1 Samuel · chapter 7 · verse 17
1 Samuel 7:17 in Telugu
మరియు అతని యిల్లు రామాలోనుండినందున అచ్చటికి తిరిగివచ్చి అచ్చటకూడను న్యాయము తీర్చుచుండెను, మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను.
Mariyu atani yillu raamaalonundinanduna achchatiki tirigivachchi achchatakoodanu nyaayamu teerchuchundenu, mariyu atadu akkada yehovaaku oka balipeethamu kattenu.
1 Samuel 7:17 in English
- King James Version (KJV)
- And his return [was] to Ramah; for there [was] his house; and there he judged Israel; and there he built an altar unto the LORD.
- World English Bible (WEB)
- His return was to Ramah, for his house was there, and he judged Israel there; and he built an altar to the LORD there.
- American Standard Version (ASV)
- And his return was to Ramah, for there was his house; and there he judged Israel: and he built there an altar unto Jehovah.
- Bible in Basic English (BBE)
- And his base was at Ramah, where his house was; there he was judge of Israel and there he made an altar to the Lord.
- Darby Translation (DBY)
- And his return was to Ramah; for there was his house, and there he judged Israel; and there he built an altar to Jehovah.
- Webster's Bible (WBS)
- And his return [was] to Ramah; for there [was] his house; and there he judged Israel; and there he built an altar to the LORD.
- Young's Literal Translation (YLT)
- and his returning [is] to Ramath, for there [is] his house, and there he hath judged Israel, and he buildeth there an altar to Jehovah.
Read in context
- 15సమూయేలు తాను బ్రదికిన దినములన్నియు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను.
- 16ఏటేట అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలములయందు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చెను.
- 17మరియు అతని యిల్లు రామాలోనుండినందున అచ్చటికి తిరిగివచ్చి అచ్చటకూడను న్యాయము తీర్చుచుండెను, మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను.
Cross references
- 1 Samuel 1:19 1 సమూయేలు 1:19తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ యింటికి వచ్చిరి. అంతట ఎల్కానా తన భార్య యగు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసికొనెను
- 1 Samuel 1:1 1 సమూయేలు 1:1ఎఫ్రాయిము మన్యమందు రామతయిమ్సోఫీము పట్ట ణపువాడు ఒకడుండెను; అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయీమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు, అతనికి ఇద్దరు భార్యలుండిరి.
- 1 Samuel 8:4 1 సమూయేలు 8:4ఇశ్రాయేలీయుల పెద్దలందరు కూడి రామాలో సమూయేలునొద్దకు వచ్చి
- Judges 21:4–5 న్యాయాధిపతులు 21:4–5మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహనబలులను సమాధానబలులను అర్పించిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయినవారెవరని విచారించిరి. ఏలయనగా అట్టివారికి నిశ్చయముగా మరణశిక్ష విధింప వలెనని ఖండితముగా ప్రమాణము చేసియుండిరి.
- 1 Samuel 11:15 1 సమూయేలు 11:15జనులందరు గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధానబలులను అర్పించి, యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును ఇశ్రాయేలీయులందరును అక్కడ బహుగా సంతోషించిరి.
- 1 Kings 18:30–36 1 రాజులు 18:30–36అప్పుడు ఏలీయానా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరును అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడ ద్రోయబడియున్న యెహోవా బలిపీఠమును బాగుచేసి, యహోవావాక్కు ప్రత్యక్షమైనీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు రాళ్లను తీసికొని ఆ రాళ్లచేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి, దానిచుట్టు రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందకమొకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి యెద్దును తునకలుగా కోసి ఆ కట్టెలమీద ఉంచి, జనులు చూచుచుండగామీరు నాలుగు తొట్లనిండ నీళ్లు నింపి దహనబలి పశుమాంసముమీదను కట్టెలమీదను పోయుడని చెప్పెను అదియైన తరువాతరెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును ఆలాగు చేసిరి; మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసిరి; అప్పుడు ఆ నీళ్లు బలి పీఠముచుట్టును పొర్లి పారెను; మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలీయా దగ్గరకు వచ్చి యీలాగు ప్రార్థనచేసెనుయెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము.
- Genesis 33:20 ఆదికాండము 33:20అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను.
- Genesis 35:7 ఆదికాండము 35:7అతడు తన సహోదరుని యెదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్షమాయెను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరుపెట్టిరి.
- 1 Samuel 19:18–23 1 సమూయేలు 19:18–23ఆలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలో నున్న సమూయేలునొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచట కాపురముండిరి. దావీదు రామాదగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను; వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు, సమూయేలు వారిమీద నాయకుడుగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతలమీదికి వచ్చెను గనుక వారును ప్రకటింప నారంభించిరి. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెను గాని వారును అటువలెనే ప్రకటించుచుండిరి. సౌలు మూడవసారి దూతలను పంపెను గాని వారును ప్రకటించుచుండిరి. కడవరిసారి తానే రామాకు పోయి సేఖూ దగ్గరనున్న గొప్ప బావియొద్దకు వచ్చిసమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడురామా దగ్గర నాయోతులో వారున్నా రని చెప్పెను. అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ప్రయాణము చేయుచు రామాదగ్గరనున్న నాయోతునకు వచ్చువరకు ప్రకటించుచుండెను,
- Genesis 12:7–8 ఆదికాండము 12:7–8యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి నీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను.