Deuteronomy · chapter 5 · verse 3
Deuteronomy 5:3 in Telugu
యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైయున్న మనతోనే యీ నిబంధన చేసెను.
Yehovaa mana pitarulato kaadu, nedu ikkada sajeevulamaiyunna manatone yee nibandhana chesenu.
Deuteronomy 5:3 in English
- King James Version (KJV)
- The LORD made not this covenant with our fathers, but with us, [even] us, who [are] all of us here alive this day.
- World English Bible (WEB)
- The LORD didn’t make this covenant with our fathers, but with us, even us, who are all of us here alive today.
- American Standard Version (ASV)
- Jehovah made not this covenant with our fathers, but with us, even us, who are all of us here alive this day.
- Bible in Basic English (BBE)
- The Lord did not make this agreement with our fathers but with us, who are all living and present here today.
- Darby Translation (DBY)
- Not with our fathers did Jehovah make this covenant, but with us, [even] us, those [who are] here alive all of us this day.
- Webster's Bible (WBS)
- The LORD made not this covenant with our fathers, but with us, [even] us, who [are] all of us here alive this day.
- Young's Literal Translation (YLT)
- not with our fathers hath Jehovah made this covenant, but with us; we — these — here to-day — all of us alive.
Read in context
- 1మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి యిట్ల నెనుఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిననుసరించి నడువుడి.
- 2మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధనచేసెను.
- 3యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైయున్న మనతోనే యీ నిబంధన చేసెను.
- 4యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్యనుండి ముఖాముఖిగా మీతో మాటలాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ యెక్కలేదు.
- 5గనుక యెహోవామాట మీకు తెలియ జేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యను నిలిచి యుండగా యెహోవా ఈలాగున సెలవిచ్చెను.
Cross references
- Deuteronomy 29:10–15 ద్వితీయోపదేశకాండము 29:10–15నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము గాను నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను, నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడైయుండు నట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించు చున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసినదానిలోను నీవు పాలుపొందుటకై ఇశ్రాయేలీయులలో ప్రతివాడు, అనగా మీలో ముఖ్యు లేమి, మీ గోత్రపువారేమి మీ పెద్దలేమి, మీ నాయకు లేమి మీ పిల్లలేమి, మీ భార్యలేమి, నీ పాళెములోనున్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారివరకును మీరందరు నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియున్నారు. నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడను ఉండి, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచుచున్నవారి తోను ఇక్కడ నేడు మనతోకూడ నుండని వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను.
- Matthew 13:17 మత్తయి 13:17అనేక ప్రవక్తలును నీతిమంతులును మీరు చూచువాటిని చూడగోరియు చూడక పోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- Jeremiah 32:38–40 యిర్మీయా 32:38–40వారు నాకు ప్రజలైయుందురు నేను వారికి దేవుడనై యుందును. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయు చున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను.
- Genesis 17:7 ఆదికాండము 17:7నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను.
- Galatians 3:17–21 గలతీయులకు 3:17–21నేను చెప్పునదేమనగానాలుగువందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము, వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందు దేవునిచేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్రమూలముగా కలిగినయెడల ఇక వాగ్దానమూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రాహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహిం చెను. ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు? ఎవనికి ఆ వాగ్దా నము చేయబడెనో ఆ సంతానము వచ్చువరకు అది అతి క్రమములనుబట్టి దానికి తరువాత ఇయ్యబడెను; అది మధ్యవర్తిచేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి యొకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రము ఇయ్యబడి యున్నయెడల వాస్తవముగా నీతిధర్మశాస్త్రమూలముగానే కలుగును గాని
- Psalm 105:8–10 కీర్తనలు 105:8–10తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరములవరకు అబ్రాహాముతో తాను చేసిన నింబధనను ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసికొనును. వారి సంఖ్య కొద్దిగా నుండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై యుండగను
- Genesis 17:21 ఆదికాండము 17:21అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను.
- Hebrews 8:8–9 హెబ్రీయులకు 8:8–9అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు ప్రభువు ఇట్లనెను ఇదిగో యొక కాలము వచ్చు చున్నది. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోను యూదా ఇంటివారితోను నేను క్రొత్తనిబంధన చేయుదును. అది నేను ఐగుప్తుదేశములోనుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకైవారిని చెయ్యి పట్టుకొనిన దినమునవారితో నేను చేసిన నిబంధనవంటిది కాదు. ఏమనగావారు - వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితినని ప్రభువు చెప్పుచున్నాడు.