Acts · chapter 4 · verse 20
Acts 4:20 in Telugu
మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;
Memu kannavaatini vinnavaatini cheppaka yundalemani vaariki uttaramichchiri;
Acts 4:20 in English
- King James Version (KJV)
- For we can not but speak the things which we have seen and heard.
- World English Bible (WEB)
- for we can’t help telling the things which we saw and heard.”
- American Standard Version (ASV)
- for we cannot but speak the things which we saw and heard.
- Bible in Basic English (BBE)
- For it is not possible for us to keep from saying what we have seen and have knowledge of.
- Darby Translation (DBY)
- for as for us we cannot refrain from speaking of the things which we have seen and heard.
- Webster's Bible (WBS)
- For we cannot but speak the things which we have seen and heard.
- Young's Literal Translation (YLT)
- for we cannot but speak what we did see and hear.'
Read in context
- 18అప్పుడు వారిని పిలిపించిమీరు యేసు నామమునుబట్టి యెంతమాత్రమును మాటలాడకూడదు, బోధింపనుకూడదని వారికాజ్ఞాపించిరి.
- 19అందుకుపేతురును యోహానును వారినిచూచి దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి;
- 20మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;
- 21ప్రజలందరు జరిగిన దానినిగూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొన లేక వీరిని గట్టిగా బెదరించి విడుదలచేసిరి.
- 22స్వస్థ పరచుట అను ఆ సూచకక్రియ యెవని విషయములో చేయబడెనో వాడు నలువది ఏండ్లకంటె ఎక్కువ వయస్సు గలవాడు.
Cross references
- Jeremiah 20:9 యిర్మీయా 20:9ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను, అని నేనను కొంటినా? అది నా హృదయములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికి యున్నాను, చెప్పక మానలేదు.
- Acts 22:15 అపొస్తలుల కార్యములు 22:15నీవు కన్నవాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుష్యులయెదుట ఆయనకు సాక్షివైయుందువు.
- 1 Corinthians 9:16–17 1 కొరింథీయులకు 9:16–17నేను సువార్తను ప్రకటించు చున్నను నాకు అతిశయకారణములేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నామీద మోపబడియున్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపక పోయినయెడల నాకు శ్రమ. ఇది నేనిష్టపడి చేసినయెడల నాకు జీతము దొరకును. ఇష్టపడకపోయినను గృహనిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను.
- 1 John 1:1–3 1 యోహాను 1:1–3జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను; తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవ మునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము. మాతోకూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచినదానిని వినినదానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు తోకూడను ఉన్నది.
- Ezekiel 3:11 యెహెజ్కేలు 3:11బయలుదేరి చెరలోనున్న నీ జనుల యొద్దకు పోయి యీ మాటలు ప్రకటింపుము, వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చెను.
- Acts 5:32 అపొస్తలుల కార్యములు 5:32మేమును, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, ఈ సంగతులకు సాక్షులమై యున్నామని చెప్పిరి.
- Jeremiah 1:17–19 యిర్మీయా 1:17–19కాబట్టి నీవు నడుముకట్టు కొని నిలువబడి నేను నీకాజ్ఞాపించునదంతయు వారికి ప్రకటనచేయుము; భయపడకుము లేదా నేను వారి యెదుట నీకు భయము పుట్టింతును. యూదా రాజుల యొద్దకు గాని ప్రధానులయొద్దకు గాని యాజకులయొద్దకు గాని దేశనివాసులయొద్దకు గాని, యీ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను, ప్రాకారముగల పట్టణముగాను ఇనుపస్తంభముగాను ఇత్తడి గోడలు గాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించియున్నాను. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై యున్నందున వారు నీపైని విజయము పొంద జాలరు; ఇదే యెహోవా వాక్కు.
- Acts 10:39–41 అపొస్తలుల కార్యములు 10:39–41ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసినవాటికన్నిటికిని మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి. దేవుడాయనను మూడవ దినమున లేపి ప్రజలకందరికి కాక దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయనతో కూడ అన్నపానములు పుచ్చుకొనిన మాకే, ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను.
- Acts 1:8 అపొస్తలుల కార్యములు 1:8అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను
- Numbers 22:38 సంఖ్యాకాండము 22:38అందుకు బిలాముఇదిగో నీయొద్దకు వచ్చితిని; అయిన నేమి? ఏదైనను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పెను.
- Luke 1:2 లూకా 1:2ఆరంభమునుండి కన్ను లార చూచి వాక్యసేవకులైనవారు మనకు అప్పగించిన ప్రకారము మనమధ్యను నెరవేరిన కార్యములనుగూర్చి వివరముగ వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు
- Job 32:18–20 యోబు 32:18–20నా మనస్సునిండ మాటలున్నవి నా అంతరంగముననున్న ఆత్మ నన్ను బలవంతము చేయు చున్నది. నా మనస్సు తెరువబడని ద్రాక్షారసపు తిత్తివలె నున్నది క్రొత్త తిత్తులవలె అది పగిలిపోవుటకు సిద్ధముగా నున్నది. నేను మాటలాడి ఆయాసము తీర్చుకొనెదను నా పెదవులు తెరచి నేను ప్రత్యుత్తరమిచ్చెదను.