2 Kings · chapter 17 · verse 16
2 Kings 17:16 in Telugu
వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని యనుసరింపక పోత విగ్రహములైన రెండు దూడలను చేసి దేవతాస్తంభ ములను నిలిపి ఆకాశసమూహమునకు నమస్కరించి బయలు దేవతను పూజించిరి.
Vaaru tama devudaina yehovaa aajnyalannitini yanusarimpaka pota vigrahamulaina rendu doodalanu chesi devataastambha mulanu nilipi aakaashasamoohamunaku namaskarinchi bayalu devatanu poojinchiri.
2 Kings 17:16 in English
- King James Version (KJV)
- And they left all the commandments of the LORD their God, and made them molten images, [even] two calves, and made a grove, and worshipped all the host of heaven, and served Baal.
- World English Bible (WEB)
- They abandoned all the commandments of the LORD their God, and made molten images for themselves, even two calves, and made an Asherah, and worshiped all the army of the sky, and served Baal.
- American Standard Version (ASV)
- And they forsook all the commandments of Jehovah their God, and made them molten images, even two calves, and made an Asherah, and worshipped all the host of heaven, and served Baal.
- Bible in Basic English (BBE)
- And turning their backs on all the orders which the Lord had given them, they made for themselves images of metal, and the image of Asherah, worshipping all the stars of heaven and becoming servants to Baal.
- Darby Translation (DBY)
- And they forsook all the commandments of Jehovah their God, and made them molten images, two calves, and made an Asherah, and worshipped all the host of the heavens, and served Baal;
- Webster's Bible (WBS)
- And they left all the commandments of the LORD their God, and made for themselves molten images, [even] two calves, and made a grove, and worshiped all the host of heaven, and served Baal.
- Young's Literal Translation (YLT)
- And they forsake all the commands of Jehovah their God, and make to them a molten image — two calves, and make a shrine, and bow themselves to all the host of the heavens, and serve Baal,
Read in context
- 14వారు విననివారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి.
- 15వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణ యించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైనదాని అనుస రించుచు, వ్యర్థులైవారి వాడుకలచొప్పున మీరు చేయ కూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టునున్న ఆ జనుల మర్యాదల ననుసరించి వారివంటివారైరి.
- 16వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని యనుసరింపక పోత విగ్రహములైన రెండు దూడలను చేసి దేవతాస్తంభ ములను నిలిపి ఆకాశసమూహమునకు నమస్కరించి బయలు దేవతను పూజించిరి.
- 17మరియు తమ కుమారులను కుమార్తె లను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసికొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని, ఆయనకు కోపము పుట్టిం చిరి.
- 18కాబట్టి యెహోవా ఇశ్రాయేలువారియందు బహుగా కోపగించి, తన సముఖములోనుండి వారిని వెళ్ల గొట్టెను గనుక యూదాగోత్రము గాక మరి యేగోత్రమును శేషించి యుండలేదు.
Cross references
- 1 Kings 14:15 1 రాజులు 14:15ఇశ్రాయేలువారు దేవతాస్తంభ ములను నిలిపి యెహోవాకు కోపము పుట్టించి యున్నారు గనుక నీటియందు రెల్లు అల్లలాడునట్లు యెహోవా ఇశ్రాయేలు వారిని మొత్తి, ఒకడు వేరును పెల్లగించినట్లు వారి పితరులకు తాను ఇచ్చిన యీ మంచి దేశములోనుండి వారిని పెల్లగించి వారిని యూఫ్రటీసునది అవతలకు చెదర గొట్టును.
- 1 Kings 14:23 1 రాజులు 14:23ఎట్లనగా వారును ఎత్తయిన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షముక్రిందను బలిపీఠములను కట్టి, విగ్రహములను నిలిపి, దేవతాస్తంభములను ఉంచిరి.
- 1 Kings 16:31 1 రాజులు 16:31నెబాతు కుమారుడైన యరొ బాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి యనుకొని, అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తెయైన యెజెబెలును వివాహము చేసికొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచునుండెను.
- 1 Kings 12:28 1 రాజులు 12:28ఆలోచనచేసి రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచియెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము;
- Deuteronomy 4:19 ద్వితీయోపదేశకాండము 4:19సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలుకొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచి పెట్టినవాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహు జాగ్రత్త పడుడి.
- 2 Kings 11:18 2 రాజులు 11:18అప్పుడు దేశపు జనులందరును బయలు గుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతి మలను ఛిన్నాభిన్నములుచేసి, బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి. మరియు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరమును కాచుకొనుటకు మనుష్యులను నియమించెను.
- 1 Kings 16:33 1 రాజులు 16:33మరియు అహాబు దేవతాస్తంభమొకటి నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వికులైన ఇశ్రాయేలు రాజు లందరికంటె ఎక్కువగా పాపముచేసి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.
- 1 Kings 22:53 1 రాజులు 22:53అతడు బయలు దేవతను పూజిం చుచు, వానికి నమస్కారము చేయుచు, తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.
