Deuteronomy · chapter 31 · verse 5
Deuteronomy 31:5 in Telugu
నేను మీ కాజ్ఞాపించిన దానినంతటినిబట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుడి
Nenu mee kaajnyaapinchina daaninantatinibatti meeru vaariki cheyunatlu yehovaa nee chetiki vaarini appaginchunu. Nibbaramu galigi dhairyamugaa nundudi
Deuteronomy 31:5 in English
- King James Version (KJV)
- And the LORD shall give them up before your face, that ye may do unto them according unto all the commandments which I have commanded you.
- World English Bible (WEB)
- The LORD will deliver them up before you, and you shall do to them according to all the commandment which I have commanded you.
- American Standard Version (ASV)
- And Jehovah will deliver them up before you, and ye shall do unto them according unto all the commandment which I have commanded you.
- Bible in Basic English (BBE)
- The Lord will give them up into your hands, and you are to do to them as I have given you orders.
- Darby Translation (DBY)
- And when Jehovah giveth them up before you, ye shall do to them according to all the commandment which I have commanded you.
- Webster's Bible (WBS)
- And the LORD shall give them up before your face, that ye may do to them according to all the commandments which I have commanded you.
- Young's Literal Translation (YLT)
- And Jehovah hath given them before your face, and ye have done to them according to all the command which I have commanded you;
Read in context
- 3నీ దేవు డైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ యెదుట నుండకుండ నశింపజేయును, నీవు వారి దేశ మును స్వాధీనపరచుకొందువు. యెహోవా సెలవిచ్చి యున్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును.
- 4యెహోవా నశింపజేసిన అమోరీయుల రాజులైన సీహోను కును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసెనో ఆ ప్రకా రముగానే యీ జనములకును చేయును.
- 5నేను మీ కాజ్ఞాపించిన దానినంతటినిబట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుడి
- 6భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతో కూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడ బాయడు.
- 7మరియు మోషే యెహోషువను పిలిచినీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణముచేసిన దేశ మునకు నీవు వీరితోకూడ పోయి దానిని వారికి స్వాధీన పరచవలెను.
Cross references
- Deuteronomy 7:2 ద్వితీయోపదేశకాండము 7:2నీ దేవుడైన యెహోవా వారిని నీకప్ప గించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసికొనకూడదు, వారిని కరుణింప కూడదు,
- Deuteronomy 20:16–17 ద్వితీయోపదేశకాండము 20:16–17అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్య ముగా నీకిచ్చుచున్న యీ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రదుకనియ్యకూడదు. వీరు, అనగా హీత్తీ యులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివీ్వ యులు యెబూసీయులనువారు తమ తమ దేవతల విష యమై చేసిన సమస్త హేయకృత్యములరీతిగా మీరు చేసి,
- Exodus 23:32–33 నిర్గమకాండము 23:32–33నీవు వారితో నైనను వారి దేవ తలతోనైనను నిబంధన చేసికొనవద్దు. నీవు వారి దేవతలను సేవించినయెడల అది నీకు ఉరియగును గనుక వారు నీచేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశములో నివసింప కూడదు.
- Numbers 33:52–56 సంఖ్యాకాండము 33:52–56ఆ దేశనివాసులందరిని మీ యెదుట నుండి వెళ్లగొట్టి, వారి సమస్త ప్రతిమలను నాశనముచేసి వారి పోతవిగ్రహములనన్నిటిని నశింపచేసి వారి ఉన్నత స్థలములనన్నిటిని పాడుచేసి ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను; ఏలయనగా దాని స్వాధీనపరచుకొనునట్లు ఆ దేశమును మీకిచ్చితిని. మీరు మీ వంశములచొప్పున చీట్లువేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి యే స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను. అయితే మీరు మీ యెదుటనుండి ఆ దేశనివాసులను వెళ్లగొట్టనియెడల, మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లు గాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి, మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధపెట్టెదరు. మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసెదనని వారితో చెప్పుము.
- Deuteronomy 7:18 ద్వితీయోపదేశకాండము 7:18నీ దేవు డైన యెహోవా ఫరోకును ఐగుప్తుదేశమంతటికిని చేసిన దానిని, అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించి నప్పుడు
- Exodus 34:12–16 నిర్గమకాండము 34:12–16నీవు ఎక్కడికి వెళ్లుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసికొనకుండ జాగ్రత్తపడుము. ఒకవేళ అది నీకు ఉరికావచ్చును. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషముగల యెహోవా; ఆయన రోషముగల దేవుడు. ఆ దేశపు నివాసులతో నిబంధనచేసికొనకుండ జాగ్రత్త పడుము; వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన యెడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండ చూచుకొనుము. మరియు నీవు నీ కుమారులకొరకు వారి కుమా ర్తెలను పుచ్చుకొనునెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో.
- Deuteronomy 7:23–25 ద్వితీయోపదేశకాండము 7:23–25అయితే నీ దేవుడైన యెహోవా వారిని నీకప్పగించి వారిని నశింపజేయువరకు వారిని బహుగా తల్లడిల్ల చేయును. ఆయన వారి రాజులను నీ చేతికప్ప గించును. నీవు ఆకాశముక్రిందనుండి వారి నామమును నశింపజేయవలెను; నీవు వారిని నశింపజేయువరకు ఏ మను ష్యుడును నీ యెదుట నిలువలేకపోవును. వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలెను; వాటి మీదనున్న వెండిబంగారములను అపేక్షిం పకూడదు. నీవు దానివలన చిక్కుబడుదువేమో గనుక దానిని తీసికొన కూడదు. ఏలయనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము.