Deuteronomy · chapter 12 · verse 8
Deuteronomy 12:8 in Telugu
నేడు మనమిక్కడ చేయు చున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్త మైన దంతయు చేయకూడదు.
Nedu manamikkada cheyu chunnatlu meelo prati manushyudu tana kantiki yukta maina dantayu cheyakoodadu.
Deuteronomy 12:8 in English
- King James Version (KJV)
- Ye shall not do after all [the things] that we do here this day, every man whatsoever [is] right in his own eyes.
- World English Bible (WEB)
- You shall not do all the things that we do here today, every man whatever is right in his own eyes;
- American Standard Version (ASV)
- Ye shall not do after all the things that we do here this day, every man whatsoever is right in his own eyes;
- Bible in Basic English (BBE)
- You are not to do things then in the way in which we now do them here, every man as it seems right to him:
- Darby Translation (DBY)
- Ye shall not do after all that we do here this day, each one whatever is right in his own eyes.
- Webster's Bible (WBS)
- Ye shall not do after all [the things] that we do here this day, every man whatever [is] right in his own eyes.
- Young's Literal Translation (YLT)
- 'Ye do not do according to all that we are doing here to-day, each anything that is right in his own eyes,
Read in context
- 6అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమభాగములను, ప్రతిష్టితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణ ములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొఱ్ఱె మేకలలోను తొలిచూలు వాటిని తీసికొని రావలెను.
- 7మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మునాశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములును మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనముచేసి మీ చేతిపనులన్నిటి యందు సంతోషింపవలెను.
- 8నేడు మనమిక్కడ చేయు చున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్త మైన దంతయు చేయకూడదు.
- 9నీ దేవుడైన యెహోవా నీ కిచ్చుచున్న విశ్రాంతిని స్వాస్థ్యమును మీరు ఇదివరకు పొందలేదు.
- 10మీరు యొర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టునుండు శత్రువు లందరు లేకుండ మీకు విశ్రాంతి కలుగజేసినందున మీరు నెమ్మది పొందునప్పుడు
Cross references
- Judges 21:25 న్యాయాధిపతులు 21:25ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు; ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచువచ్చెను.
- Judges 17:6 న్యాయాధిపతులు 17:6ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజులేడు; ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను.
- Proverbs 21:2 సామెతలు 21:2ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును యెహోవాయే హృదయములను పరిశీలన చేయు వాడు.
- Acts 7:42 అపొస్తలుల కార్యములు 7:42అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశసైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు వ్రాయబడియున్నది. ఇశ్రాయేలు ఇంటివారలారా మీరు అరణ్యములో నలువది యేండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా?
- Numbers 15:39 సంఖ్యాకాండము 15:39మీరు నా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకముచేసికొని మీ దేవునికి ప్రతిష్ఠితులైయుండునట్లు మునుపటివలె కోరినవాటిని బట్టియు చూచినవాటినిబట్టియు వ్యభిచరింపక,
- Amos 5:25 ఆమోసు 5:25ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు నలువది సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా?