Deuteronomy · chapter 7 · verse 5
Deuteronomy 7:5 in Telugu
కావున మీరు వారికి చేయవలసినదేమనగా, వారి బలిపీఠ ములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను.
Kaavuna meeru vaariki cheyavalasinademanagaa, vaari balipeetha mulanu padadrosi vaari vigrahamulanu pagulagotti vaari devataastambhamulanu narikivesi vaari pratimalanu agnito kaalchavalenu.
Deuteronomy 7:5 in English
- King James Version (KJV)
- But thus shall ye deal with them; ye shall destroy their altars, and break down their images, and cut down their groves, and burn their graven images with fire.
- World English Bible (WEB)
- But you shall deal with them like this: you shall break down their altars, dash their pillars in pieces, cut down their Asherah poles, and burn their engraved images with fire.
- American Standard Version (ASV)
- But thus shall ye deal with them: ye shall break down their altars, and dash in pieces their pillars, and hew down their Asherim, and burn their graven images with fire.
- Bible in Basic English (BBE)
- But this is what you are to do to them: their altars are to be pulled down and their pillars broken, and their holy trees cut down and their images burned with fire.
- Darby Translation (DBY)
- But thus shall ye deal with them: ye shall break down their altars, and shatter their statues, and hew down their Asherahs, and burn their graven images with fire.
- Webster's Bible (WBS)
- But thus shall ye deal with them; ye shall destroy their altars, and break down their images, and cut down their groves, and burn their graven images with fire.
- Young's Literal Translation (YLT)
- 'But thus thou dost to them: their altars ye break down, and their standing pillars ye shiver, and their shrines ye cut down, and their graven images ye burn with fire;
Read in context
- 3నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తె నియ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు.
- 4నన్ను అనుసరింప కుండ ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు, అందునుబట్టి యెహోవా కోపాగ్ని నీమీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును.
- 5కావున మీరు వారికి చేయవలసినదేమనగా, వారి బలిపీఠ ములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను.
- 6నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను ఎక్కువగా ఎంచి, నిన్ను తనకు స్వకీయజనముగా ఏర్పరచుకొనెను.
- 7మీరు సర్వజనముల కంటె విస్తారజనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచు కొనలేదు. సమస్త జనములకంటె మీరు లెక్కకు తక్కు వేగదా.
Cross references
- Exodus 23:24 నిర్గమకాండము 23:24వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింప కూడదు; వారి క్రియలవంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి, వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను.
- Exodus 34:13 నిర్గమకాండము 34:13కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగులగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను.
- Deuteronomy 12:2–3 ద్వితీయోపదేశకాండము 12:2–3మీరు స్వాధీనపరచుకొన బోవు జనములు గొప్ప పర్వతముల మీద నేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నిటిక్రిందనేమి, యెక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలము లన్నిటిని మీరు బొత్తిగా పాడుచేయవలెను. వారి బలి పీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చట లేకుండ నశింప జేయవలెను.
- Deuteronomy 7:25 ద్వితీయోపదేశకాండము 7:25వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలెను; వాటి మీదనున్న వెండిబంగారములను అపేక్షిం పకూడదు. నీవు దానివలన చిక్కుబడుదువేమో గనుక దానిని తీసికొన కూడదు. ఏలయనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము.
- Deuteronomy 16:22 ద్వితీయోపదేశకాండము 16:22నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభము నైన నిలువబెట్టకూడదు.
- Deuteronomy 9:21 ద్వితీయోపదేశకాండము 9:21అప్పుడు మీరు చేసిన పాపమును, అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాని కాల్చి, నలుగగొట్టి, అది ధూళియగునంత మెత్తగా నూరి, ఆ కొండనుండి పారు ఏటిలో ఆ ధూళిని పారపోసితిని.
- Judges 6:25–26 న్యాయాధిపతులు 6:25–26మరియు ఆ రాత్రియందే యెహోవానీ తండ్రి కోడెను, అనగా ఏడేండ్ల రెండవ యెద్దును తీసికొని వచ్చి, నీ తండ్రికట్టిన బయలుయొక్క బలిపీఠమును పడగొట్టి, దానికి పైగానున్న దేవతాస్తంభమును నరికివేసి తగిన యేర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహో వాకు బలిపీఠము కట్టి, ఆ రెండవ కోడెను తీసికొనివచ్చి నీవు నరికిన ప్రతిమయొక్క కఱ్ఱతో దహనబలి నర్పించు మని అతనితో చెప్పెను.
- Leviticus 26:1 లేవీయకాండము 26:1మీరు విగ్రహములను చేసికొనకూడదు. చెక్కిన ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.
- 2 Kings 23:6–14 2 రాజులు 23:6–14యెహోవా మందిరమందున్న అషేరాదేవి ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగుదగ్గరకు తెప్పించి, కిద్రోను వాగు ఒడ్డున దాని కాల్చి త్రొక్కి పొడుముచేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధులమీద చల్లెను. మరియు యెహోవా మందిరమందున్న పురుషగాముల యిండ్లను పడగొట్టించెను. అచ్చట అషేరాదేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి. యూదా పట్టణము లోనున్న యాజకులనందరిని అతడు అవతలికి వెళ్లగొట్టెను, గెబా మొదలుకొని బెయేర్షెబా వరకును యాజకులు ధూపమువేసిన ఉన్నతస్థలములను అతడు అపవిత్ర పరచి, పట్టణములో ప్రవేశించువాని యెడమపార్శ్వమున పట్టణపు అధికారియైన యెహోషువ గుమ్మముదగ్గరనుండు ఉన్నతస్థలములను పడగొట్టించెను. అయినప్పటికి ఆ ఉన్నతస్థలములమీద నియమింపబడిన యాజకులు యెరూ షలేమందున్న యెహోవా బలిపీఠమునొద్దకు రాక తమ సహోదరులయొద్ద పులుసులేని ఆహారము భక్షించువారు. మరియు ఎవడైనను తన కుమారునేగాని కుమార్తెనేగాని మొలెకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బెన్ హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశ మును అతడు అపవిత్రము చేసెను. ఇదియుగాక అతడు యూదారాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుఱ్ఱములను మంట పములో నివసించు పరిచారకుడైన నెతన్మెలకుయొక్క గది దగ్గర యెహోవా మందిరపు ద్వారమునొద్దనుండి తీసివేసి, సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చి వేసెను. మరియు యూదారాజులు చేయించిన ఆహాజు మేడగదిపైనున్న బలిపీఠములను, యెహోవా మందిరపు రెండు సాలలలో మనష్షే చేయించిన బలిపీఠములను రాజు పడ గొట్టించి ఛిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను. యెరూషలేము ఎదుట నున్న హేయమను పర్వతపు కుడిపార్శ్వమందు అష్తా రోతు అను సీదోనీయుల విగ్రహమునకును, కెమోషు అను మోయాబీయుల విగ్రహమునకును, మిల్కోము అను అమ్మోనీయుల విగ్రహమునకును ఇశ్రాయేలురాజైన సొలొ మోను కట్టించిన ఉన్నతస్థలములను రాజు అపవిత్రపరచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి, అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను.
- Exodus 32:20 నిర్గమకాండము 32:20మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసికొని అగ్నితో కాల్చి పొడిచేసి నీళ్లమీద చల్లి ఇశ్రాయేలీయులచేత దాని త్రాగించెను.