Deuteronomy · chapter 20 · verse 7
Deuteronomy 20:7 in Telugu
ఒకడు స్త్రీని ప్రధానము చెసికొని ఆమెను ఇంకను పరిగ్రహింపకమునుపే యుధ్ధములో చనిపోయినయెడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.
Okadu streeni pradhaanamu chesikoni aamenu inkanu parigrahimpakamunupe yudhdhamulo chanipoyinayedala verokadu aamenu parigrahinchunu ganuka attivaadunu tana yintiki tirigi vellavachchunu.
Deuteronomy 20:7 in English
- King James Version (KJV)
- And what man [is there] that hath betrothed a wife, and hath not taken her? let him go and return unto his house, lest he die in the battle, and another man take her.
- World English Bible (WEB)
- What man is there who has pledged to be married to a wife, and has not taken her? Let him go and return to his house, lest he die in the battle, and another man take her.”
- American Standard Version (ASV)
- And what man is there that hath betrothed a wife, and hath not taken her? let him go and return unto his house, lest he die in the battle, and another man take her.
- Bible in Basic English (BBE)
- Or if any man is newly married and has had no sex relations with his wife, let him go back to his house, so that in the event of his death in the fight, another man may not take her.
- Darby Translation (DBY)
- And what man is there that hath betrothed a wife, and hath not taken her? let him go and return unto his house, lest he die in the battle, and another man take her.
- Webster's Bible (WBS)
- And what man [is there] that hath betrothed a wife, and hath not taken her? let him go and return to his house, lest he should die in battle, and another man should take her.
- Young's Literal Translation (YLT)
- 'And who [is] the man that hath betrothed a woman, and hath not taken her? — let him go and turn back to his house, lest he die in battle, and another man take her.
Read in context
- 5మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, క్రొత్తయిల్లు కట్టు కొనినవాడు గృహప్రవేశము కాకమునుపే యుద్ధ ములో చనిపోయినయెడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.
- 6ద్రాక్షతోటవేసి యింక దాని పండ్లు తినక ఒకడు యుద్ధ ములో చనిపోయినయెడల వేరొకడు దాని పండ్లు తినును గనుక అట్టివాడును తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.
- 7ఒకడు స్త్రీని ప్రధానము చెసికొని ఆమెను ఇంకను పరిగ్రహింపకమునుపే యుధ్ధములో చనిపోయినయెడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.
- 8నాయకులు జనులతో యెవడు భయపడి మెత్తని గుండెగల వాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండునట్లు తన యింటికి తిరిగి వెళ్లవచ్చునని చెప్పవలెను.
- 9నాయకులు జనులతో మాటలాడుట చాలిం చిన తరువాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలెను.
Cross references
- Deuteronomy 24:5 ద్వితీయోపదేశకాండము 24:5ఒకడు క్రొత్తగా ఒకదానిని పెండ్లిచేసికొని సేనలోచేరి పోకూడదు. అతనిపైన యే వ్యాపారభారమును మోప కూడదు. ఏడాదివరకు తీరికగా అతడు తన యింట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను.
- Deuteronomy 28:30 ద్వితీయోపదేశకాండము 28:30స్త్రీని ప్రధానము చేసికొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లుకట్టుదువుగాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువుగాని దాని పండ్లు తినవు.
- Deuteronomy 22:23–25 ద్వితీయోపదేశకాండము 22:23–25కన్యకయైన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలిసికొని ఆమెతో శయనించిన యెడల ఆ ఊరి గవినియొద్దకు వారిద్దరిని తీసికొనివచ్చి, ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను, తన పొరుగువాని భార్యను అవమానపరచినందున ఆ మను ష్యుని, రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడు తనమును మీలోనుండి పరిహరించుదురు. ఒకడు ప్రధానముచేయబడిన చిన్నదానిని పొలములో కలిసికొనినప్ఫుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించినయెడల ఆమెతో శయనించిన మను ష్యుడు మాత్రమే చావవలెను.
- Luke 14:18–20 లూకా 14:18–20అయితే వారందరు ఏకమనస్సుతో నెపములు చెప్ప సాగిరి. మొదటివాడు నేనొక పొలము కొనియున్నాను, అవశ్యముగా వెళ్లిదాని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను. మరియెకడు నేను అయిదు జతల యెడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్లుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాననెను. మరి యొకడునేనొక స్త్రీని వివాహము చేసికొన్నాను; అందుచేత నేను రాలేననెను.
- Matthew 1:18 మత్తయి 1:18యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను.
- 2 Timothy 2:4 2 తిమోతికి 2:4సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు, తన్ను దండులో చేర్చుకొనినవానిని సంతోషపెట్టవలెనని యీ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు.