Acts · chapter 19 · verse 18
Acts 19:18 in Telugu
విశ్వసించినవారు అనేకులు వచ్చి, తాము చేసినవాటిని తెలియజేసియొప్పుకొనిరి.
Vishvasinchinavaaru anekulu vachchi, taamu chesinavaatini teliyajesiyoppukoniri.
Acts 19:18 in English
- King James Version (KJV)
- And many that believed came, and confessed, and shewed their deeds.
- World English Bible (WEB)
- Many also of those who had believed came, confessing and declaring their deeds.
- American Standard Version (ASV)
- Many also of them that had believed came, confessing, and declaring their deeds.
- Bible in Basic English (BBE)
- And a number of those who had faith came and made a public statement of their sins and all their acts.
- Darby Translation (DBY)
- And many of those that believed came confessing and declaring their deeds.
- Webster's Bible (WBS)
- And many that believed came, and confessed, and showed their deeds.
- Young's Literal Translation (YLT)
- many also of those who did believe were coming, confessing and declaring their acts,
Read in context
- 16ఆ దయ్యముపట్టినవాడు ఎగిరి, వారిమీద పడి, వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను; అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ యింటనుండి పారిపోయిరి.
- 17ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదు లకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికి భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను.
- 18విశ్వసించినవారు అనేకులు వచ్చి, తాము చేసినవాటిని తెలియజేసియొప్పుకొనిరి.
- 19మరియు మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల యేబదివేల వెండి రూకలాయెను.
- 20ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను.
Cross references
- Romans 10:10 రోమీయులకు 10:10ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.
- Psalm 32:5 కీర్తనలు 32:5నా దోషమును కప్పుకొనక నీ యెదుట నాపాపము ఒప్పుకొంటిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు. (సెలా. )
- Matthew 3:6 మత్తయి 3:6తమ పాపములు ఒప్పుకొనుచు, యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి.
- Job 33:27–28 యోబు 33:27–28అప్పుడు వాడు మనుష్యులయెదుట సంతోషించుచు ఇట్లని పలుకును యథార్థమైనదానిని వ్యత్యాసపరచి నేను పాపము చేసితిని అయినను దానికి తగిన ప్రతికారము నాకు చేయబడ లేదు కూపములోనికి దిగిపోకుండ నా ప్రాణమును ఆయన విమోచించియున్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది.
- Leviticus 26:40 లేవీయకాండము 26:40వారు నాకు విరో ధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని, తాము నాకు విరోధముగా నడిచితిమనియు
- Proverbs 28:13 సామెతలు 28:13అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.
- 1 John 1:9 1 యోహాను 1:9మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.
- Ezekiel 16:63 యెహెజ్కేలు 16:63నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసికొందువు; ఇదే యెహోవా వాక్కు.
- Jeremiah 3:13 యిర్మీయా 3:13నీ దేవుడైన యెహోవామీద తిరుగుబాటు చేయుచు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము; ఇదే యెహోవా వాక్కు.
- Ezekiel 36:31 యెహెజ్కేలు 36:31అప్పుడు మీరు మీ దుష్ ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనస్సునకు తెచ్చుకొని, మీ దోషములను బట్టియు హేయక్రియ లను బట్టియు మిమ్మును మీరు అసహ్యించుకొందురు.
- Leviticus 16:21 లేవీయకాండము 16:21అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తలమీద తన రెండు చేతులు ఉంచి, ఇశ్రాయేలీయుల పాపములన్నియు, అనగా వారి దోషములన్నియు వారి అతిక్రమములన్నియు దానిమీద ఒప్పుకొని, ఆ మేకతలమీద వాటిని మోపి, తగిన మనుష్యునిచేత అరణ్యములోనికి దాని పంపవలెను.