2 Chronicles · chapter 18 · verse 2
2 Chronicles 18:2 in Telugu
కొన్ని సంవత్సరములు గతించినమీదట షోమ్రోనులో నుండు అహాబునొద్దకు పోయెను; అహాబు అతని కొరకును అతని వెంటవచ్చిన జనులకొరకును అనేక మైన గొఱ్ఱెలను పశువులను కోయించి, తనతోకూడ రామోత్గిలాదు మీదికిపోవుటకు అతని ప్రేరేపించెను.
Konni sanvatsaramulu gatinchinameedata shomronulo nundu ahaabunoddaku poyenu; ahaabu atani korakunu atani ventavachchina janulakorakunu aneka maina gorrelanu pashuvulanu koyinchi, tanatokooda raamotgilaadu meedikipovutaku atani prerepinchenu.
2 Chronicles 18:2 in English
- King James Version (KJV)
- And after [certain] years he went down to Ahab to Samaria. And Ahab killed sheep and oxen for him in abundance, and for the people that [he had] with him, and persuaded him to go up [with him] to Ramoth-gilead.
- World English Bible (WEB)
- After some years, he went down to Ahab to Samaria. Ahab killed sheep and cattle for him in abundance, and for the people who were with him, and moved him to go up with him to Ramoth Gilead.
- American Standard Version (ASV)
- And after certain years he went down to Ahab to Samaria. And Ahab killed sheep and oxen for him in abundance, and for the people that were with him, and moved him to go up [with him] to Ramoth-gilead.
- Bible in Basic English (BBE)
- And after some years he went down to Samaria to see Ahab. And Ahab made a feast for him and the people who were with him, putting to death great numbers of sheep and oxen; and he got Jehoshaphat to go with him to Ramoth-gilead.
- Darby Translation (DBY)
- And after [certain] years he went down to Ahab, to Samaria. And Ahab killed sheep and oxen for him in abundance, and for the people that were with him, and urged him to go up against Ramoth-Gilead.
- Webster's Bible (WBS)
- And after [certain] years he went down to Ahab to Samaria. And Ahab killed sheep and oxen for him in abundance, and for the people that [he had] with him, and persuaded him to go up [with him] to Ramoth-gilead.
- Young's Literal Translation (YLT)
- and goeth down at the end of [certain] years unto Ahab to Samaria, and Ahab sacrificeth for him sheep and oxen in abundance, and for the people who [are] with him, and persuadeth him to go up unto Ramoth-Gilead.
Read in context
- 1తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు అహాబుతో వియ్యమంది
- 2కొన్ని సంవత్సరములు గతించినమీదట షోమ్రోనులో నుండు అహాబునొద్దకు పోయెను; అహాబు అతని కొరకును అతని వెంటవచ్చిన జనులకొరకును అనేక మైన గొఱ్ఱెలను పశువులను కోయించి, తనతోకూడ రామోత్గిలాదు మీదికిపోవుటకు అతని ప్రేరేపించెను.
- 3ఇశ్రాయేలు రాజైన అహాబు యూదారాజైన యెహోషాపాతును చూచినీవు నాతోకూడ రామోత్గిలాదునకు వచ్చెదవా అని అడుగగా యెహోషాపాతునేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడ యుధ్దమునకు వచ్చెద మని చెప్పెను.
- 4మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతోనేడు యెహోవాయొద్ద సంగతి విచారణ చేయుదము రండనగా
Cross references
- 2 Kings 9:1 2 రాజులు 9:1అంతట ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకనిని పిలువనంపించి అతనితో ఇట్లనెనునీవు నడుము బిగించుకొని యీ తైలపుగిన్నె చేత పట్టుకొని రామో త్గిలాదునకు పోయి
- 2 Chronicles 19:2 2 దినవృత్తాంతములు 19:2దీర్ఘదర్శి హనానీ కుమారుడునగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి, రాజైన యెహోషాపాతుకు ఈలాగు ప్రకటనచేసెనునీవు భక్తిహీనులకు సహాయముచేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గదా? అందువలన యెహోవా సన్నిధినుండి కోపము నీమీదికి వచ్చును.
- 1 Kings 1:9 1 రాజులు 1:9అదోనీయా ఏన్రోగేలు సమీప మందుండు జోహెలేతు అను బండదగ్గర గొఱ్ఱెలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి, రాజకుమారు లగు తన సహోదరులనందరిని యూదావారగు రాజు యొక్క సేవకులనందరిని పిలిపించెను గాని
- Deuteronomy 4:43 ద్వితీయోపదేశకాండము 4:43అవేవనగా రూబే నీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసెరును, గాదీ యులకు గిలాదులో నున్న రామోతును, మనష్షీయులకు బాషానులోనున్న గోలాను అనునవే.
