Amos · chapter 7 · verse 1
Amos 7:1 in Telugu
కడవరి గడ్డి మొలుచునప్పుడు ప్రభువైన యెహోవా మిడుతలను పుట్టించి దర్శనరీతిగా దానిని నాకు కనుపర చెను; ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది.
Kadavari gaddi moluchunappudu prabhuvaina yehovaa midutalanu puttinchi darshanareetigaa daanini naaku kanupara chenu; aa gaddi raajunaku raavalasina kota ayina taruvaata molichinadi.
Amos 7:1 in English
- King James Version (KJV)
- Thus hath the Lord GOD shewed unto me; and, behold, he formed grasshoppers in the beginning of the shooting up of the latter growth; and, lo, [it was] the latter growth after the king’s mowings.
- World English Bible (WEB)
- Thus the Lord GOD showed me: behold, he formed locusts in the beginning of the shooting up of the latter growth; and behold, it was the latter growth after the king’s harvest.
- American Standard Version (ASV)
- Thus the Lord Jehovah showed me: and, behold, he formed locusts in the beginning of the shooting up of the latter growth; and, lo, it was the latter growth after the king’s mowings.
- Bible in Basic English (BBE)
- This is what the Lord God let me see: and I saw that, when the growth of the late grass was starting, he made locusts; it was the late growth after the king's cutting was done.
- Darby Translation (DBY)
- Thus did the Lord Jehovah shew unto me; and behold, he formed locusts in the beginning of the shooting up of the latter growth, and behold, it was the latter growth after the king's mowings.
- Webster's Bible (WBS)
- Thus hath the Lord GOD shown to me; and behold, he formed grasshoppers in the beginning of the shooting up of the latter growth; and lo, [it was] the latter growth after the king's mowings.
- Young's Literal Translation (YLT)
- Thus hath the Lord Jehovah shewed me, and lo, He is forming locusts at the beginning of the ascending of the latter growth, and lo, the latter growth [is] after the mowings of the king;
Read in context
- 1కడవరి గడ్డి మొలుచునప్పుడు ప్రభువైన యెహోవా మిడుతలను పుట్టించి దర్శనరీతిగా దానిని నాకు కనుపర చెను; ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది.
- 2నేలను మొలిచిన పచ్చికయంతయు ఆ మిడుతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనముగల వాడు, అతడేలాగు నిలుచును? అని నేను మనవిచేయగా
- 3యెహోవా పశ్చాత్తాపపడి అది జరుగదని సెలవిచ్చెను.
Cross references
- Joel 1:4 యోవేలు 1:4గొంగళిపురుగులు విడిచినదానిని మిడుతలు తినివేసి యున్నవి మిడుతలు విడిచినదానిని పసరుపురుగులు తినివేసి యున్నవి. పసరుపురుగులు విడిచినదానిని చీడపురుగులు తినివేసి యున్నవి.
- Amos 8:1 ఆమోసు 8:1మరియు ప్రభువైన యెహోవా దర్శనరీతిగా వేసవి కాలపు పండ్లగంప యొకటి నాకు కనుపరచి
- Nahum 3:15–17 నహూము 3:15–17అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనముచేయును, గొంగళిపురుగు తినివేయురీతిగా అది నిన్ను తినివేయును, నీవు సంఖ్యకు గొంగళిపురుగులంత విస్తారముగాను మిడుత లంత విస్తారముగాను ఉండుము. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రములకంటె ఎక్కువగానున్నను గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి యెగిరిపోయెను. నీవు ఏర్పరచిన శూరులు మిడుతలంత విస్తారముగా నున్నారు, నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగులవలె నున్నారు. ఎండకాయగా అవి యెగిరి పోవును, అవి ఎక్కడ వాలినది ఎవరికిని తెలియదు.
- Isaiah 33:4 యెషయా 33:4చీడపురుగులు కొట్టివేయునట్లు మీ సొమ్ము దోచబడును మిడతలు ఎగిరిపడునట్లు శత్రువులు దానిమీద పడు దురు
- Amos 4:9 ఆమోసు 4:9మరియు మీ సస్యములను ఎండు తెగులుచేతను కాటుకచేతను నేను పాడుచేసితిని, గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్షతోటలను అంజూరపు చెట్లను ఒలీవచెట్లను తినివేసెను, అయినను మీరు నాతట్టు తిరిగిన వారు కారు; ఇదే యెహోవా వాక్కు.
- Joel 2:25 యోవేలు 2:25మీరు కడుపార తిని తృప్తిపొంది మీకొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగు లును పసరు పురుగులును చీడపురుగులును అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును.
- Jeremiah 1:11–16 యిర్మీయా 1:11–16మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యిర్మీయా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకుబాదముచెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి; నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతుర పడుచున్నాననెను. రెండవమారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై - నీకేమి కనబడుచున్నదని సెలవియ్యగా నేనుమసలుచున్న బాన నాకు కనబడుచున్నది; దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగియున్నదంటిని. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను ఉత్తర దిక్కునుండి కీడు బయలుదేరి యీ దేశనివాసులందరిమీదికి వచ్చును. ఇదిగో నేను ఉత్తరదిక్కున నున్న రాజ్యముల సర్వవంశస్థు లను పిలిచెదను, వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మములలోను, యెరూషలేము చుట్టునున్న ప్రాకారములన్నిటికి ఎదురుగాను, యూదాపట్టణములన్నిటికి ఎదురు గాను తమ సింహాసనములను స్థాపింతురు. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్యదేవతలకు ధూపము వేసి, తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుట యను తమ చెడుతనమంతటినిబట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటింతును.
- Zechariah 1:20 జెకర్యా 1:20యెహోవా నలుగురు కంసాలులను నాకు కనుపరచగా
- Jeremiah 24:1 యిర్మీయా 24:1బబులోనురాజైన నెబుకద్రెజరు యూదారాజైన యెహోయాకీము కుమారుడగు యెకోన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనునకు తీసికొని పోయిన తరువాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన రెండు గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను.
- Exodus 10:12–16 నిర్గమకాండము 10:12–16అప్పుడు యెహోవా మోషేతో మిడతలు వచ్చునట్లు ఐగుప్తుదేశముమీద నీ చెయ్యి చాపుము; అవి ఐగుప్తుదేశము మీదకి వచ్చి యీ దేశపు పైరులన్నిటిని, అనగా వడగండ్లు పాడుచేయని వాటినన్నిటని తినివేయునని చెప్పెను. మోషే ఐగుప్తుదేశముమీద తన కఱ్ఱను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశముమీద తూర్పుగాలిని విసర జేసెను; ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధకర మైనవి, అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడును ఉండలేదు. తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను. ఆ దేశమున చీకటికమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నిటిని ఆ వడగండ్లు పాడుచేయని వృక్షఫలములన్నిటిని అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతట చెట్లేగాని పొలముల కూరయే గాని పచ్చని దేదియు మిగిలియుండలేదు. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యెహోవాయెడలను మీ యెడలను పాపముచేసితిని.
- Amos 7:7 ఆమోసు 7:7మరియు యెహోవా తాను మట్టపుగుండు చేత పట్టు కొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన యొక గోడమీద నిలువబడి ఇట్లు దర్శనరీతిగా నాకు కనుపరచెను.
- Amos 7:4 ఆమోసు 7:4మరియు అగ్నిచేత దండింపవలెనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శనరీతిగా నాకు కను పరచెను. అది వచ్చి అగాధమైన మహా జలమును మింగివేసి, స్వాస్థ్యమును మింగ మొదలుపెట్టినప్పుడు