Deuteronomy · chapter 29 · verse 7
Deuteronomy 29:7 in Telugu
మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోనును బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మనమీదికి రాగా
Meeru ee chotiki cherinappudu heshbonu raajaina seehonunu baashaanu raajaina ogunu yuddhamunaku manameediki raagaa
Deuteronomy 29:7 in English
- King James Version (KJV)
- And when ye came unto this place, Sihon the king of Heshbon, and Og the king of Bashan, came out against us unto battle, and we smote them:
- World English Bible (WEB)
- When you came to this place, Sihon the king of Heshbon and Og the king of Bashan came out against us to battle, and we struck them.
- American Standard Version (ASV)
- And when ye came unto this place, Sihon the king of Heshbon, and Og the king of Bashan, came out against us unto battle, and we smote them:
- Bible in Basic English (BBE)
- When you came to this place, Sihon, king of Heshbon, and Og, king of Bashan, came out to make war against us and we overcame them:
- Darby Translation (DBY)
- And ye came to this place; and Sihon the king of Heshbon and Og the king of Bashan came out against us for battle, and we smote them.
- Webster's Bible (WBS)
- And when ye came to this place, Sihon the king of Heshbon, and Og the king of Bashan, came out against us to battle, and we smote them:
- Young's Literal Translation (YLT)
- 'And ye come in unto this place, and Sihon king of Heshbon — also Og king of Bashan — doth come out to meet us, to battle, and we smite them,
Read in context
- 5నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలిసికొనునట్లు నలువది సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటిమీద పాతగిలిపోలేదు; మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలి పోలేదు.
- 6మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమేగాని మద్యమేగాని త్రాగలేదని యెహోవా సెలవిచ్చు చున్నాడు.
- 7మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోనును బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మనమీదికి రాగా
- 8మనము వారిని హతము చేసి వారి దేశ మును స్వాధీనపరచుకొని రూబేనీయులకును గాదీయుల కును మనష్షే అర్ధగోత్రపువారికిని దాని స్వాస్థ్యముగా ఇచ్చితివిు.
- 9కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచు కొనవలెను.
Cross references
- Numbers 21:21–35 సంఖ్యాకాండము 21:21–35ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపిమమ్మును నీ దేశములో బడి వెళ్లనిమ్ము. మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము; బావుల నీళ్లు త్రాగము; మేము నీ పొలిమేరలను దాటువరకు రాజమార్గములోనే నడిచి పోదుమని అతనితో చెప్పించిరి. అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనియ్య లేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసెను. ఇశ్రాయేలీయులు వానిని కత్తివాత హతముచేసి, వాని దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకువరకు, అనగా అమ్మోనీయుల దేశమువరకు స్వాధీనపరచుకొనిరి. అమ్మోనీయుల పొలిమేర దుర్గమమైనది. అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటిని పట్టుకొనిరి. ఇశ్రాయేలీయులు అమోరీ యుల పట్టణములన్నిటిలోను హెష్బోనులోను దాని పల్లె లన్నిటిలోను దిగిరి. హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము; అతడు అంతకు మునుపు మోయాబు రాజుతో యుద్ధముచేసి అర్నోనువరకు వాని దేశమంతయు పట్టుకొనెను. కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు హెష్బోనుకు రండి సీహోను పట్టణమును కట్టవలెను దానిని స్థాపింపవలెను హెష్బోనునుండి అగ్ని బయలువెళ్లెను సీహోను పట్టణమునుండి జ్వాలలు బయలువెళ్లెను అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను అర్నోనుయొక్క ఉన్నతస్థలముల ప్రభువులను కాల్చెను. మోయాబూ, నీకు శ్రమ కెమోషు జనులారా, మీరు నశించితిరి తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను అతడు అమోరీయులరాజైన సీహోనుకు చెరగాఇచ్చెను. వాటిమీద గురిపెట్టి కొట్టితివిు దీబోనువరకు హెష్బోను నశించెను నోఫహువరకు దాని పాడు చేసితివిు. అగ్నివలన మేదెబావరకు పాడుచేసితివిు. అట్లు ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశములో దిగిరి. మరియు యాజెరు దేశమును సంచరించి చూచు టకై మోషే మనుష్యులను పంపగా వారు దాని గ్రామ ములను వశము చేసికొని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి. వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్లినప్పుడు బాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయీలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా యెహోవా మోషేతో నిట్లనెను అతనికి భయపడకుము; నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని; నీవు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయుదువు. కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండ అతని సమస్త జనమును హతముచేసి అతని దేశమును స్వాధీన పరచుకొనిరి.
- Psalm 135:10–12 కీర్తనలు 135:10–12అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు. అమోరీయుల రాజైన ఓగును హతముచేసెను కనాను రాజ్యములన్నిటిని పాడుచేసెను. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను.
- Psalm 136:17–22 కీర్తనలు 136:17–22గొప్ప రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధినొందిన రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును.
- Numbers 32:33–42 సంఖ్యాకాండము 32:33–42అప్పుడు మోషే వారికి, అనగా గాదీయులకును రూబే నీయులకును యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికిని, అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును, బాషాను రాజైన ఓగు రాజ్యమును, దాని ప్రాంతపురములతో ఆ దేశమును చట్టునుండు ఆ దేశపురములను ఇచ్చెను. గాదీయులు దీబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను యాజెరు యొగ్బెహ బేత్నిమ్రా బేత్హారాను అను ప్రాకారములుగల పురములను మందల దొడ్లను కట్టు కొనిరి. రూబేనీయులు మారుపేరుపొందిన హెష్బోను ఏలాలే కిర్యతాయిము నెబో బయల్మెయోను షిబ్మా అను పురములను కట్టి, తాము కట్టిన ఆ పురములకు వేరు పేరులు పెట్టిరి. మనష్షే కుమారులైన మాకీరీయులు గిలాదుమీదికి పోయి దాని పట్టుకొని దానిలోనున్న అమోరీయులను వెళ్లగొట్టిరి. మోషే మనష్షే కుమారు డైన మాకీరుకు గిలాదునిచ్చెను అతడు అక్కడ నివ సించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్లి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టెను. నోబహు వెళ్లి కెనాతును దాని గ్రామము లను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టెను.
Original words (Hebrew)
- came · H935בּוֹא bôwʼ
- place · H4725מָקוֹם mâqôwm
- Sihon · H5511סִיחוֹן Çîychôwn
- king · H4428מֶלֶךְ melek
- Heshbon · H2809חֶשְׁבּוֹן Cheshbôwn
- Og · H5747עוֹג ʻÔwg
- king · H4428מֶלֶךְ melek
- Bashan · H1316בָּשָׁן Bâshân
- out · H3318יָצָא yâtsâʼ
- against · H7125קִרְאָה qirʼâh
- battle · H4421מִלְחָמָה milchâmâh
- smote · H5221נָכָה nâkâh