- 1 Kings 17:7 1 రాజులు 17:7కొంతకాలమైనతరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను.
- 1 Kings 22:2–35 1 రాజులు 22:2–35మూడవ సంవత్సరమందు యూదారాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలురాజునొద్దకు రాగా ఇశ్రాయేలురాజు తన సేవకులను పిలిపించిరామోత్గిలాదు మనదని మీరెరుగుదురు; అయితే మనము సిరియా రాజు చేతిలోనుండి దాని తీసికొనక ఊరకున్నామని చెప్పి యుద్ధము చేయుటకు నాతోకూడ నీవు రామోత్గిలాదునకు వచ్చెదవా అని యెహోషాపాతును అడిగెను. అందుకు యెహోషాపాతునేను నీవాడనే; నా జనులు నీ జనులే నా గుఱ్ఱములును నీ గుఱ్ఱములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పెను. పిమ్మట యెహోషాపాతునేడు యెహోవా యొద్ద విచారణచేయుదము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా ఇశ్రాయేలురాజు దాదాపు నాలుగు వందలమంది ప్రవక్తలను పిలిపించియుద్ధము చేయుటకు రామోత్గిలాదుమీదికి పోదునా పోకుందునా అని వారి నడిగెను. అందుకుయెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పిరి గాని యెహోషాపాతువిచారణ చేయుటకై వీరు తప్పయెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగెను. అందుకు ఇశ్రాయేలురాజుఇవ్లూ కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు; అతనిద్వారా మనము యెహోవాయొద్ద విచారణ చేయవచ్చును గాని, అతడు నన్నుగూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతనియందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా యెహోషాపాతురాజైన మీరు ఆలా గనవద్దనెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారములో ఒకనిని పిలిచిఇవ్లూ కుమారుడైన మీకాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించుమని సెలవిచ్చెను. ఇశ్రాయేలు రాజును యూదారాజగు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని, షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెలమీద ఆసీనులై యుండి, ప్రవక్తలందరును వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా కెనయనా కుమారుడైన సిద్కియా యినుప కొమ్ములు చేయించుకొని వచ్చివీటిచేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చు చున్నాడని చెప్పెను. ప్రవక్తలందరును ఆ చొప్పుననే ప్రకటన చేయుచుయెహోవా రామోత్గిలాదును రాజవైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దానిమీదికి పోయి జయమొందుదువు అని చెప్పిరి. మీకాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా మీకాయాయెహోవా నాకు సెల విచ్చునదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలు కుదుననెను. అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు రాజుమీకాయా, నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్గిలాదు మీదికి పోదుమా పోకుందుమా అని యడుగగా అతడుయెహోవా దానిని రాజవైన నీ చేతికి నప్ప గించును గనుక నీవు దానిమీదికిపోయి జయమొందుదువని రాజుతో అనెను. అందుకు రాజునీచేత ప్రమాణము చేయించి యెహోవా నామమునుబట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేనెన్ని మారులు నీతో చెప్పితిని అని రాజు సెలవియ్యగా అతడుఇశ్రాయేలీయు లందరును కాపరిలేని గొఱ్ఱెలవలెనే కొండలమీద చెదరి యుండుట నేను చూచితిని వారికి యజమానుడు లేడు; ఎవరి యింటికి వారు సమాధానముగా వెళ్లవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పెను. అప్పుడు ఇశ్రా యేలురాజు యెహోషాపాతును చూచిఇతడు నన్ను గూర్చి మేలుపలుకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా మీకాయా యిట్లనెనుయెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము; యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచి యుండుట నేను చూచితిని అహాబు రామోత్గిలాదుమీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవియ్యగా, ఒకడు ఈ విధముగాను మరియొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ యెదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడినేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవాఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను. అందుకతడునేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయననీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్నుగూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు. మీకాయా