Deuteronomy · chapter 24 · verse 14
Deuteronomy 24:14 in Telugu
నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామము లలోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటికూలి ఆ నాడియ్యవలెను.
Nee sahodarulalonemi nee deshamandali nee graamamu lalonunna paradeshulalonemi deenadaridrudaina koolivaanini baadhimpakoodadu. Enaatikooli aa naadiyyavalenu.
Deuteronomy 24:14 in English
- King James Version (KJV)
- Thou shalt not oppress an hired servant [that is] poor and needy, [whether he be] of thy brethren, or of thy strangers that [are] in thy land within thy gates:
- World English Bible (WEB)
- You shall not oppress a hired servant who is poor and needy, whether he is one of your brothers or one of the foreigners who are in your land within your gates.
- American Standard Version (ASV)
- Thou shalt not oppress a hired servant that is poor and needy, whether he be of thy brethren, or of thy sojourners that are in thy land within thy gates:
- Bible in Basic English (BBE)
- Do not be hard on a servant who is poor and in need, if he is one of your countrymen or a man from another nation living with you in your land.
- Darby Translation (DBY)
- Thou shalt not oppress a hired servant [who is] poor and needy of thy brethren, or of thy sojourners who are in thy land within thy gates:
- Webster's Bible (WBS)
- Thou shalt not oppress a hired servant [that is] poor and needy, [whether he is] of thy brethren, or of thy strangers that [are] in thy land within thy gates:
- Young's Literal Translation (YLT)
- 'Thou dost not oppress a hireling, poor and needy, of thy brethren or of thy sojourner who is in thy land within thy gates;
Read in context
- 12ఆ మనుష్యుడు బీదవాడైనయెడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసికొని పండుకొని నిన్ను దీవించు నట్లు సూర్యుడు అస్తమించునప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరల అప్పగింపవలెను.
- 13అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి యగును.
- 14నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామము లలోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటికూలి ఆ నాడియ్యవలెను.
- 15సూర్యుడు అస్తమింపకమునుపు వానికియ్య వలెను. వాడు బీదవాడు గనుక దానిమీద ఆశ పెట్టు కొనియుండును. వాడు నిన్నుబట్టి యెహోవాకు మొఱ్ఱపెట్టు నేమో అది నీకు పాపమగును.
- 16కుమారుల దోషమునుబట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమునుబట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవనిపాపము నిమిత్తమువాడే మరణశిక్ష నొందును.
Cross references
- Malachi 3:5 మలాకీ 3:5తీర్పు తీర్చుటకై నేను మీయొద్దకు రాగా, చిల్లంగివాండ్ర మీదను వ్యభిచారులమీదను అప్ర మాణికులమీదను, నాకు భయపడక వారి కూలివిషయ ములో కూలివారిని విధవరాండ్రను తండ్రిలేనివారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయువారిమీదను దృఢ ముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- Proverbs 14:31 సామెతలు 14:31దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించు వాడు బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు.
- Proverbs 22:16 సామెతలు 22:16లాభమునొందవలెనని దరిద్రులకు అన్యాయము చేయు వానికిని ధనవంతుల కిచ్చువానికిని నష్టమే కలుగును.
- Job 24:10–11 యోబు 24:10–11దరిద్రులు వస్త్రహీనులై బట్టలులేక తిరుగులాడుదురు ఆకలిగొని పనలను మోయుదురు. వారు తమ యజమానుల గోడలలోపల నూనె గానుగ లను ఆడించుదురుద్రాక్ష గానుగలను త్రొక్కుచు దప్పిగలవారైయుందురు.
- Amos 4:1 ఆమోసు 4:1షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగగొట్టువారలారా మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారలారా, యీ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా
- Luke 10:7 లూకా 10:7వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ యింటిలోనే యుండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటిం టికి తిరుగవద్దు.
