2 Chronicles · chapter 29 · verse 8
2 Chronicles 29:8 in Telugu
అందుచేత యెహోవా యూదావారిమీదను యెరూ షలేము కాపురస్థులమీదను కోపించి, మీరు కన్నులార చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయ మునకును నిందకును ఆస్పదముగాచేసెను.
Anducheta yehovaa yoodaavaarimeedanu yeroo shalemu kaapurasthulameedanu kopinchi, meeru kannulaara choochuchunnatlugaa vaarini aayana bheetikini vismaya munakunu nindakunu aaspadamugaachesenu.
2 Chronicles 29:8 in English
- King James Version (KJV)
- Wherefore the wrath of the LORD was upon Judah and Jerusalem, and he hath delivered them to trouble, to astonishment, and to hissing, as ye see with your eyes.
- World English Bible (WEB)
- Therefore the LORD’s wrath was on Judah and Jerusalem, and he has delivered them to be tossed back and forth, to be an astonishment and a hissing, as you see with your eyes.
- American Standard Version (ASV)
- Wherefore the wrath of Jehovah was upon Judah and Jerusalem, and he hath delivered them to be tossed to and fro, to be an astonishment, and a hissing, as ye see with your eyes.
- Bible in Basic English (BBE)
- And so the wrath of the Lord has come on Judah and Jerusalem, and he has given them up to be a cause of fear and wonder and shame, as your eyes have seen.
- Darby Translation (DBY)
- Therefore the wrath of Jehovah has been upon Judah and Jerusalem, and he has delivered them to vexation, to desolation, and to hissing, as ye see with your eyes.
- Webster's Bible (WBS)
- Wherefore the wrath of the LORD hath been upon Judah and Jerusalem, and he hath delivered them to trouble, to astonishment, and to hissing, as ye see with your eyes.
- Young's Literal Translation (YLT)
- and the wrath of Jehovah is on Judah and Jerusalem, and He giveth them for a trembling, for an astonishment, and for a hissing, as ye are seeing with your eyes.
Read in context
- 6మన పితరులు ద్రోహులైమన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడతలు నడచి ఆయనను విసర్జించి, ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యముచేసిరి.
- 7మరియు వారు మంటపముయొక్క ద్వారములను మూసివేసి దీప ములను ఆర్పివేసి, పరిశుద్ధస్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహనబలులను అర్పింపకయు ఉండిరి.
- 8అందుచేత యెహోవా యూదావారిమీదను యెరూ షలేము కాపురస్థులమీదను కోపించి, మీరు కన్నులార చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయ మునకును నిందకును ఆస్పదముగాచేసెను.
- 9కాబట్టి మన తండ్రులు కత్తిచేత పడిరి; మన కుమారులును కుమార్తెలును భార్యలును చెరలోనికి కొనపోబడిరి.
- 10ఇప్పుడు మనమీదనున్న ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనస్సులో అభిలాష పుట్టెను.
Cross references
- Jeremiah 25:18 యిర్మీయా 25:18నేటివలెనే పాడు గాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదము గాను చేయుటకు యెరూషలేమునకును యూదా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించితిని.
- Jeremiah 25:9 యిర్మీయా 25:9ఈ దేశముమీదికిని దీని నివాసుల మీదికిని చుట్టునున్న యీ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను; ఈ జనులను శాపగ్రస్తులగాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని పాడుగాను ఉండజేసెదను.
- 2 Chronicles 24:18 2 దినవృత్తాంతములు 24:18జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడచి, దేవతాస్తంభములకును విగ్రహములకును పూజచేసిరి; వారు, చేసిన యీ యప రాధము నిమిత్తము యూదావారిమీదికిని యెరూషలేము కాపురస్థులమీదికిని కోపము వచ్చెను.
- Jeremiah 29:18 యిర్మీయా 29:18యెహోవా వాక్కు ఇదే. వారు విననొల్లనివారై, నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేతవారియొద్దకు పంపిన నా మాటలను ఆలకింపక పోయిరి.
- Deuteronomy 28:25 ద్వితీయోపదేశకాండము 28:25యెహోవా నీ శత్రువుల యెదుట నిన్ను ఓడించును. ఒక్కమార్గ మున వారి యెదుటికి బయలుదేరి నీవు యేడు మార్గముల వారి యెదుటనుండి పారిపోయి, భూరాజ్యములన్నిటి లోనికి యిటు అటు చెదరగొట్ట బడుదువు.
- Jeremiah 19:8 యిర్మీయా 19:8ఆ మార్గమున పోవు ప్రతివాడును ఆశ్చర్య పడి దానికి కలిగిన యిడుమలన్నిటిని చూచి అపహాస్యము చేయునంతగా ఈ పట్టణమును పాడు గాను అపహాస్యాస్పదముగాను నేను చేసెదను.
- Leviticus 26:32 లేవీయకాండము 26:32నేనే మీ దేశమును పాడుచేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు.
- Deuteronomy 28:59 ద్వితీయోపదేశకాండము 28:59యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాల ముండు గొప్ప తెగుళ్లును చెడ్డ రోగములునై యుండును.
- 1 Kings 9:8 1 రాజులు 9:8ఈ మందిరమార్గమున వచ్చువారందరును దానిచూచి, ఆశ్చర్యపడి ఇసీ, యనియెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఈలా గున ఎందుకు చేసెనని యడుగగా
- Deuteronomy 28:15–20 ద్వితీయోపదేశకాండము 28:15–20నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును. పట్టణములో నీవు శపింపబడుదువు; పొలములో నీవు శపింపబడుదువు; నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును; నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొఱ్ఱె మేకల మందలు శపింపబడును; నీవు లోపలికి వచ్చునప్పుడు శపింప బడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడును శపింపబడు దువు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యములచేత నీవు హతము చేయబడి వేగముగా నశించువరకు, నీవు చేయ బూనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును.
- Jeremiah 18:15–16 యిర్మీయా 18:15–16అయితే నా ప్రజలు నన్ను మరిచియున్నారు, మాయకు ధూపము వేయుచున్నారు, మెరకచేయబడని దారిలో తాము నడువవలెనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్రిల్ల చేసికొనుచున్నారు. వారు ఎల్లప్పుడును అపహాస్యాస్పదముగా నుండుటకై తమ దేశమును పాడుగా చేసికొనియున్నారు, దాని మార్గమున నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి తల ఊచును.
- 2 Chronicles 36:14–16 2 దినవృత్తాంతములు 36:14–16అదియుగాక యాజ కులలోను జనులలోను అధిపతులగువారు, అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై, యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాసస్థలమందును కటాక్షము గలవాడై వారియొద్దకు తన దూతలద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచు వచ్చిననుఒ వారు దేవుని దూత లను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరిం చుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను.