Amos · chapter 7 · verse 15
Amos 7:15 in Telugu
నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచినీవు పోయి నా జనులగు ఇశ్రాయేలువారికి ప్రవచనము చెప్పుమని నాతో సెల విచ్చెను.
Naa mandalanu nenu kaachukonuchundagaa yehovaa nannu pilichineevu poyi naa janulagu ishraayeluvaariki pravachanamu cheppumani naato sela vichchenu.
Amos 7:15 in English
- King James Version (KJV)
- And the LORD took me as I followed the flock, and the LORD said unto me, Go, prophesy unto my people Israel.
- World English Bible (WEB)
- and the LORD took me from following the flock, and the LORD said to me, ‘Go, prophesy to my people Israel.’
- American Standard Version (ASV)
- and Jehovah took me from following the flock, and Jehovah said unto me, Go, prophesy unto my people Israel.
- Bible in Basic English (BBE)
- And the Lord took me from the flock, and the Lord said to me, Go, be a prophet to my people Israel.
- Darby Translation (DBY)
- And Jehovah took me as I followed the flock, and Jehovah said unto me, Go, prophesy unto my people Israel.
- Webster's Bible (WBS)
- And the LORD took me as I followed the flock, and the LORD said to me, Go, prophesy to my people Israel.
- Young's Literal Translation (YLT)
- and Jehovah taketh me from after the flock, and Jehovah saith unto me, Go, prophesy unto My people Israel.
Read in context
- 13బేతేలు, రాజుయొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమై యున్నందున నీ వికను దానిలో నీ వార్త ప్రకటనచేయ కూడదు.
- 14అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కాని పసులకాపరినై మేడి పండ్లు ఏరుకొనువాడను.
- 15నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచినీవు పోయి నా జనులగు ఇశ్రాయేలువారికి ప్రవచనము చెప్పుమని నాతో సెల విచ్చెను.
- 16యెహోవా మాట ఆలకించుముఇశ్రాయేలీ యులను గూర్చి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జారవిడువకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే.
- 17యెహోవా సెలవిచ్చునదేమన గానీ భార్య పట్టణమందు వేశ్యయగును, నీ కూమారులును కుమార్తెలును ఖడ్గముచేత కూలుదురు, నీ భూమి నూలుచేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు; అవశ్యముగా ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి చెరగొనబడుదురు.
Cross references
- 2 Samuel 7:8 2 సమూయేలు 7:8కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఈలాగు చెప్పుముసైన్యముల కధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగాగొఱ్ఱెల కాపులోనున్న నిన్ను గొఱ్ఱెలదొడ్డిలోనుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనులమీద అధిపతిగా నియమించి తిని.
- Ezekiel 2:3–4 యెహెజ్కేలు 2:3–4ఆయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనులయొద్దకు ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను; వారును వారి పితరులును నేటివరకును నామీద తిరుగుబాటు చేసినవారు. వారు సిగ్గుమాలిన వారును కఠినహృదయులునై యున్నారు, వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను, వారు తిరుగుబాటు చేయు
- Jeremiah 1:7 యిర్మీయా 1:7యెహోవా నాకీలాగు సెలవిచ్చెను - నేను బాలుడననవద్దు; నేను నిన్ను పంపువారందరియొద్దకు నీవు పోవలెను, నీకాజ్ఞాపించిన సంగతులన్నియు చెప్ప వలెను.
- Acts 5:20 అపొస్తలుల కార్యములు 5:20ఈ జీవమునుగూర్చిన మాటలన్నియు ప్రజలతో చెప్పుడని వారితో అనెను.
- Acts 1:8 అపొస్తలుల కార్యములు 1:8అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను
- Matthew 9:9 మత్తయి 9:9యేసు అక్కడనుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచినన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను.
- Matthew 4:18–19 మత్తయి 4:18–19యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు. ఆయననా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను;
- Psalm 78:70–72 కీర్తనలు 78:70–72తన దాసుడైన దావీదును కోరుకొని గొఱ్ఱెల దొడ్లలోనుండి అతని పిలిపించెను. పాడిగొఱ్ఱెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రా యేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థహృదయుడై వారిని పాలించెను కార్యములయందు నేర్పరియై వారిని నడిపించెను.
- Acts 5:29–32 అపొస్తలుల కార్యములు 5:29–32అందుకు పేతురును అపొస్తలులునుమనుష్యలకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా. మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారుమనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతిని గాను రక్షకునిగాను తన దక్షిణహస్తబలముచేత హెచ్చించి యున్నాడు. మేమును, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, ఈ సంగతులకు సాక్షులమై యున్నామని చెప్పిరి.
- Luke 24:46–48 లూకా 24:46–48క్రీస్తు శ్రమపడి మూడవ దిన మున మృతులలోనుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు
- Acts 4:20 అపొస్తలుల కార్యములు 4:20మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;