2 Kings · chapter 19 · verse 31
2 Kings 19:31 in Telugu
శేషించు వారు యెరూషలేములోనుండి బయలుదేరుదురు;తప్పించు కొనినవారు సీయోను కొండలోనుండి బయలుదేరుదురు; సైన్యముల కధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెర వేర్చును.
Sheshinchu vaaru yerooshalemulonundi bayaluderuduru;tappinchu koninavaaru seeyonu kondalonundi bayaluderuduru; sainyamula kadhipatiyagu yehovaa aasakti deeni nera verchunu.
2 Kings 19:31 in English
- King James Version (KJV)
- For out of Jerusalem shall go forth a remnant, and they that escape out of mount Zion: the zeal of the LORD [ of hosts] shall do this.
- World English Bible (WEB)
- For out of Jerusalem a remnant will go out, and out of Mount Zion those who shall escape. The LORD’s zeal will perform this.
- American Standard Version (ASV)
- For out of Jerusalem shall go forth a remnant, and out of mount Zion they that shall escape: the zeal of Jehovah shall perform this.
- Bible in Basic English (BBE)
- For from Jerusalem those who have been kept safe will go out, and those who are still living will go out of Mount Zion: by the fixed purpose of the Lord of armies this will be done.
- Darby Translation (DBY)
- For out of Jerusalem shall go forth a remnant, And out of mount Zion they that escape: The zeal of Jehovah [of hosts] shall do this.
- Webster's Bible (WBS)
- For out of Jerusalem shall go forth a remnant, and they that escape from mount Zion: the zeal of the LORD [of hosts] shall do this.
- Young's Literal Translation (YLT)
- For from Jerusalem goeth out a remnant, And an escape from mount Zion; The zeal of Jehovah [of Hosts] doth this.
Read in context
- 29మరియు యెషయా చెప్పినదేమనగాహిజ్కియా, నీ కిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, మూడవ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము అనుభవించుదురు.
- 30యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును.
- 31శేషించు వారు యెరూషలేములోనుండి బయలుదేరుదురు;తప్పించు కొనినవారు సీయోను కొండలోనుండి బయలుదేరుదురు; సైన్యముల కధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెర వేర్చును.
- 32కాబట్టి అష్షూరు రాజునుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెమునైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడిదిబ్బ కట్టడు.
- 33ఈ పట్టణములోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును; ఇదే యెహోవా వాక్కు.
Cross references
- Isaiah 9:7 యెషయా 9:7ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమ మును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.
- Romans 11:5 రోమీయులకు 11:5ఆలాగుననే అప్పటికాలమందు సయితము కృపయొక్క యేర్పాటుచొప్పున శేషము మిగిలి యున్నది.
- John 2:17 యోహాను 2:17ఆయన శిష్యులు నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయ బడియున్నట్టు జ్ఞాపకము చేసికొనిరి.
- Romans 9:27 రోమీయులకు 9:27మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి, క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండినను శేషమే రక్షింపబడునని
- Isaiah 10:20 యెషయా 10:20ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబికులలో తప్పించుకొనినవారును తమ్మును హతము చేసినవానిని ఇకను ఆశ్రయింపక సత్యమునుబట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధదేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు.
- Isaiah 63:15 యెషయా 63:15పరమునుండి చూడుము మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాసస్థలమునుండి దృష్టించుము నీ ఆసక్తి యేది? నీ శౌర్యకార్యములేవి? నాయెడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణగి పోయెనే.
- Jeremiah 44:14 యిర్మీయా 44:14కావున తాము మరలి వచ్చి యూదాదేశములో కాపురముండవలెనన్న మక్కువచేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్లు యూదా వారిలోని శేషము ఎవరును తప్పించుకొనరు, శేషమేమియు ఉండదు, పారి పోవువారు గాక మరి ఎవరును తిరిగిరారు.
- Ezekiel 20:9 యెహెజ్కేలు 20:9అయితే ఏ అన్య జనులయెదుట నన్ను నేను బయలు పరచుకొంటినో, యే అన్యజనులమధ్య వారుండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల యెదుట వారికి నన్ను బయలుపరచుకొంటిని, నా నామమునకు దూషణ కలుగకుండుటకై ఆలాగు చేయుటమాని, ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనతకొరకు నేను వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి తిని.
- Isaiah 59:17 యెషయా 59:17నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను రక్షణను తలమీద శిరస్త్రాణముగా ధరించుకొనెను
- Ezekiel 5:13 యెహెజ్కేలు 5:13నా కోపము తీరును, వారిమీద నా ఉగ్రత తీర్చుకొని నన్ను ఓదార్చుకొందును, నేను వారి మీద నా ఉగ్రత తీర్చుకొనుకాలమున యెహోవానైన నేను ఆసక్తిగలవాడనై ఆలాగు సెలవిచ్చితినని వారు తెలిసి కొందురు
- Zechariah 1:14 జెకర్యా 1:14కాబట్టి నాతో మాటలాడు చున్న దూత నాతో ఇట్లనెను - నీవు ప్రకటన చేయ వలసినదేమనగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను యెరూషలేము విషయములోను సీయోనువిషయములోను అధికాసక్తి కలిగియున్నాను;
- 2 Kings 19:4 2 రాజులు 19:4జీవముగల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నియు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలనుబట్టి ఆయన అష్షూరురాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషముకొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము.