2 Samuel · chapter 15 · verse 36
2 Samuel 15:36 in Telugu
సాదోకు కుమారుడైన అహిమయస్సు అబ్యాతారు కుమారు డైన యోనాతాను అనువారి ఇద్దరు కుమారులు అచ్చట నున్నారు. నీకు వినబడినదంతయు వారిచేత నాయొద్దకు వర్తమానము చేయుమని చెప్పి అతనిని పంపివేసెను.
Saadoku kumaarudaina ahimayassu abyaataaru kumaaru daina yonaataanu anuvaari iddaru kumaarulu achchata nunnaaru. Neeku vinabadinadantayu vaaricheta naayoddaku vartamaanamu cheyumani cheppi atanini pampivesenu.
2 Samuel 15:36 in English
- King James Version (KJV)
- Behold, [they have] there with them their two sons, Ahimaaz Zadok’s [son], and Jonathan Abiathar’s [son;] and by them ye shall send unto me every thing that ye can hear.
- World English Bible (WEB)
- Behold, they have there with them their two sons, Ahimaaz, Zadok’s son, and Jonathan, Abiathar’s son. Send to me everything that you shall hear by them.”
- American Standard Version (ASV)
- Behold, they have there with them their two sons, Ahimaaz, Zadok’s son, and Jonathan, Abiathar’s son; and by them ye shall send unto me everything that ye shall hear.
- Bible in Basic English (BBE)
- See, they have with them their two sons, Ahimaaz, Zadok's son, and Jonathan, the son of Abiathar; by them you may send word to me of everything which comes to your ears.
- Darby Translation (DBY)
- Behold, they have there with them their two sons, Ahimaaz Zadok's [son], and Jonathan Abiathar's son; and by them ye shall send to me everything that ye shall hear.
- Webster's Bible (WBS)
- Behold, [they have] there with them their two sons, Ahimaaz Zadok's [son] , and Jonathan Abiathar's [son] ; and by them ye shall send to me every thing that ye can hear.
- Young's Literal Translation (YLT)
- Lo, there with them [are] their two sons, Ahimaaz to Zadok, and Jonathan to Abiathar, and ye have sent by their hand unto me anything that ye hear.'
Read in context
- 34నీవు పట్టణమునకు తిరిగి పోయిరాజా, యింతవరకు నీ తండ్రికి నేను సేవచేసినట్లు ఇకను నీకు సేవచేసెదనని అబ్షాలోముతో చెప్పినయెడల నీవు నా పక్షపువాడవై యుండి అహీతోపెలుయొక్క ఆలోచనను చెడగొట్ట గలవు.
- 35అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా నుందురు; కాబట్టి రాజనగరియందు ఏదైనను జరుగుట నీకు వినబడినయెడల యాజకుడైన సాదోకుతోను అబ్యాతారుతోను దాని చెప్పవలెను.
- 36సాదోకు కుమారుడైన అహిమయస్సు అబ్యాతారు కుమారు డైన యోనాతాను అనువారి ఇద్దరు కుమారులు అచ్చట నున్నారు. నీకు వినబడినదంతయు వారిచేత నాయొద్దకు వర్తమానము చేయుమని చెప్పి అతనిని పంపివేసెను.
- 37దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చు చుండగా అబ్షాలోమును యెరూషలేము చేరెను.
Cross references
- 2 Samuel 17:17 2 సమూయేలు 17:17తాము పట్టణముతట్టు వచ్చిన సంగతి తెలియబడక యుండునట్లు యోనాతానును అహిమయస్సును ఏన్రోగేలు దగ్గర నిలిచియుండగా పని కత్తెయొకతెవచ్చి, హూషై చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాని తెలియజెప్పిరి.
- 2 Samuel 15:27 2 సమూయేలు 15:27యాజకుడైన సాదోకుతో ఇట్లనెనుసాదోకూ, నీవు దీర్ఘదర్శివి కావా? శుభమొంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అబ్యాతారునకు పుట్టిన యోనాతాను అను మీ యిద్దరు కుమారులును పట్టణమునకు పోవలెను.