యిట్లనగా, కెనయనా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చినీతో మాటలాడుటకు యెహోవా ఆత్మ నాయొద్దనుండి ఏవైపుగా పోయెనని చెప్పి మీకాయాను చెంపమీద కొట్టెను. అందుకు మీకాయా దాగుకొనుటకై నీవు ఆ యా గదులలోనికి చొరబడు నాడు అది నీకు తెలియ వచ్చునని అతనితో చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలు రాజుమీకాయాను పట్టుకొని తీసికొని పోయి పట్టణపు అధికారియైన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషు నకును అప్పగించి బందీగృహములో ఉంచి, మేము క్షేమముగా తిరిగివచ్చువరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఈయుడని ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు మీకాయా ఈలాగు చెప్పెను సకలజనులారా, నా మాట ఆలకించు డని చెప్పెనురాజవైన నీవు ఏమాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చినయెడల యెహోవా నాచేత పలుకలేదు. ఇశ్రాయేలు రాజును యూదారాజగు యెహోషా పాతును రామోత్గిలాదు మీదికి పోవుచుండగా ఇశ్రా యేలురాజునేను మారువేషము వేసికొని యుద్ధములో ప్రవేశించెదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవే శించుమని యెహోషాపాతుతో చెప్పి మారువేషము వేసికొని యుద్ధమందు ప్రవేశించెను. సరియారాజు తన రథ ములమీద అధికారులైన ముప్పది ఇద్దరు అధిపతులను పిలి పించి అల్పులతోనైనను ఘనులతోనైనను మీరు పోట్లాడవద్దు; ఇశ్రాయేలురాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చియుండగా రథాధిపతులు యెహోషాపాతును చూచియితడే ఇశ్రాయేలు రాజనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చిరి. యెహోషాపాతు కేకలువేయగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలురాజు కానట్టు గురుతుపట్టి అతని తరుముట మానివేసిరి. పమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపుకీలు మధ్యను తగిలెను గనుక అతడునాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసికొని పొమ్మని తన సారధితో చెప్పెను. నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల యెదుట అతని రథముమీద నిలువ బెట్టిరి; అస్తమయమందు అతడు మరణమాయెను; తగిలిన గాయములోనుండి అతని రక్తము కారి రథములో మడుగు గట్టెను.
- Isaiah 22:12–13 యెషయా 22:12–13ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడి చేసికొనుటకును గోనెపట్ట కట్టుకొనుటకును సైన్యములకధిపతియు ప్రభువునగు యెహోవా మిమ్మును పిలువగా రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదము అని చెప్పి, యెడ్లను వధించుచు గొఱ్ఱెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు
- Nehemiah 13:6 నెహెమ్యా 13:6ఆ సమయములో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్త హషస్త యేలుబడియందు ముప్పది రెండవ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్నిదినము లైన తరువాత రాజునొద్ద సెలవుపుచ్చుకొని
- 1 Kings 4:13 1 రాజులు 4:13గెబెరు కుమా రుడు రామోత్గిలాదునందు కాపురముండెను; వీనికి గిలా దులోనుండిన మనష్షేకు కుమారుడైన యాయీరు గ్రామ ములును బాషానులోనున్న అర్గోబు దేశమును నియమింప బడెను; అది ప్రాకారములును ఇత్తడి అడ్డగడలునుగల అరు వది గొప్ప పట్టణములుగల ప్రదేశము.
- Luke 17:27–29 లూకా 17:27–29నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి కియ్యబడుచు నుండిరి; అంతలో జలప్రళయము వచ్చి వారినందరిని నాశనముచేసెను. లోతు దినములలో జరిగి నట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనము చేసెను.
- Joshua 20:8 యెహోషువ 20:8తూర్పుదిక్కున యొర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీ యుల గోత్రములోనుండి మైదానము మీదనున్న అరణ్య ములోని బేసెరును, గాదీయుల గోత్రము లోనుండి గిలాదు లోని రామోతును, మనష్షీయుల గోత్రములోనుండి బాషానులోని గోలానును నియమించిరి.
Original words (Hebrew)
- after · H7093קֵץ qêts
- years · H8141שָׁנֶה shâneh
- down · H3381יָרַד yârad
- Ahab · H256אַחְאָב ʼAchʼâb
- Samaria · H8111שֹׁמְרוֹן Shômᵉrôwn
- Ahab · H256אַחְאָב ʼAchʼâb
- killed · H2076זָבַח zâbach
- sheep · H6629צֹאן tsôʼn
- oxen · H1241בָּקָר bâqâr
- abundance · H7230רֹב rôb
- people · H5971עַם ʻam
- persuaded · H5496סוּת çûwth
- up · H5927עָלָה ʻâlâh
- Ramoth-gilead · H7433רָמֹת גִּלעָד Râmôth Gilʻâd