Proverbs · chapter 21 · verse 2
Proverbs 21:2 in Telugu
ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును యెహోవాయే హృదయములను పరిశీలన చేయు వాడు.
Okadu tanakerparachukonina maargamu ettidainanu tana drushtikadi nyaayamugaane agapadunu yehovaaye hrudayamulanu parisheelana cheyu vaadu.
Proverbs 21:2 in English
- King James Version (KJV)
- Every way of a man [is] right in his own eyes: but the LORD pondereth the hearts.
- World English Bible (WEB)
- Every way of a man is right in his own eyes, but the LORD weighs the hearts.
- American Standard Version (ASV)
- Every way of a man is right in his own eyes; But Jehovah weigheth the hearts.
- Bible in Basic English (BBE)
- Every way of a man seems right to himself, but the Lord is the tester of hearts.
- Darby Translation (DBY)
- Every way of a man is right in his own eyes; but Jehovah weigheth the hearts.
- Webster's Bible (WBS)
- Every way of a man [is] right in his own eyes: but the LORD pondereth the hearts.
- Young's Literal Translation (YLT)
- Every way of a man [is] right in his own eyes, And Jehovah is pondering hearts.
Read in context
- 1యెహోవా చేతిలో రాజు హృదయము నీటికాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తిచొప్పున దాని త్రిప్పును.
- 2ఒకడు తనకేర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికది న్యాయముగానే అగపడును యెహోవాయే హృదయములను పరిశీలన చేయు వాడు.
- 3నీతిన్యాయముల ననుసరించి నడచుకొనుట బలుల నర్పించుటకంటె యెహోవాకు ఇష్టము.
- 4అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు.
Cross references
- Proverbs 16:2 సామెతలు 16:2ఒకని నడతలన్నియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యెహోవా ఆత్మలను పరిశోధించును.
- Luke 16:15 లూకా 16:15ఆయన మీరు మనుష్యులయెదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము.
- Proverbs 16:25 సామెతలు 16:25ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును.
- Jeremiah 17:10 యిర్మీయా 17:10ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను.
- Proverbs 30:12 సామెతలు 30:12తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యమునుండి కడుగబడని వారి తరము కలదు.
- 1 Samuel 16:7 1 సమూయేలు 16:7అయితే యెహోవా సమూ యేలుతో ఈలాగు సెలవిచ్చెను అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసియున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.
- Proverbs 24:12 సామెతలు 24:12ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనినయెడల హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా నరులకు వారి వారి పనులనుబట్టి ఆయన ప్రతికారము చేయును గదా.
- James 1:22 యాకోబు 1:22మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునైయుండుడి.
- Luke 18:11–12 లూకా 18:11–12పరిసయ్యుడు నిలువబడిదేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉప వాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించుచుండెను.
- Psalm 36:2 కీర్తనలు 36:2వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టియెదుట వాని ముఖస్తుతి చేయుచున్నది.
- Galatians 6:3 గలతీయులకు 6:3ఎవడైనను వట్టివాడైయుండి తాను ఎన్నికైన వాడనని యెంచుకొనినయెడల తన్నుతానే మోసపరచు కొనును.
- John 2:24–25 యోహాను 2:24–25అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొన లేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన వాడు గనుక ఎవడును మనుష్యునిగూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు.