2 Chronicles · chapter 5 · verse 14
2 Chronicles 5:14 in Telugu
అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండ నిండెను; యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవచేయుటకు యాజకులు ఆ మేఘమున్నచోట నిలువ లేకపోయిరి.
Appudoka meghamu yehovaa mandiramu ninda nindenu; yehovaa tejassuto devuni mandiramu nindukonagaa sevacheyutaku yaajakulu aa meghamunnachota niluva lekapoyiri.
2 Chronicles 5:14 in English
- King James Version (KJV)
- So that the priests could not stand to minister by reason of the cloud: for the glory of the LORD had filled the house of God.
- World English Bible (WEB)
- so that the priests could not stand to minister by reason of the cloud; for the LORD’s glory filled God’s house.
- American Standard Version (ASV)
- so that the priests could not stand to minister by reason of the cloud: for the glory of Jehovah filled the house of God.
- Bible in Basic English (BBE)
- So that the priests were not able to keep their places to do their work because of the cloud; for the house of God was full of the glory of the Lord.
- Darby Translation (DBY)
- and the priests could not stand to do their service because of the cloud; for the glory of Jehovah had filled the house of God.
- Webster's Bible (WBS)
- So that the priests could not stand to minister by reason of the cloud: for the glory of the LORD had filled the house of God.
- Young's Literal Translation (YLT)
- and the priests have not been able to stand to minister from the presence of the cloud, for the honour of Jehovah hath filled the house of God.
Read in context
- 12ఆసాపు హేమాను యెదూతూనుల సంబంధ మైనవారును, వారి కుమారులకును సహోదరులకును సంబంధికులగు పాటకులైన లేవీయులందరును, సన్నపు నారవస్త్రములను ధరించుకొని తాళములను తంబురలను సితారాలను చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పుతట్టున నిలిచిరి,
- 13వారితో కూడ బూరలు ఊదు యాజకులు నూట ఇరువదిమంది నిలిచిరి; బూరలు ఊదువారును పాట కులును ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానముచేయగా యాజకులు పరిశుద్ధస్థలములో నుండి బయలువెళ్లి, ఆ బూరలతోను తాళములతోను వాద్యములతోను కలిసి స్వరమెత్తియెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రముచేసిరి.
- 14అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండ నిండెను; యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవచేయుటకు యాజకులు ఆ మేఘమున్నచోట నిలువ లేకపోయిరి.
Cross references
- Exodus 40:35 నిర్గమకాండము 40:35ఆ మేఘము మందిరముమీద నిలుచుటచేత మందిరము యెహోవా తేజ స్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లలేకుండెను.
- 1 Kings 8:11 1 రాజులు 8:11కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిర ములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువుచేత యాజ కులు సేవచేయుటకు నిలువలేక పోయిరి.
- Isaiah 6:1–4 యెషయా 6:1–4రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యు న్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా సెరా పులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్క లుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖ మును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను. వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరమువలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా
- Revelation 15:8 ప్రకటన 15:8అంతట దేవుని మహిమనుండియు ఆయన శక్తినుండియు వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ యేడుగురు దూతలయొద్ద ఉన్న యేడు తెగుళ్లు సమాప్తియగువరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయెను.
- 2 Chronicles 7:2 2 దినవృత్తాంతములు 7:2యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి.
- Ezekiel 10:4 యెహెజ్కేలు 10:4యెహోవా మహిమ కెరూబులపైనుండి ఆరోహణమై మందిరపు గడపదగ్గర దిగి నిలిచెను మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండిన దాయెను.
- 1 Timothy 6:16 1 తిమోతికి 6:16సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్.