Skip to content
ThuthiThuthiThuthi
Telugu Bible passage

The Beatitudes in Telugu

ధన్యతలు (కొండమీది ప్రసంగము)

"Blessed are…": the Beatitudes from Jesus' Sermon on the Mount (Matthew 5:3–12) in the Telugu Bible with English.

  1. ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది.

    Blessed [are] the poor in spirit: for theirs is the kingdom of heaven.

    Matthew 5:3 (మత్తయి 5:3)
  2. దుఃఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు.

    Blessed [are] they that mourn: for they shall be comforted.

    Matthew 5:4 (మత్తయి 5:4)
  3. సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.

    Blessed [are] the meek: for they shall inherit the earth.

    Matthew 5:5 (మత్తయి 5:5)
  4. నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారుతృప్తిపరచబడుదురు.

    Blessed [are] they which do hunger and thirst after righteousness: for they shall be filled.

    Matthew 5:6 (మత్తయి 5:6)
  5. కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.

    Blessed [are] the merciful: for they shall obtain mercy.

    Matthew 5:7 (మత్తయి 5:7)
  6. హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.

    Blessed [are] the pure in heart: for they shall see God.

    Matthew 5:8 (మత్తయి 5:8)
  7. సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు.

    Blessed [are] the peacemakers: for they shall be called the children of God.

    Matthew 5:9 (మత్తయి 5:9)
  8. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.

    Blessed [are] they which are persecuted for righteousness’ sake: for theirs is the kingdom of heaven.

    Matthew 5:10 (మత్తయి 5:10)
  9. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి.

    Blessed are ye, when [men] shall revile you, and persecute [you], and shall say all manner of evil against you falsely, for my sake. Rejoice, and be exceeding glad: for great [is] your reward in heaven: for so persecuted they the prophets which were before you.

    Matthew 5:11–12 (మత్తయి 5:11–12)

More from the Telugu Bible

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.