2 Chronicles · chapter 21 · verse 8
2 Chronicles 21:8 in Telugu
అతని దినములలో ఎదోమీయులు తిరుగబడి యూదావారి అధి కారము త్రోసివేసి తమకు ఒకరాజును చేసికొనగా
Atani dinamulalo edomeeyulu tirugabadi yoodaavaari adhi kaaramu trosivesi tamaku okaraajunu chesikonagaa
2 Chronicles 21:8 in English
- King James Version (KJV)
- In his days the Edomites revolted from under the dominion of Judah, and made themselves a king.
- World English Bible (WEB)
- In his days Edom revolted from under the hand of Judah, and made a king over themselves.
- American Standard Version (ASV)
- In his days Edom revolted from under the hand of Judah, and made a king over themselves.
- Bible in Basic English (BBE)
- In his time Edom made themselves free from the rule of Judah, and took a king for themselves.
- Darby Translation (DBY)
- In his days Edom revolted from under the hand of Judah, and they set a king over themselves.
- Webster's Bible (WBS)
- In his days the Edomites revolted from under the dominion of Judah, and made themselves a king.
- Young's Literal Translation (YLT)
- In his days hath Edom revolted from under the hand of Judah, and cause a king to reign over them;
Read in context
- 6అతడు అహాబు కుమార్తెను పెండ్లిచేసికొని అహాబు సంతతి వారు నడచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడచెను; అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను.
- 7అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును, అతనికిని అతని కుమారులకును నిత్యము దీప మిచ్చెదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సులేక యుండెను.
- 8అతని దినములలో ఎదోమీయులు తిరుగబడి యూదావారి అధి కారము త్రోసివేసి తమకు ఒకరాజును చేసికొనగా
- 9యెహోరాము తన చేతిక్రిందనున్న అధి కారులను వెంట బెట్టుకొని, తన రథములన్నిటితో బయలుదేరి రాత్రివేళ లేచి తన్ను చుట్టుకొనిన ఎదోమీయులను రథాధిపతులను హతముచేసెను.
- 10కాగా నేటివరకును జరుగుచున్నట్టు ఎదోమీయులు యూదావారి చేతిక్రింద నుండక తిరుగ బడిరి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయును అతని చేతిక్రిందనుండి తిరుగబడెను.
Cross references
- 1 Kings 22:47 1 రాజులు 22:47ఆ కాలమందు ఎదోము దేశమునకు రాజు లేకపోయెను; ప్రధానియైన యొకడు రాజ్యపాలనము చేయుచుండెను.
- 2 Kings 8:20–22 2 రాజులు 8:20–22ఇతని దిన ములలో ఎదోమీయులు యూదారాజునకు ఇక లోబడుట మాని అతనిమీద తిరుగుబాటు చేసి, తమమీద నొకని రాజుగా నియమించుకొనినందున యెహోరాము తన రథములన్నిటిని తీసికొని పోయి జాయీరు అను స్థల మునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టునున్న ఎదోమీయులను రథములమీది అధిపతులను హతముచేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయిరి. అయితే నేటివరకును ఎదోమీయులు తిరుగుబాటు చేసి యూదా వారికి లోబడకయే యున్నారు. మరియు ఆ సమయ మందు లిబ్నా పట్టణమును తిరుగబడెను.
- Genesis 27:40 ఆదికాండము 27:40నీవు నీకత్తిచేత బ్రదుకుదువు నీ సహోదరునికి దాసుడవగుదువు నీవు తిరుగులాడు చుండగా నీ మెడ మీదనుండి అతని కాడి విరిచివేయుదువు అని అతని కుత్తరమిచ్చెను.
- 2 Kings 3:9 2 రాజులు 3:9ఇశ్రాయేలురాజును యూదారాజును ఎదోమురాజును బయలుదేరి యేడు దిన ములు చుట్టు తిరిగిన తరువాత, వారితో కూడనున్న దండువారికిని పశువులకును నీళ్లు లేకపోయెను.
- 2 Chronicles 21:10 2 దినవృత్తాంతములు 21:10కాగా నేటివరకును జరుగుచున్నట్టు ఎదోమీయులు యూదావారి చేతిక్రింద నుండక తిరుగ బడిరి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయును అతని చేతిక్రిందనుండి తిరుగబడెను.
- 2 Chronicles 20:22–23 2 దినవృత్తాంతములు 20:22–23వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారిమీదికి వచ్చిన అమ్మోనీయులమీదను మోయాబీయుల మీదను శేయీరు మన్యవాసులమీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అమ్మోనీయులును మోయాబీయులును శేయీరు మన్యనివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచియుండి వారిమీద పడిరి; వారు శేయీరు కాపురస్థులను కడముట్టించిన తరువాత తమలో ఒకరి నొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి.