1 Samuel · chapter 8 · verse 9
1 Samuel 8:9 in Telugu
అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము.
Ayite vaarini elabovu raaju ettivaadaguno neeve saakshivai vaariki drudhamugaa teliyajeyumu.
1 Samuel 8:9 in English
- King James Version (KJV)
- Now therefore hearken unto their voice: howbeit yet protest solemnly unto them, and shew them the manner of the king that shall reign over them.
- World English Bible (WEB)
- Now therefore, listen to their voice. However, you shall protest solemnly to them, and shall show them the way of the king who will reign over them.”
- American Standard Version (ASV)
- Now therefore hearken unto their voice: howbeit thou shalt protest solemnly unto them, and shalt show them the manner of the king that shall reign over them.
- Bible in Basic English (BBE)
- Give ear now to their voice: but make a serious protest to them, and give them a picture of the sort of king who will be their ruler.
- Darby Translation (DBY)
- And now hearken unto their voice; only, testify solemnly unto them, and declare unto them the manner of the king that shall reign over them.
- Webster's Bible (WBS)
- Now therefore hearken to their voice: yet protest solemnly to them, and show them the manner of the king that will reign over them.
- Young's Literal Translation (YLT)
- And now, hearken to their voice; only, surely thou dost certainly protest to them, and hast declared to them the custom of the king who doth reign over them.'
Read in context
- 7అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగాజనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము; వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించి యున్నారు.
- 8వారు నన్ను విసర్జించి, యితర దేవతలను పూజించి, నేను ఐగుప్తులోనుండి వారిని రప్పించిన నాటి నుండి నేటివరకు తాము చేయుచువచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీయెడలను జరిగించుచున్నారు; వారు చెప్పిన మాటలను అంగీకరించుము.
- 9అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము.
- 10సమూయేలు తనను, రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్ని వినిపించి
- 11ఈలాగున చెప్పెనుమిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా, అతడు మీ కుమారులను పట్టుకొని, తన రథములను తోలుటకును తన గుఱ్ఱములను కాపాడుటకును వారిని ఉంచుకొనును, కొందరు అతని రథముల ముందర పరగెత్తుదురు.
Cross references
- 1 Samuel 10:25 1 సమూయేలు 10:25తరువాత సమూయేలు రాజ్యపాలనపద్ధతిని జనులకు వినిపించి, ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. అంతట సమూయేలు జనులందరిని వారి వారి ఇండ్లకు పంపివేసెను.
- 1 Samuel 8:11–18 1 సమూయేలు 8:11–18ఈలాగున చెప్పెనుమిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా, అతడు మీ కుమారులను పట్టుకొని, తన రథములను తోలుటకును తన గుఱ్ఱములను కాపాడుటకును వారిని ఉంచుకొనును, కొందరు అతని రథముల ముందర పరగెత్తుదురు. మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును; తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధా యుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును. మీ కుమార్తెలను భక్ష్యకారిణులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారిని గాను పెట్టుకొనును. మీ పొలములలోను మీ ద్రాక్షతోటలలోను ఒలీవతోటలలోను శ్రేష్ఠమైనవాటిని తీసికొని తన సేవకులకిచ్చును. మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను పదియవ భాగము తీసి తన పరివారజనమునకును సేవకులకును ఇచ్చును. మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను గార్దభములలోను శ్రేష్ఠమైన వాటిని పట్టుకొని తన పనికొరకు ఉంచుకొనును. మీ మందలో పదియవభాగము పట్టుకొనును, మీమట్టుకు మీరు అతనికి దాసులవుదురు. ఆ దినమున మీరు కోరు కొనిన రాజునుబట్టి మీరు మొఱ్ఱపెట్టినను యెహోవా మీ మొఱ్ఱవినక పోవును అనెను.
- Ezekiel 3:18 యెహెజ్కేలు 3:18అవశ్యముగా నీవు మరణ మవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు, అతడు జీవించునట్లు తన దుర్మార్గతను విడిచి పెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకయు నుండినయెడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమునుబట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును.
- Ezekiel 46:18 యెహెజ్కేలు 46:18జనులు తమ స్వాస్థ్యము ననుభ వింపకుండ అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు; నా జనులు తమ భూములను విడిచి చెదరిపోకుండునట్లు అతడు తన భూమిలోనుండి తన కుమారులకు భాగముల నియ్యవలెను.
- Ezekiel 45:7–8 యెహెజ్కేలు 45:7–8మరియు ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై యేర్పడిన ప్రదేశమునకును ఎదురుగా వాటికి పడ మటగాను తూర్పుగాను, ప్రతిష్ఠితభాగమునకును పట్టణము నకై యేర్పడిన దేశమునకును ఇరుప్రక్కల అధిపతికి భూమి నేర్పాటుచేయవలెను. పడమటినుండి తూర్పు వరకు దాని కొలువగా అదియొక గోత్రస్థానమునకు సరిపడు నిడివిగలదై యుండవలెను. అధిపతి యిక నా జనులను బాధింపక వారి గోత్రములనుబట్టి భూమి అంతయు ఇశ్రాయేలీయులకు నియమించునట్లు అది ఇశ్రాయేలీయులలో అతనికి భూస్వాస్థ్యముగా ఉండును.
- 1 Samuel 2:13 1 సమూయేలు 2:13జనులవిషయమై యాజకులు చేయుచు వచ్చిన పని యేమనగా, ఎవడైన బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు మూడు ముండ్లుగల కొంకిని తీసికొనివచ్చి
- 1 Samuel 14:52 1 సమూయేలు 14:52సౌలు బ్రదికిన దినములన్నియు ఫిలిష్తీయులతో ఘోర యుద్ధము జరుగగా తాను చూచిన బలాఢ్యుల నందరిని పరాక్రమశాలులనందరిని తనయొద్దకు చేర్చుకొనెను.