- 1 Kings 15:13 1 రాజులు 15:13మరియు తన అవ్వ యైన మయకా అసహ్యమైన యొకదాని చేయించి, దేవతాస్తంభము ఒకటి నిలుపగా ఆసా ఆ విగ్రహమును ఛిన్నాభిన్నములుగా కొట్టించి, కిద్రోను ఓరను దాని కాల్చివేసి ఆమె పట్టపుదేవికాకుండ ఆమెను తొలగించెను.
- 2 Kings 21:3 2 రాజులు 21:3తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి, బయలు దేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రా యేలురాజైన అహాబు చేసినట్లు దేవతాస్తంభములను చేయించి, నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించు చుండెను.
- Jeremiah 8:2 యిర్మీయా 8:2వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణచేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల యెదుట వాటిని పరచెదరు; అవి కూర్చబడకయు పాతిపెట్టబడకయు భూమిమీద పెంట వలె పడియుండును.
- 2 Kings 10:18–28 2 రాజులు 10:18–28తరువాత యెహూ జనులందరిని సమకూర్చి వారికీలాగు ఆజ్ఞ ఇచ్చెను అహాబు బయలు దేవతకు కొద్ది గానే పూజచేసెను. యెహూ అను నేను అధికముగా పూజచేయబోవుచున్నాను, కావున ఒకడైనను తప్పకుండ బయలు ప్రవక్తలనందిరిని వాని భక్తులనందరిని వారి యాజ కులనందరిని నాయొద్దకు పిలువనంపించుడి; నేను బయలు నకు గొప్ప బలి అర్పింప బోవుచున్నాను గనుక రానివా డెవడో వాని బ్రదుకనియ్యనని చెప్పెను. అయితే బయలునకు మ్రొక్కువారిని నాశనము చేయుటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను. మరియు యెహూబయలునకు పండుగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞ ఇయ్యగా వారాలాగు చాటించిరి. యెహూ ఇశ్రాయేలు దేశమంతటిలోనికి వర్తమానము పంపించగా బయలునకు మ్రొక్కు వారందరును వచ్చిరి, రానివాడు ఒకడును లేడు; వారు వచ్చి బయలు గుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటులేకుండ బయలు గుడి ఈ తట్టునుండి ఆ తట్టువరకు నిండిపోయెను. అప్పుడతడు వస్త్రశాలమీద ఉన్న అధికారిని పిలిచిబయలునకు మ్రొక్కువారి కందరికి వస్త్రములు బయటికి తెప్పించుమని చెప్పగా వాడు తెప్పించెను. యెహూయును రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలు గుడిలో ప్రవేశింపగా యెహూ యెహోవా భక్తులలో ఒకనినైనను ఇచ్చట మీ యొద్దనుండనియ్యక బయలునకు మ్రొక్కువారుమాత్రమే యుండునట్లు జాగ్రత్తచేయుడని బయలునకు మ్రొక్కువారితో ఆజ్ఞ ఇచ్చెను. బలులను దహనబలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశింపగా యెహూ యెనుబది మందిని బయట కావలి యుంచినేను మీ వశముచేసినవారిలో ఒకడైన తప్పించుకొని పోయినయెడల వాని ప్రాణమునకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణముతీతునని వారితో చెప్పి యుండెను. దహనబలుల నర్పించుట సమాప్తికాగా యెహూమీరు లోపల చొచ్చి యొకడైనను బయటికి రాకుండ వారిని చంపుడని తన కావలివారితోను అధిపతుల తోను చెప్పగా వారు అందరిని హతము చేసిరి. పిమ్మట కావలివారును అధిపతులును వారిని బయటవేసి, బయలు గుడియున్న పట్టణమునకు పోయి బయలు గుడిలోని నిలువు విగ్రహములను బయటికి తీసికొని వచ్చి వాటిని కాల్చివేసిరి. మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంటయిల్లుగా చేసిరి. నేటివరకు అది ఆలాగే యున్నది ఈ ప్రకారము యెహూ బయలు దేవతను ఇశ్రాయేలువారిమధ్య నుండకుండ నాశనము చేసెను.
Original words (Hebrew)
- left · H5800עָזַב ʻâzab
- commandments · H4687מִצְוָה mitsvâh
- God · H430אֱלֹהִים ʼĕlôhîym
- made · H6213עָשָׂה ʻâsâh
- images · H4541מַסֵּכָה maççêkâh
- two · H8147שְׁנַיִם shᵉnayim
- calves · H5695עֵגֶל ʻêgel
- made · H6213עָשָׂה ʻâsâh
- grove · H842אֲשֵׁרָה ʼăshêrâh
- worshipped · H7812שָׁחָה shâchâh
- host · H6635צָבָא tsâbâʼ
- heaven · H8064שָׁמַיִם shâmayim
- served · H5647עָבַד ʻâbad
- Baal · H1168בַּעַל Baʻal