- 2 Samuel 18:19–33 2 సమూయేలు 18:19–33సాదోకు కుమారుడైన అహిమయస్సునేను పరుగెత్తి కొని పోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పెదననగా యోవాబు ఈ దినమున ఈ వర్తమానము చెప్ప తగదు, మరియొక దినమున చెప్పవచ్చును; రాజు కుమారుడు మరణమాయెను గనుక ఈ దినమున వర్తమానము తీసికొని పోతగదని అతనితో చెప్పెను. తరువాత కూషీని పిలిచినీవు పోయి నీవు చూచిన దానిని రాజునకు తెలియ జేయుమనగా కూషీ యోవాబునకు నమస్కారము చేసి పరుగెత్తికొని పోయెను. అయితే సాదోకు కుమారుడైన అహి మయస్సుకూషీతోకూడ నేనును పరుగెత్తికొనిపోవు టకు సెలవిమ్మని యోవాబుతో మనవిచేయగా యోవాబునాయనా నీవెందుకు పోవలెను? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచార మేదియు లేదు గదా అని అతనితో అనగా అతడుఏమైనను సరే నేను పరుగెత్తికొని పోవుదు ననెను. అందుకు యోవాబుపొమ్మని సెలవియ్యగా అహిమయస్సు మైదానపు మార్గ మున పరుగెత్తికొని కూషీకంటె ముందుగా చేరెను. దావీదు రెండు గుమ్మముల మధ్యను నడవలో కూర్చొని యుండెను; కావలికాడు గుమ్మముపైనున్న గోడమీదికి ఎక్కి పారచూడగా ఒంటరిగా పరుగెత్తికొని వచ్చుచున్న యొకడు కనబడెను. వాడు అరచి రాజునకు ఈ సంగతి తెలియజేయగా రాజువాడు ఒంటరిగా ఉండినయెడల ఏదో వర్తమానము తెచ్చుచున్నాడనెను. అంతలో వాడు పరుగుమీద వచ్చుచుండగా కావలికాడు పరుగెత్తికొని వచ్చు మరియొకని కనుగొని అదిగో మరియొకడు ఒంటరి గానే పరుగెత్తికొని వచ్చుచున్నాడని ద్వారపుతట్టు తిరిగి చెప్పగా రాజువాడును వర్తమానము తెచ్చుచున్నాడనెను. కావలికాడు మొదటివాడు పరుగెత్తుట చూడగావాడు సాదోకు కుమారుడైన అహిమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు రాజువాడు మంచివాడు, శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పెను. అంతలొ అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారము చేసినా యేలినవాడవును రాజవునగు నిన్ను చంప చూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పెను. రాజుబాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? అని యడుగగా అహిమయస్సుయోవాబు రాజసేవకుడ నైన నీ దాసుడనగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచితిని గాని అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పెను. అప్పుడు రాజునీవు ప్రక్కకు తొలగి నిలిచియుండు మని వానికాజ్ఞనియ్యగా వాడు తొలగి నిలిచెను. అంతలో కూషీ వచ్చినా యేలిన వాడా రాజా, నేను నీకు శుభసమాచారము తెచ్చితిని; యీ దినమున యెహోవా నీ మీదికి వచ్చినవారినందరిని ఓడించి నీకు న్యాయము తీర్చెనని చెప్పినప్పుడు రాజుబాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? అని యడిగెను. అందుకు కూషీ చెప్పినదేమనగానా యేలినవాడవును రాజవునగు నీ శత్రువులును నీకు హాని చేయవలెనని నీ మీదికి వచ్చినవారందరును ఆ బాలుడున్నట్టుగానే యుందురు గాక. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మ మునకు పైగా నున్న గదికి ఎక్కి పోయి యేడ్చుచు, సంచరించుచునా కుమారుడా అబ్షా లోమా, నా కుమా రుడా అబ్షాలోమా, అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినయెడల ఎంత బాగుండును; నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా, అని యేడ్చుచు వచ్చెను.