Matthew · chapter 5 · verse 9
Matthew 5:9 in Telugu
సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు.
Samaadhaanaparachuvaaru dhanyulu; vaaru devuni kumaarulanabaduduru.
Matthew 5:9 in English
- King James Version (KJV)
- Blessed [are] the peacemakers: for they shall be called the children of God.
- World English Bible (WEB)
- Blessed are the peacemakers, for they shall be called children of God.
- American Standard Version (ASV)
- Blessed are the peacemakers: for they shall be called sons of God.
- Bible in Basic English (BBE)
- Happy are the peacemakers: for they will be named sons of God.
- Darby Translation (DBY)
- Blessed the peace-makers, for they shall be called sons of God.
- Webster's Bible (WBS)
- Blessed [are] the peace-makers: for they shall be called children of God.
- Young's Literal Translation (YLT)
- 'Happy the peacemakers — because they shall be called Sons of God.
Read in context
- 7కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.
- 8హృదయశుద్ధిగలవారు ధన్యులు; వారు దేవుని చూచెదరు.
- 9సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు.
- 10నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది.
- 11నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు.
Cross references
- Hebrews 12:14 హెబ్రీయులకు 12:14అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతలేకుండ ఎవడును ప్రభువును చూడడు.
- James 3:16–18 యాకోబు 3:16–18ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును. అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరము తోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది. నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును.
- Romans 12:18 రోమీయులకు 12:18శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి.
- Galatians 5:22 గలతీయులకు 5:22అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయా ళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము.
- Psalm 120:6 కీర్తనలు 120:6కలహప్రియునియొద్ద నేను చిరకాలము నివసించినవాడను.
- Romans 8:14 రోమీయులకు 8:14దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు.
- Luke 6:35 లూకా 6:35మీరైతే ఎట్టి వారిని గూర్చియైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలుచేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన, కృతజ్ఞతలేనివారియెడ లను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు.
- Romans 14:17–19 రోమీయులకు 14:17–19దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది. ఈ విషయ మందు క్రీస్తునకు దాసుడైనవాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై యున్నాడు. కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము.
- Ephesians 5:1–2 ఎఫెసీయులకు 5:1–2కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి.
- 2 Corinthians 13:11 2 కొరింథీయులకు 13:11తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై యుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏకమనస్సుగలవారై యుండుడి సమాధానముగా ఉండుడి; ప్రేమ సమాధాన ములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.
- James 1:19–20 యాకోబు 1:19–20నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.
- Psalm 122:6–8 కీర్తనలు 122:6–8యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమి త్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును.