2 Kings · chapter 14 · verse 10
2 Kings 14:10 in Telugu
నీవు ఎదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు సరే; యిప్పుడు నీ నగరునందు నీవుండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడుము. నీవు మాత్రము గాక నీతొకూడ యూదావారును కూలునట్లుగా నీవెందుకు అపాయ ములో దిగుదువని చెప్పినను
Neevu edomeeyulanu hatamu chesinanduna nee hrudayamandu neevu atishayapaduchunnaavu sare; yippudu nee nagarunandu neevundi neekunna ghanatanu batti neevu atishayapadumu. Neevu maatramu gaaka neetokooda yoodaavaarunu koolunatlugaa neevenduku apaaya mulo diguduvani cheppinanu
2 Kings 14:10 in English
- King James Version (KJV)
- Thou hast indeed smitten Edom, and thine heart hath lifted thee up: glory [of this], and tarry at home: for why shouldest thou meddle to [thy] hurt, that thou shouldest fall, [even] thou, and Judah with thee?
- World English Bible (WEB)
- You have indeed struck Edom, and your heart has lifted you up. Enjoy the glory of it, and stay at home; for why should you meddle to your harm, that you fall, even you, and Judah with you?”
- American Standard Version (ASV)
- Thou hast indeed smitten Edom, and thy heart hath lifted thee up: glory thereof, and abide at home; for why shouldest thou meddle to [thy] hurt, that thou shouldest fall, even thou, and Judah with thee?
- Bible in Basic English (BBE)
- It is true that you have overcome Edom and your heart is uplifted; let that glory be enough for you, and keep in your country; why do you make causes of trouble, putting yourself, and Judah with you, in danger of downfall?
- Darby Translation (DBY)
- Thou hast indeed smitten Edom, and thy heart has lifted thee up: boast thyself, and abide at home; for why shouldest thou contend with misfortune, that thou shouldest fall, thou, and Judah with thee?
- Webster's Bible (WBS)
- Thou hast indeed smitten Edom, and thy heart hath lifted thee up: glory [of this] , and tarry at home: for why shouldst thou meddle to [thy] hurt, that thou shouldst fall, [even] thou, and Judah with thee?
- Young's Literal Translation (YLT)
- Thou hast certainly smitten Edom, and thy heart hath lifted thee up; be honoured, and abide in thy house; and why dost thou stir thyself up in evil, that thou hast fallen, thou, and Judah with thee?'
Read in context
- 8అంతట అమజ్యా ఇశ్రాయేలురాజైన యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు నొద్దకు దూతలను పంపిమనము ఒకరి నొకరము దర్శించు నట్లు నన్ను కలియ రమ్మని వర్తమానము చేయగా
- 9ఇశ్రా యేలురాజైన యెహోయాషు యూదారాజైన అమజ్యాకు ఈలాగు వర్తమానము పంపెనులెబానోనులోనున్న ముండ్ల చెట్టొకటినీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానో నులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా, లెబానోనులోనున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్లచెట్టును త్రొక్కివేసెను.
- 10నీవు ఎదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు సరే; యిప్పుడు నీ నగరునందు నీవుండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడుము. నీవు మాత్రము గాక నీతొకూడ యూదావారును కూలునట్లుగా నీవెందుకు అపాయ ములో దిగుదువని చెప్పినను
- 11అమజ్యా విననొల్లనందున ఇశ్రాయేలురాజైన యెహోయాషు బయలుదేరి, యూదా సంబంధమైన బేత్షెమెషు పట్టణముదగ్గర తానును యూదా రాజైన అమజ్యాయు కలిసికొనగా
- 12యూదావారు ఇశ్రా యేలువారియెదుట నిలువలేక అపజయమొంది అందరును తమ తమ గుడారములకు పారిపోయిరి.
Cross references
- Deuteronomy 8:14 ద్వితీయోపదేశకాండము 8:14నీ మనస్సు మదించి, దాసులగృహమైన ఐగుప్తుదేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర చెదవేమో.
- 2 Chronicles 26:16 2 దినవృత్తాంతములు 26:16అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠముమీద ధూపమువేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవామీద ద్రోహము చేయగా
- 2 Chronicles 32:25 2 దినవృత్తాంతములు 32:25అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారిమీదికిని కోపము రాగా
- Proverbs 20:3 సామెతలు 20:3కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును.
- Proverbs 15:18 సామెతలు 15:18కోపోద్రేకియగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును.
- Proverbs 3:30 సామెతలు 3:30నీకు హాని చేయనివానితో నిర్నిమిత్తముగా జగడ మాడవద్దు.
- Proverbs 16:18 సామెతలు 16:18నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును
- Daniel 5:20–23 దానియేలు 5:20–23అయితే అతడు మనస్సున అతిశయించి, బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసి కొనగా దేవుడు అతని ప్రభుత్వము నతనియొద్దనుండి తీసి వేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడతడు మానవుల యొద్దనుండి తరమబడి పశువులవంటి మనస్సుగలవాడా యెను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్య ములలో ఏలుచు, ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించు నని అతడు తెలిసికొనువరకు అతడు అడవి గాడిదలమధ్య నివసించుచు పశువులవలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయెను. బెల్షస్సరూ, అతని కుమారుడవగు నీవు ఈ సంగతియంతయు ఎరిగి యుండియు, నీ మనస్సును అణచుకొనక, పరలోకమందున్న ప్రభువుమీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ యధిపతులును నీ రాణులును నీ ఉపపత్నులును దేవుని ఆలయసంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చియుంచు కొని వాటితో త్రాగుచు, చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కఱ్ఱ రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని, నీ ప్రాణమును నీ సకల మార్గములును ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు.
- 2 Kings 14:7 2 రాజులు 14:7మరియు ఉప్పు లోయలో అతడు యుద్ధము చేసి ఎదోమీయులలో పదివేలమందిని హతముచేసి, సెల అను పట్టణమును పట్టుకొని దానికి యొక్తయేలని పేరు పెట్టెను; నేటివరకు దానికి అదే పేరు.
- 2 Chronicles 35:21 2 దినవృత్తాంతములు 35:21అయితే రాజైన నెకో అతనియొద్దకు రాయ బారులను పంపి - యూదారాజా నీతో నాకేమి? పూర్వమునుండి నాకు శత్రువులగువారిమీదికేగాని నేడు నీమీదికి నేను రాలేదు. దేవుడు త్వరచేయుమని నాకు ఆజ్ఞాపించెను గనుక దేవుడు నాతోకూడ ఉండి నిన్ను నశింపజేయ కుండునట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్ప నాజ్ఞాపించెను.
- James 1:9 యాకోబు 1:9దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను.
- Proverbs 26:17 సామెతలు 26:17తనకు పట్టని జగడమునుబట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొనువానితో సమానుడు.