- Job 31:13–15 యోబు 31:13–15నా పనివాడైనను పనికత్తెయైనను నాతో వ్యాజ్యె మాడగా నేను వారి వ్యాజ్యెమును నిర్లక్ష్యము చేసిన యెడల దేవుడు లేచునప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయునప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరమిత్తును? గర్భమున నన్ను పుట్టించినవాడు వారినికూడ పుట్టింప లేదా? గర్భములో మమ్ము రూపించినవాడు ఒక్కడే గదా.
- Amos 2:7 ఆమోసు 2:7దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు; దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు; తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధనామమును అవమానపరచుదురు;
- Deuteronomy 15:12–18 ద్వితీయోపదేశకాండము 15:12–18నీ సహోదరులలో హెబ్రీయుడే గాని హెబ్రీయు రాలే గాని నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు నీకు దాస్యము చేసినయెడల ఏడవ సంవత్సరమున వాని విడి పించి నీయొద్దనుండి పంపివేయవలెను. అయితే వాని విడిపించి నీయొద్దనుండి పంపివేయునప్పుడు నీవు వట్టిచేతు లతో వాని పంపివేయకూడదు. నీవు ఐగుప్తుదేశములో దాసుడవై యున్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించెనని జ్ఞాపకము చేసికొని, నీ మందలోను నీ కళ్లములోను నీ ద్రాక్ష గానుగలోను కొంత అవశ్యముగా వాని కియ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వ దించి నీ కనుగ్రహించిన దానిలో కొంత వానికియ్యవలెను. ఆ హేతువుచేతను నేను ఈ సంగతి నేడు నీ కాజ్ఞాపించియున్నాను. అయితే నీయొద్ద వానికి మేలు కలిగినందుననిన్నును నీ యింటివారిని ప్రేమించు చున్నాను గనుక నేను నీ యొద్దనుండి వెళ్లిపోనని అతడు నీతో చెప్పినయెడల నీవు కదురును పట్టుకొని, తలుపు లోనికి దిగునట్లుగా వాని చెవికి దానినిగుచ్చవలెను. ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడై యుండును. ఆలాగుననే నీవు నీ దాసికిని చేయవలెను. వానిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకొన కూడదు. ఏలయనగా వాడు ఆరు సంవత్సరములు నీకు దాస్యము చేసినందున జీతగానికి రావలసిన రెండు జీత ముల లాభము నీకు కలిగెను. ఆలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయువాటన్నిటి విషయములో నిన్ను ఆశీర్వదించును.
- Leviticus 25:35–43 లేవీయకాండము 25:35–43పరవాసియైనను అతిథియైనను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీయొద్దకు వచ్చినయెడల నీవు వానికి సహాయము చేయవలెను; అతడు నీవలన బ్రదుకవలెను. నీ దేవునికి భయపడి వానియొద్ద వడ్డినైనను తీసి కొనకూడదు; నీ సహోదరుడు నీవలన బ్రదుకవలెను. నీ రూకలు వానికి వడ్డికియ్యకూడదు; నీ ఆహారమును వానికి లాభమున కియ్యకూడదు. నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడగునట్లు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. నీయొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడినయెడల వానిచేత బానిససేవ చేయించుకొన కూడదు. వాడు జీతగానివలెను పరవాసివలెను నీయొద్ద నివసించు సునాదసంవత్సరమువరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను. అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరల అనుభవించునట్లు తన పిల్లలతో కూడ నీయొద్దనుండి బయలుదేరి తన వంశస్థులయొద్దకు తిరిగి వెళ్లవలెను. ఏల యనగా వారు నాకే దాసులైయున్నారు, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించితిని; దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు; నీ దేవునికి భయపడి అట్టివానిని కఠిన ముగా చూడకుము.
- Amos 8:4 ఆమోసు 8:4దేశమందు బీదలను మింగివేయను దరిద్రులను మాపివేయను కోరువారలారా,
- Ezekiel 22:7 యెహెజ్కేలు 22:7నీలో తలిదండ్రులు అవమానమొందుదురు, నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు, నీలో తండ్రిలేని వారును విధవరాండ్రును హింసింపబడుదురు,