2 Kings · chapter 16 · verse 1
2 Kings 16:1 in Telugu
రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో పదు నేడవ సంవత్సరమందు యూదారాజైన యోతాము కుమా రుడగు ఆహాజు ఏలనారంభించెను.
Remalyaa kumaarudaina pekahu elubadilo padu nedava sanvatsaramandu yoodaaraajaina yotaamu kumaa rudagu aahaaju elanaarambhinchenu.
2 Kings 16:1 in English
- King James Version (KJV)
- In the seventeenth year of Pekah the son of Remaliah Ahaz the son of Jotham king of Judah began to reign.
- World English Bible (WEB)
- In the seventeenth year of Pekah the son of Remaliah, Ahaz the son of Jotham king of Judah began to reign.
- American Standard Version (ASV)
- In the seventeenth year of Pekah the son of Remaliah Ahaz the son of Jotham king of Judah began to reign.
- Bible in Basic English (BBE)
- In the seventeenth year of Pekah, the son of Remaliah, Ahaz, the son of Jotham, became king of Judah.
- Darby Translation (DBY)
- In the seventeenth year of Pekah the son of Remaliah, Ahaz the son of Jotham, king of Judah, began to reign.
- Webster's Bible (WBS)
- In the seventeenth year of Pekah the son of Remaliah Ahaz the son of Jotham king of Judah began to reign.
- Young's Literal Translation (YLT)
- In the seventeenth year of Pekah son of Remaliah reigned hath Ahaz son of Jotham king of Judah.
Read in context
- 1రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో పదు నేడవ సంవత్సరమందు యూదారాజైన యోతాము కుమా రుడగు ఆహాజు ఏలనారంభించెను.
- 2ఆహాజు ఏలనారంభించి నప్పుడు ఇరువది యేండ్లవాడై యెరూషలేమునందు పదు నారు సంవత్సరములు ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలురాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను.
- 3అతడు ఇశ్రాయేలీయుల ముందర నిలువ కుండ యెహోవా వెళ్లగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు, తన కుమారుని అగ్నిగుండమును దాటించెను.
Cross references
- Isaiah 1:1 యెషయా 1:1ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాయను యూదారాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము.
- 2 Kings 15:32–33 2 రాజులు 15:32–33ఇశ్రాయేలురాజును రెమల్యా కుమారుడునైన పెకహు ఏలుబడిలో రెండవ సంవత్సరమున యూదారాజైన ఉజ్జియా కుమారుడగు యోతాము ఏలనారంభించెను. అతడు ఇరువది యయిదేండ్లవాడై యెరూషలేమునందు రాజై పదునారు సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తెయైన యెరూషా.
- Isaiah 7:1 యెషయా 7:1యూదా రాజైన ఉజ్జియా మనుమడును యోతాము కుమారుడునైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పెకహును యుద్ధము చేయవలెనని యెరూషలేముమీదికి వచ్చిరి గాని అది వారివలన కాకపోయెను
- Micah 1:1 మీకా 1:1యోతాము ఆహాజు హిజ్కియా అను యూదా రాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమునుగూర్చియు దర్శనరీతిగా మోరష్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.
- 2 Chronicles 28:1–4 2 దినవృత్తాంతములు 28:1–4ఆహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది సంవత్సర ములవాడై యెరూషలేములో పదునారు సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదువలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడచి, బయలు దేవతా రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్ హిన్నోము లోయయందు ధూపము వేసి ఇశ్రాయేలీయుల యెదుటనుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియలచొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. అతడు ఉన్నతస్థలములలోను కొండలమీదను ప్రతి పచ్చనిచెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను.
- 2 Kings 15:27–30 2 రాజులు 15:27–30యూదారాజైన అజర్యా యేలుబడిలో ఏబదిరెండవ సంవత్సరమందు రెమల్యా కుమారుడైన పెకహు షోమ్రో నులో ఇశ్రాయేలును ఏలనారంభించి యిరువది సంవత్సర ములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఈయోను పట్టణమును, ఆబేల్బేత్మయకా పట్టణమును, యానోయహు పట్టణమును, కెదెషు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలీ దేశమంతయును పట్టుకొని అచ్చట నున్నవారిని అష్షూరు దేశమునకు చెరగా తీసికొని పోయెను. అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలురాజును రెమల్యా కుమారుడునైన పెకహుమీద కుట్రచేసి, అతనిమీద పడి అతని చంపి, యూదా రాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో ఇరువదియవ సంవత్సరమున అతనికి మారుగా రాజాయెను.
- Hosea 1:1 హోషేయ 1:1ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అను యూదారాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలురాజు దినములలోను బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.
- 2 Kings 15:38 2 రాజులు 15:38యోతాము తన పిత రులతో కూడ నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజాయెను.