2 Samuel · chapter 12 · verse 10
2 Samuel 12:10 in Telugu
నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య యగునట్లు తీసికొనినందున నీ యింటివారికి సదాకాలము యుద్ధము కలుగును.
Neevu nannu lakshyamu cheyaka hitteeyudagu ooriyaa bhaaryanu neeku bhaarya yagunatlu teesikoninanduna nee yintivaariki sadaakaalamu yuddhamu kalugunu.
2 Samuel 12:10 in English
- King James Version (KJV)
- Now therefore the sword shall never depart from thine house; because thou hast despised me, and hast taken the wife of Uriah the Hittite to be thy wife.
- World English Bible (WEB)
- Now therefore the sword will never depart from your house, because you have despised me and have taken Uriah the Hittite’s wife to be your wife.’
- American Standard Version (ASV)
- Now therefore the sword shall never depart from thy house, because thou hast despised me, and hast taken the wife of Uriah the Hittite to be thy wife.
- Bible in Basic English (BBE)
- So now the sword will never be turned away from your family; because you have had no respect for me, and have taken the wife of Uriah the Hittite to be your wife.
- Darby Translation (DBY)
- Now therefore the sword shall never depart from thy house; because thou hast despised me, and hast taken the wife of Urijah the Hittite to be thy wife.
- Webster's Bible (WBS)
- Now therefore the sword shall never depart from thy house; because thou hast despised me, and hast taken the wife of Uriah the Hittite to be thy wife.
- Young's Literal Translation (YLT)
- 'And now, the sword doth not turn aside from thy house unto the age, because thou hast despised Me, and dost take the wife of Uriah the Hittite to be to thee for a wife;
Read in context
- 8నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలువారిని యూదా వారిని నీ కప్పగించితిని. ఇది చాలదని నీవనుకొనినయెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చియుందును.
- 9నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితి వేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్య యగునట్లుగా నీవు పట్టుకొని యున్నావు; అమ్మోనీయులచేత నీవతని చంపించితివి గదా?
- 10నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య యగునట్లు తీసికొనినందున నీ యింటివారికి సదాకాలము యుద్ధము కలుగును.
- 11నా మాట ఆలకించుము; యెహోవానగు నేను సెలవిచ్చున దేమనగానీ యింటివారి మూలముననే నేను నీకు అపా యము పుట్టింతును; నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికప్పగించెదను.
- 12పగటియందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివిగాని ఇశ్రాయేలీయులందరు చూచుచుండగా పగటియందే నేను చెప్పినదానిని చేయింతును అనెను.
Cross references
- 2 Samuel 18:14–15 2 సమూయేలు 18:14–15యోవాబునీవు చేయువరకు నేను కాచుకొని యుందునా? అని చెప్పి మూడు బాణములు చేత పట్టుకొని పోయి మస్తకివృక్షమున వ్రేలాడుచు ఇంకను ప్రాణముతో నున్న అబ్షాలోముయొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయువారు పదిమంది చుట్టు చుట్టుకొని యుండగా అబ్షాలోమును కొట్టి చంపెను.
- Romans 2:4 రోమీయులకు 2:4లేదా, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును తృణీకరించుదువా?
- Matthew 26:52 మత్తయి 26:52యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము; కత్తి పట్టుకొను వారందరు కత్తిచేతనే నశింతురు.
- 1 Kings 2:23–25 1 రాజులు 2:23–25మరియు రాజైన సొలొమోనుయెహోవా తోడు అదోనీయా పలికిన యీ మాటవలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయినయెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. నన్ను స్థిరపరచి, నా తండ్రి సింహాసనముమీద నన్ను ఆసీనునిగా చేసి, తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగజేసిన యెహోవా జీవముతోడు, అదోనీయా యీ దినమున మరణమవునని చెప్పి యెహోయాదా కుమారు డైన బెనాయాను పంపగా ఇతడు అదోనీయా మీద పడినందున అతడు చనిపోయెను.
- 1 Samuel 2:30 1 సమూయేలు 2:30నీ యింటి వారును నీ పితరుని యింటివారును నా సన్నిధిని యాజ కత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ యిచ్చియున్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చు చున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగానన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు.
- Numbers 11:20 సంఖ్యాకాండము 11:20ఒక నెల దినములవరకు, అనగా అది మీ నాసికా రంధ్రములలోనుండి వచ్చి మీకు అసహ్యము పుట్టువరకు దానిని తిందురు; ఏలయనగా మీరు మీ మధ్య నున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చిఐగుప్తు లోనుండి యెందుకు వచ్చితిమనుకొంటిరి.
- Matthew 6:24 మత్తయి 6:24ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును; లేదా యొకని పక్ష ముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.
- Proverbs 6:32–33 సామెతలు 6:32–33జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి యెన్నటికిని తొలగిపోదు.
- 2 Samuel 18:33 2 సమూయేలు 18:33అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మ మునకు పైగా నున్న గదికి ఎక్కి పోయి యేడ్చుచు, సంచరించుచునా కుమారుడా అబ్షా లోమా, నా కుమా రుడా అబ్షాలోమా, అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినయెడల ఎంత బాగుండును; నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా, అని యేడ్చుచు వచ్చెను.
- 1 Thessalonians 4:8 1 థెస్సలొనీకయులకు 4:8కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు.
- 2 Samuel 13:28–29 2 సమూయేలు 13:28–29అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసమువలన సంతోషియై యుండుట మీరు కనిపెట్టియుండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పు నప్పుడు భయపడక అతని చంపుడి, నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చి యున్నాను, ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెను. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞచొప్పునవారు చేయగా రాజకుమారులందరును లేచి తమ కంచరగాడిదల నెక్కి పారిపోయిరి.
- Amos 7:9 ఆమోసు 7:9ఇస్సాకు సంతతివారు ఏర్పరచిన ఉన్నతస్థలములు పాడైపోవును, ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితస్థలములు నాశమగును. నేను ఖడ్గము చేత పట్టుకొని యరొబాము ఇంటివారిమీద పడుదును.