2 Samuel · chapter 2 · verse 3
2 Samuel 2:3 in Telugu
మరియు దావీదు తనయొద్ద నున్నవారినందరిని వారి వారి యింటివారిని తోడుకొని వచ్చెను; వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి.
Mariyu daaveedu tanayodda nunnavaarinandarini vaari vaari yintivaarini todukoni vachchenu; veeru hebronu graamamulalo kaapuramundiri.
2 Samuel 2:3 in English
- King James Version (KJV)
- And his men that [were] with him did David bring up, every man with his household: and they dwelt in the cities of Hebron.
- World English Bible (WEB)
- David brought up his men who were with him, every man with his household. They lived in the cities of Hebron.
- American Standard Version (ASV)
- And his men that were with him did David bring up, every man with his household: and they dwelt in the cities of Hebron.
- Bible in Basic English (BBE)
- And David took all his men with him, every man with his family: and they were living in the towns round Hebron.
- Darby Translation (DBY)
- And his men that were with him did David bring up, every man with his household; and they dwelt in the cities of Hebron.
- Webster's Bible (WBS)
- And his men that [were] with him did David bring up, every man with his household: and they dwelt in the cities of Hebron.
- Young's Literal Translation (YLT)
- and his men who [are] with him hath David brought up — a man and his household — and they dwell in the cities of Hebron.
Read in context
- 1ఇది జరిగిన తరువాతయూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవాయొద్ద విచారణ చేయగాపోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగాహెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను.
- 2కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయము, కర్మెలీయుడగు నాబాలునకు భార్యయైన అబీగయీలు అను తన యిద్దరు భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను.
- 3మరియు దావీదు తనయొద్ద నున్నవారినందరిని వారి వారి యింటివారిని తోడుకొని వచ్చెను; వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి.
- 4అంతట యూదావారు అక్కడికి వచ్చి యూదావారిమీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి.
- 5సౌలును పాతిపెట్టినవారు యాబేష్గిలాదువారని దావీదు తెలిసికొని యాబేష్గిలాదువారియొద్దకు దూతలను పంపిమీరు ఉపకారము చూపి మీ యేలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవాచేత మీరు ఆశీర్వచనము నొందుదురు గాక.
Cross references
- 1 Chronicles 12:1–7 1 దినవృత్తాంతములు 12:1–7దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడియింకను దాగియుండగా సౌలు బంధువులగు బెన్యామీనీ యులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయము చేయుటకై అతనియొద్దకు సిక్లగునకు వచ్చిరి. వీరు విలుకాండ్రయి కుడి యెడమ చేతులతో వడిసెలచేత రాళ్లు రువ్వుటకును వింటిచేత అంబులు విడుచుటకును సమర్థులైన వారు. వారెవరనగా గిబియావాడైన షెమాయా కుమారులైన అహీయెజెరు, ఇతడు అధిపతి; ఇతని తరువాతివాడగు యోవాషు, అజ్మావెతు కుమారులైన యెజీయేలు, పెలెటు, బెరాకా, అనెతోతీయుడైన యెహూ, ముప్పదిమందిలో పరాక్రమశాలియు ముప్పది మందికి పెద్దయునైన ఇష్మయా అను గిబియోనీయుడు, యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీ యుడైన యోజాబాదు, ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, హరీపీయుడైన షెఫటయా, కోరహీయులగు ఎల్కానా, యెష్షీయా, అజరేలు, యోహెజెరు, యాషాబాము, గెదోరు ఊరివాడైన యెరోహాము కుమారులగు యోహేలా, జెబద్యా అనువారును.
- 1 Samuel 30:1 1 సమూయేలు 30:1దావీదును అతని జనులును మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి; అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశముమీదను సిక్లగుమీదను పడి, కొట్టి దానిని తగులబెట్టి,
- 1 Samuel 27:2–3 1 సమూయేలు 27:2–3లేచి తనయొద్దనున్న ఆరువందలమందితో కూడ ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషునొద్దకు వచ్చెను. దావీదు గాతులో ఆకీషునొద్ద చేరగా అతడును అతని వారందరును తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. యెజ్రెయేలీయురాలగు అహీనోయము, నాబాలు భార్యయైయుండిన కర్మెలీయు రాలగు అబీగయీలు అను అతని యిద్దరు భార్యలు దావీదుతోకూడ ఉండిరి.
- 1 Samuel 22:2 1 సమూయేలు 22:2మరియు ఇబ్బందిగలవారందరును, అప్పులు చేసికొనిన వారందరును, అసమాధానముగా నుండు వారందరును, అతనియొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతియాయెను. అతనియొద్దకు ఎక్కువ తక్కువ నాలుగువందలమంది వచ్చియుండిరి.
- 1 Samuel 30:9–10 1 సమూయేలు 30:9–10కాబట్టి దావీదు అతనియొద్దనున్న ఆరువందల మంది యును బయలుదేరి బెసోరు వాగుగట్టుకు రాగా వారిలో రెండువందల మంది వెనుక దిగవిడువబడిరి. దావీదును నాలుగువందల మందియును ఇంక తరుముచు పోయిరి గాని ఆ రెండువందల మంది అలసట పడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ నాలుగు వందలమంది పోవు చుండగా
- Joshua 21:11–12 యెహోషువ 21:11–12యూదావంశస్థుల మన్య ములో వారికి కిర్యతర్బా, అనగా హెబ్రోను నిచ్చిరి. ఆ అర్బా అనాకు తండ్రి దాని చుట్టునున్న పొలమును వారి కిచ్చిరి. అయితే ఆ పట్టణముయొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్య ముగా ఇచ్చిరి.