2 Kings · chapter 11 · verse 21
2 Kings 11:21 in Telugu
యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు ఏడేండ్లవాడు.
Yovaashu elanaarambhinchinappudu atadu edendlavaadu.
2 Kings 11:21 in English
- King James Version (KJV)
- Seven years old [was] Jehoash when he began to reign.
- World English Bible (WEB)
- Jehoash was seven years old when he began to reign.
- American Standard Version (ASV)
- Jehoash was seven years old when he began to reign.
- Bible in Basic English (BBE)
- And Jehoash was seven years old when he became king.
- Darby Translation (DBY)
- Jehoash was seven years old when he began to reign.
- Webster's Bible (WBS)
- Seven years old [was] Jehoash when he began to reign.
- Young's Literal Translation (YLT)
- a son of seven years is Jehoash in his reigning.
Read in context
- 19అతడు శతాధిపతులను అధికారులను కాపుకాయువారిని దేశపు జనులందరిని పిలిపింపగా వారు యెహోవా మందిరములో నున్న రాజునుతీసికొని, కాపుకాయువారి గుమ్మపు మార్గ మున రాజనగరునకు రాగా రాజు సింహాసనముమీద ఆసీనుడాయెను.
- 20మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గముచేత చంపిన తరువాత దేశపు జనులంద రును సంతోషించిరి, పట్టణమును నిమ్మళముగా ఉండెను.
- 21యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు ఏడేండ్లవాడు.
Cross references
- 2 Chronicles 24:1–14 2 దినవృత్తాంతములు 24:1–14యోవాషు ఏలనారంభించినప్పుడు ఏడు సంవత్స రముల యీడుగలవాడై యెరూషలేములో నలువది ఏండ్లు ఏలెను; అతని తల్లి బెయేర్షెబా కాపురస్థురాలైన జిబ్యా. యాజకుడైన యెహోయాదా బ్రదికిన దినములన్నియు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. యెహోయాదా అతనికి యిద్దరు భార్యలను పెండ్లి చేసెను; అతడు కుమారులను కుమార్తెలను కనెను. అంతట యెహోవా మందిరమును బాగుచేయవలెనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను గనుక అతడు యాజకులను లేవీయులను సమకూర్చిమీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరము బాగు చేయుటకై ఇశ్రా యేలీయులందరియొద్దనుండి ధనమును ఏటేట సమకూర్చుచు, ఈ కార్యమును మీరు త్వరపెట్టవలెనని వారికాజ్ఞ ఇచ్చెను. వారు దానిని త్వరగా చేయకపోయినందున రాజు ప్రధానయాజకుడగు యెహోయాదాను పిలిచిఆ దుర్మార్గురాలైన అతల్యాకుమారులు దేవుని మందిర మును పాడుచేసి, యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్ఠోపకరణముల నన్నిటిని బయలుదేవతపూజకు ఉప యోగించిరి. సాక్ష్యపు గుడారమును బాగుచేయుటకైయూదాలో నుండియు యెరూషలేములోనుండియు ఇశ్రాయేలీయుల సమాజకులచేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీ వెందుకు చెప్పి తెప్పించలేదని యడిగెను. కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిరద్వారము బయట ఉంచిరి. మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలీయులకు నిర్ణ యించిన కానుకను యెహోవాయొద్దకు జనులు తేవలెనని యూదాలోను యెరూషలేములోను వారు చాటించిరి. కాగా అధిపతులందరును జనులందరును సంతోషముగా కానుకలను తీసికొని వచ్చి చాలినంతమట్టుకు పెట్టెలో వేసిరి. లేవీయులు ఆ పెట్టెను రాజు విమర్శించు స్థలము నకు తెచ్చుచు వచ్చిరి; అందులో ద్రవ్యము విస్తారముగా నున్నట్టు కనబడినప్పుడెల్ల, రాజుయొక్క ప్రధాన మంత్రియు ప్రధాన యాజకుడు నియమించిన పై విచా రణకర్తయు వచ్చి, పెట్టెలోనున్న ద్రవ్యమును తీసి యథా స్థానమందు దానిని ఉంచుచు వచ్చిరి; వారీచొప్పున పలు మారు చేయుటచేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడెను. అప్పుడు రాజును యెహోయాదాయును యెహోవా మందిరపు పనిచేయువారికి దానినిచ్చి, యెహోవా మందిరమును బాగుచేయుటకై కాసెవారిని వడ్లవారిని, యెహోవా మందిరమును బలపరచుటకు ఇనుపపని యిత్తడిపని చేయువారిని కూలికి కుదిర్చిరి. ఈలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాని బలపరచిరి. అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకును యెహోయాదా యొద్దకును తీసికొనిరాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడు నట్లును, దహనబలుల నర్పించుటయందు ఉపయోగపడు నట్లును, ఉపకరణములను గరిటెలను వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. యెహోయాదాయున్న యన్నిదినములు యెహోవా మందిరములో దహనబలులు నిత్యమును అర్పింపబడెను.
- 2 Kings 11:4 2 రాజులు 11:4ఏడవ సంవత్సరమందు యెహోయాదా కావలికాయు వారిమీదను రాజదేహ సంరక్షకులమీదను ఏర్పడియున్న శతాధిపతులను పిలువనంపించి, యెహోవా మందిరము లోనికి వారిని తీసికొని పోయి, యెహోవా మందిరమందు వారిచేత ప్రమాణము చేయించి వారితో నిబంధనచేసి, వారికి ఆ రాజు కుమారుని కనుపరచి యీలాగు ఆజ్ఞాపించెను
- 2 Kings 22:1 2 రాజులు 22:1యోషీయా యేలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యెరూషలేమునందు ముప్పదియొక సంవత్సరములు ఏలెను, అతని తల్లి బొస్కతు ఊరి వాడగు అదాయాకు కుమార్తెయైన యెదీదా.