Acts · chapter 19 · verse 28
Acts 19:28 in Telugu
వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి;
Vaaru vini raudramuto nindina vaarai epheseeyula artemidevi mahaadevi ani kekaluvesiri;
Acts 19:28 in English
- King James Version (KJV)
- And when they heard [these sayings], they were full of wrath, and cried out, saying, Great [is] Diana of the Ephesians.
- World English Bible (WEB)
- When they heard this they were filled with anger, and cried out, saying, “Great is Artemis of the Ephesians!”
- American Standard Version (ASV)
- And when they heard this they were filled with wrath, and cried out, saying, Great [is] Diana of the Ephesians.
- Bible in Basic English (BBE)
- And hearing this, they were very angry, crying out and saying, Great is Diana of Ephesus.
- Darby Translation (DBY)
- And having heard [this], and being filled with rage, they cried out, saying, Great [is] Artemis of the Ephesians.
- Webster's Bible (WBS)
- And when they heard [these sayings] , they were full of wrath, and cried out, saying, Great [is] Diana of the Ephesians.
- Young's Literal Translation (YLT)
- And they having heard, and having become full of wrath, were crying out, saying, 'Great [is] the Artemis of the Ephesians!'
Read in context
- 26అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని యీ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియయందంతట బహు జనమును ఒప్పించి, త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు నున్నారు.
- 27మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోవుటయే గాక, మహాదేవియైన అర్తెమి దేవియొక్క గుడి కూడ తృణీకరింపబడి, ఆసియయందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమెయొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతోచుచున్నదని వారితో చెప్పెను.
- 28వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి;
- 29పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియ వారైన గాయియును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి.
- 30పౌలు జనుల సభ యొద్దకు వెళ్లదలచెను, గాని శిష్యులు వెళ్లనియ్యలేదు.
Cross references
- Revelation 13:4 ప్రకటన 13:4ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారముచేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటి యెవడు? దానితో యుద్ధము చేయగల వాడెవడు? అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారముచేసిరి.
- Revelation 17:13 ప్రకటన 17:13వీరు ఏకాభిప్రాయముగలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు.
- Acts 16:19–24 అపొస్తలుల కార్యములు 16:19–24ఆమె యజమానులు తమ లాభసాధనము పోయెనని చూచి, పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారులయొద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతట న్యాయాధిపతులయొద్దకు వారిని తీసికొనివచ్చి ఈ మనుష్యులు యూదులై యుండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు, మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారిమీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులును వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాల దెబ్బలు కొట్టి వారిని చెరసాలలోవేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుని కాజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞనుపొంది, వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి, వారి కాళ్లకు బొండవేసి బిగించెను.
- Isaiah 41:5–7 యెషయా 41:5–7ద్వీపములు చూచి దిగులుపడుచున్నవి భూదిగంతములు వణకుచున్నవి జనులు వచ్చి చేరుచున్నారు వారు ఒకనికొకడు సహాయము చేసికొందురు ధైర్యము వహించుమని యొకనితో ఒకడు చెప్పు కొందురు. అతుకుటనుగూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును సుత్తెతో నునుపుచేయువాడు దాగలి మీద కొట్టు వానిని ప్రోత్సాహపరచును విగ్రహము కదలకుండ పనివాడు మేకులతో దాని బిగించును.
- Acts 18:19 అపొస్తలుల కార్యములు 18:19వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారినక్కడ విడిచిపెట్టి, తాను మాత్రము సమాజమందిరములో ప్రవేశించి, యూదులతో తర్కించుచుండెను.
- Revelation 12:12 ప్రకటన 12:12అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి; భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధము గలవాడై మీయొద్దకు దిగి వచ్చియున్నాడని చెప్పెను.
- Psalm 2:2 కీర్తనలు 2:2మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు
- 1 Samuel 5:3–5 1 సమూయేలు 5:3–5అయితే మరునాడు అష్డోదువారు ప్రాతఃకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడియుండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వానిస్థానమందు మరల ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి యుండెను. దాగోనుయొక్క తలయు రెండు అరచేతులును తెగవేయబడి గడపదగ్గర పడియుండెను, వాని మొండెము మాత్రము వానికి మిగిలి యుండెను. కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చు వారేమి నేటివరకు ఎవరును అష్డోదులో దాగోనుయొక్క గుడిగడపను త్రొక్కుటలేదు.
- Acts 7:54 అపొస్తలుల కార్యములు 7:54వారీ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లుకొరికిరి.
- Jeremiah 50:38 యిర్మీయా 50:38నీళ్లకు ఎద్దడి తగులును అవి ఇంకిపోవును అది చెక్కబడిన విగ్రహములుగల దేశము జనులు భీకరప్రతిమలనుబట్టి పిచ్చిచేష్టలు చేయుదురు.
- Acts 21:28–31 అపొస్తలుల కార్యములు 21:28–31ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి; ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసుదేశస్థులను దేవాలయములోనికి తీసికొనివచ్చి యీ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచియున్నాడని కేకలు వేసిరి. ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితోకూడ పట్టణములో అంతకుముందు వారు చూచి యున్నందున పౌలు దేవాలయములోనికి అతని తీసికొని వచ్చెనని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తికొని వచ్చి, పౌలును పట్టుకొని దేవాలయములోనుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి; వెంటనే తలుపులు మూయబడెను. వారతని చంపవలెనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై యధికారికి వర్తమానము వచ్చెను;
- Acts 19:34–35 అపొస్తలుల కార్యములు 19:34–35అయితే అతడు యూదుడని వారు తెలిసికొనినప్పుడు అందరును ఏకశబ్దముతో రెండు గంటలసేపు ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి. అంతట కరణము సమూహమును సముదాయించి ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము అర్తెమి మహాదేవికిని ద్యుపతియొద్దనుండి పడిన మూర్తికిని పాలకురాలై యున్నదని తెలియని వాడెవడు?