2 Timothy · chapter 2 · verse 1
2 Timothy 2:1 in Telugu
నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము.
Naa kumaarudaa, kreestuyesunandunna krupacheta balavantudavu kammu.
2 Timothy 2:1 in English
- King James Version (KJV)
- Thou therefore, my son, be strong in the grace that is in Christ Jesus.
- World English Bible (WEB)
- You therefore, my child, be strengthened in the grace that is in Christ Jesus.
- American Standard Version (ASV)
- Thou therefore, my child, be strengthened in the grace that is in Christ Jesus.
- Bible in Basic English (BBE)
- So then, my child, be strong in the grace which is in Christ Jesus.
- Darby Translation (DBY)
- Thou therefore, my child, be strong in the grace which [is] in Christ Jesus.
- Webster's Bible (WBS)
- Thou therefore, my son, be strong in the grace that is in Christ Jesus.
- Young's Literal Translation (YLT)
- Thou, therefore, my child, be strong in the grace that [is] in Christ Jesus,
Read in context
- 1నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము.
- 2నీవు అనేక సాక్షులయెదుట నావలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము,
- 3క్రీస్తుయేసుయొక్క మంచి సైనికునివలె నాతోకూడ శ్రమను అనుభవించుము.
Cross references
- 2 Corinthians 12:9–10 2 కొరింథీయులకు 12:9–10అందుకునా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల లోను నేను సంతోషించుచున్నాను.
- Ephesians 6:10 ఎఫెసీయులకు 6:10తుదకు ప్రభువుయొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి.
- 2 Timothy 1:7 2 తిమోతికి 1:7దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు.
- Philippians 4:13 ఫిలిప్పీయులకు 4:13నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.
- 1 Corinthians 16:13 1 కొరింథీయులకు 16:13మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలుకడగా ఉండుడి, పౌరుషముగలవారై యుండుడి, బలవంతులై యుండుడి;
- Haggai 2:4 హగ్గయి 2:4అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చున దేమనగా జెరుబ్బాబెలూ, ధైర్యము తెచ్చుకొమ్ము; ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువా, ధైర్యము తెచ్చుకొమ్ము; దేశములోనున్న సమస్తజనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి; నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే సైన్యములకు అధి పతియగు యెహోవా వాక్కు.
- 2 Peter 3:18 2 పేతురు 3:18మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభి వృద్ధిపొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంతదినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్.
- 1 Timothy 1:18 1 తిమోతికి 1:18నా కుమారుడువైన తిమోతీ, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగినవాడవై, నిన్నుగూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటినిబట్టి యీ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను.
- Joshua 1:7 యెహోషువ 1:7అయితే నీవు నిబ్బరముగలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగానుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞా పించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దానినుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదు.
- 1 Timothy 1:2 1 తిమోతికి 1:2విశ్వాసమునుబట్టి నా నిజ మైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక.
- 2 Timothy 1:2 2 తిమోతికి 1:2తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన క్రీస్తుయేసునుండియు కృపయు కనికరమును సమాధానమును కలుగును గాక.