- World English Bible (WEB)
- When the five lords of the Philistines had seen it, they returned to Ekron the same day.
- American Standard Version (ASV)
- And when the five lords of the Philistines had seen it, they returned to Ekron the same day.
- Bible in Basic English (BBE)
- And the five lords of the Philistines, having seen it, went back to Ekron the same day.
- Darby Translation (DBY)
- And the five lords of the Philistines saw [it], and returned to Ekron the same day.
- Webster's Bible (WBS)
- And when the five lords of the Philistines had seen [it] , they returned to Ekron the same day.
- Young's Literal Translation (YLT)
- and the five princes of the Philistines have seen [it], and turn back [to] Ekron, on that day.
Read in context
- 14ఆ బండి బేత్షెమెషు వాడైన యెహోషువయొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతిదగ్గర నిలువగా, వారు బండి యొక్క కఱ్ఱలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి.
- 15లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులుగల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతిమీద ఉంచగా, ఆ దినమున బేత్షెమెషువారు యెహోవాకు దహనబలులను అర్పించి బలులను వధించిరి.
- 16ఫిలిష్తీయుల సర్దారులు అయిదుగురు అంతవరకు చూచి నాడే ఎక్రోనునకు తిరిగి వెళ్లిరి
- 17అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా, అష్డోదువారి నిమిత్తము ఒకటి, గాజావారి నిమిత్తము ఒకటి, అష్కెలోను వారి నిమిత్తము ఒకటి, గాతువారి నిమిత్తము ఒకటి, ఎక్రోనువారి నిమిత్తము ఒకటి.
- 18ప్రాకారముగల పట్టణములవారేమి పొలములోని గ్రామములవారేమి ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు పంది కొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్దరాయి దీనికి సాక్ష్యము. నేటివరకు ఆ రాయి బేత్షెమెషు వాడైన యెహోషువయొక్క పొలములో నున్నది.
Cross references
- Judges 3:3 న్యాయాధిపతులు 3:3ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారుల జనులును, కనానీయులందరును, సీదోనీయులును, బయల్హెర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గమువరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులును,
- Joshua 13:3 యెహోషువ 13:3కనానీయులవని యెంచబడిన ఉత్తరదిక్కున ఎక్రోనీ యుల సరిహద్దువరకును ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారులకు చేరిన గాజీయులయొక్కయు అష్డోదీయుల యొక్కయు అష్కెలోనీయులయొక్కయు గాతీయుల యొక్కయు ఎక్రోనీయులయొక్కయు దేశమును
- 1 Samuel 6:4 1 సమూయేలు 6:4ఫలిష్తీయులుమనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణమేదని వారినడుగగా వారుమీ అందరిమీదను మీ సర్దారులందరి మీదను ఉన్నతెగులు ఒక్కటే గనుక, ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున అయిదు బంగారపు గడ్డల రూపములను, అయిదు బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను.
- 1 Samuel 5:10 1 సమూయేలు 5:10వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోను లోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసిమనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసికొని వచ్చిరనిరి.
- 1 Samuel 6:12 1 సమూయేలు 6:12ఆ ఆవులు రాజ మార్గమునబడి చక్కగా పోవుచు అరచుచు, బేత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబ డియే బేత్షెమెషు సరిహద్దు వరకు పోయిరి.
- Judges 16:23–30 న్యాయాధిపతులు 16:23–30ఫిలిష్తీయుల సర్దారులుమన దేవత మన శత్రువైన సమ్సోనును మనచేతికి అప్పగించియున్నదని చెప్పుకొని, తమ దేవతయైన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడు కొనిరి. జనులు సమ్సో నును చూచినప్పుడుమన దేశమును పాడుచేసినవాడును మనలో అనేకులను చంపినవాడునైన మన శత్రువుని మన దేవత మన చేతి కప్పగించియున్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయములు సంతోషముతో నిండియుండగా వారుమనము పరిహాసము చేయుటకు సమ్సోనును పిలిపించుదము రండని సమ్సోనును బందీ గృహమునుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలువ బెట్టి పరిహాసముచేయగా సమ్సోను తనచేతిని పట్టు కొనిన బంటుతో ఇట్లనెనుఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటిమీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండెను, ఫిలిష్తీయుల సర్దారు లందరు అక్కడ నుండిరి, వారు సమ్సోనును ఎగతాళి చేయగా గుడి కప్పుమీద స్త్రీ పురుషులు రమారమి మూడు వేలమంది చూచుచుండిరి. అప్పుడు సమ్సోను యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసి కొనుము, దేవా దయచేసి యీసారి మాత్రమే నన్ను బల పరచుము, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగతీర్చుకొననిమ్మని యెహోవాకు మొఱ్ఱపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడిచేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులును చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపినవారి శవముల లెక్క జీవితకాల మందు అతడు చంపినవారి లెక్కకంటె ఎక్కువాయెను.
- Judges 16:5 న్యాయాధిపతులు 16:5ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతోనీవు అతని లాలనచేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో, మేమేలాగు అతని గెలువ వచ్చునో తెలిసికొనుము; మేము అతని బంధించి అతని గర్వము అణుపుదుము, అప్పుడు మాలో ప్రతివాడును వెయ్యిన్నినూరు వెండి నాణములను నీకిచ్చెదమని చెప్పిరి.