Deuteronomy · chapter 20 · verse 16
Deuteronomy 20:16 in Telugu
అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్య ముగా నీకిచ్చుచున్న యీ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రదుకనియ్యకూడదు.
Ayite nee devudaina yehovaa svaasthya mugaa neekichchuchunna yee janamula puramulalo oopirigala denini bradukaniyyakoodadu.
Deuteronomy 20:16 in English
- King James Version (KJV)
- But of the cities of these people, which the LORD thy God doth give thee [for] an inheritance, thou shalt save alive nothing that breatheth:
- World English Bible (WEB)
- But of the cities of these peoples that the LORD your God gives you for an inheritance, you shall save alive nothing that breathes;
- American Standard Version (ASV)
- But of the cities of these peoples, that Jehovah thy God giveth thee for an inheritance, thou shalt save alive nothing that breatheth;
- Bible in Basic English (BBE)
- But in the towns of these peoples whose land the Lord your God is giving you for your heritage, let no living thing be kept from death:
- Darby Translation (DBY)
- But of the cities of these peoples which Jehovah thy God giveth thee for an inheritance, thou shalt save alive nothing that breatheth,
- Webster's Bible (WBS)
- But of the cities of these people which the LORD thy God doth give thee [for] an inheritance, thou shalt save alive nothing that breatheth:
- Young's Literal Translation (YLT)
- 'Only, of the cities of these peoples which Jehovah thy God is giving to thee [for] an inheritance, thou dost not keep alive any breathing;
Read in context
- 14అయితే స్త్రీలను చిన్నవారిని పశు వులను ఆ పురములో నున్నది యావత్తును దాని కొల్ల సొమ్మంతటిని నీవు తీసికొనవచ్చును; నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్లసొమ్మును నీవు అనుభవించుదువు.
- 15ఈ జనముల పురములు గాక నీకు బహు దూర ముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే యీలాగున చేయవలెను.
- 16అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్య ముగా నీకిచ్చుచున్న యీ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రదుకనియ్యకూడదు.
- 17వీరు, అనగా హీత్తీ యులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివీ్వ యులు యెబూసీయులనువారు తమ తమ దేవతల విష యమై చేసిన సమస్త హేయకృత్యములరీతిగా మీరు చేసి,
- 18నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయు టకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయ వలెను.
Cross references
- Joshua 11:14 యెహోషువ 11:14ఆ పట్టణ ముల సంబంధమైన కొల్లసొమ్మును పశువులను ఇశ్రాయేలీ యులు దోచుకొనిరి. నరులలో ఒకనిని విడువకుండ అందరిని నశింపజేయువరకు కత్తివాతను హతము చేయుచు వచ్చిరి.
- Numbers 21:2–3 సంఖ్యాకాండము 21:2–3ఇశ్రాయేలీయులు యెహోవాకు మ్రొక్కుకొని నీవు మా చేతికి ఈ జన మును బొత్తిగా అప్పగించినయెడల మేము వారి పట్టణము లను నీ పేరట నిర్మూలము చేసెదమనిరి. యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కానానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను.
- Joshua 6:17–21 యెహోషువ 6:17–21ఈ పట్టణ మును దీనిలో నున్నది యావత్తును యెహోవా వలన శపింప బడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ యింటనున్న వారంద రును మాత్రమే బ్రదుకుదురు. శపింపబడినదానిలో కొంచెమైనను మీరు తీసికొనిన యెడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడిపాత్రలును ఇనుపపాత్ర లును యెహోవాకు ప్రతిష్ఠితములగును; వాటిని యెహోవా ధనాగారములో నుంచవలెను. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను; ప్రజలందరు తమ యెదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలనందరిని యెద్దులను గొఱ్ఱెలను గాడిదలను ఆ పట్ట ణములోని సమస్తమును కత్తివాత సంహరించిరి.
- Deuteronomy 7:1–4 ద్వితీయోపదేశకాండము 7:1–4నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవు డైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను, అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులను ఏడు జనములను నీ యెదుటనుండి వెళ్లగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకప్ప గించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను. వారితో నిబంధన చేసికొనకూడదు, వారిని కరుణింప కూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింప కుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అందునుబట్టి యెహోవా కోపాగ్ని నీమీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును.
- Deuteronomy 7:16 ద్వితీయోపదేశకాండము 7:16మరియు నీ దేవు డైన యెహోవా నీ కప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనముచేయుదువు. నీవు వారిని కటా క్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు, ఏలయనగా అది నీకు ఉరియగును.
- Exodus 23:31–33 నిర్గమకాండము 23:31–33మరియు ఎఱ్ఱ సముద్రమునుండి ఫిలిష్తీయుల సముద్రము వరకును అరణ్యమునుండి నదివరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను, ఆ దేశ నివాసులను నీ చేతి కప్పగించెదను. నీవు నీ యెదుటనుండి వారిని వెళ్లగొట్టెదవు. నీవు వారితో నైనను వారి దేవ తలతోనైనను నిబంధన చేసికొనవద్దు. నీవు వారి దేవతలను సేవించినయెడల అది నీకు ఉరియగును గనుక వారు నీచేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశములో నివసింప కూడదు.
- Joshua 10:28 యెహోషువ 10:28ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకొని దానిని దాని రాజును కత్తివాతను హతముచేసెను. అతడు వారిని దానిలోనున్న వారినందరిని నిర్మూలము చేసెను; యెరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను.
- Numbers 33:52 సంఖ్యాకాండము 33:52ఆ దేశనివాసులందరిని మీ యెదుట నుండి వెళ్లగొట్టి, వారి సమస్త ప్రతిమలను నాశనముచేసి వారి పోతవిగ్రహములనన్నిటిని నశింపచేసి వారి ఉన్నత స్థలములనన్నిటిని పాడుచేసి
- Numbers 21:35 సంఖ్యాకాండము 21:35కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండ అతని సమస్త జనమును హతముచేసి అతని దేశమును స్వాధీన పరచుకొనిరి.
- Joshua 11:11–12 యెహోషువ 11:11–12ఇశ్రాయేలీయులు దానిలోనున్న ప్రతి వానిని కత్తివాతను హతముచేసిరి. ఎవరును తప్పించుకొనకుండ యెహోషువ వారినందరిని నిర్మూలము చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను. యెహోషువ ఆ రాజులనందరిని హతముచేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టెను; యెహోవా సేవ కుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేసెను.
- Joshua 10:40 యెహోషువ 10:40అప్పుడు యెహోషువ మన్యప్రదేశమును దక్షిణ ప్రదే శమును షెఫేలాప్రదేశమును చరియలప్రదేశమును వాటి రాజులనందరిని జయించెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమియు లేకుండ ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను.
- Joshua 9:24 యెహోషువ 9:24అందుకు వారు యెహోషువను చూచినీ దేవుడైన యెహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి, మీ యెదుట నిలువకుండ ఈ దేశనివాసులనందరిని నశింపజేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించెనని నీ దాసులకు రూఢిగా తెలుపబడెను గనుక మేము మా ప్రాణముల విషయములో నీవలన మిక్కిలి భయపడి యీలాగు చేసితివిు.