Ecclesiastes · chapter 4 · verse 2
Ecclesiastes 4:2 in Telugu
కాబట్టి యింకను బ్రదుకుచున్నవారి కంటె ఇంతకుముందు కాలము చేసినవారే ధన్యులను కొంటిని.
Kaabatti yinkanu bradukuchunnavaari kante intakumundu kaalamu chesinavaare dhanyulanu kontini.
Ecclesiastes 4:2 in English
- King James Version (KJV)
- Wherefore I praised the dead which are already dead more than the living which are yet alive.
- World English Bible (WEB)
- Therefore I praised the dead who have been long dead more than the living who are yet alive.
- American Standard Version (ASV)
- Wherefore I praised the dead that have been long dead more than the living that are yet alive;
- Bible in Basic English (BBE)
- So my praise was for the dead who have gone to their death, more than for the living who still have life.
- Darby Translation (DBY)
- Then I praised the dead who are already dead more than the living who are yet alive;
- Webster's Bible (WBS)
- Wherefore I praised the dead who are already dead more than the living who are yet alive.
- Young's Literal Translation (YLT)
- And I am praising the dead who have already died above the living who are yet alive.
Read in context
- 1పిమ్మట సూర్యునిక్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడు వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు; వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడును లేకపోయెను.
- 2కాబట్టి యింకను బ్రదుకుచున్నవారి కంటె ఇంతకుముందు కాలము చేసినవారే ధన్యులను కొంటిని.
- 3ఇంకను పుట్టని వారు సూర్యునిక్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువుచేత ఈ ఉభయులకంటెను వారే ధన్యులనుకొంటిని.
- 4మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పను లన్నియు నరులకు రోషకారణములని నాకు కనబడెను; ఇదియు వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నమువలెనున్నది.
Cross references
- Job 3:11–26 యోబు 3:11–26గర్భమునుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడువక పోతిని? మోకాళ్లమీద నన్నేల ఉంచుకొనిరి?నేనేల స్తనములను కుడిచితిని? లేనియెడల నేనిప్పుడు పండుకొని నిమ్మళించి యుందును నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగి యుండును తమకొరకు బీడుభూములయందు భవనములు కట్టించు కొనిన భూరాజులతోను మంత్రులతోను నేను నిద్రించి నిమ్మళించియుందును. బంగారము సంపాదించి తమ యిండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించి యుందును. అకాలసంభవమై కంటబడకయున్న పిండమువంటివాడనై లేకపోయి యుందును. వెలుగు చూడని బిడ్డలవలె లేకపోయి యుందును. అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు బలహీనులై అలసినవారు విశ్రాంతి నొందుదురు బంధింపబడినవారు కార్యనియామకుల శబ్దము వినక యేకముగా కూడి విశ్రమించుదురు అల్పులేమి ఘనులేమి అందరు నచ్చటనున్నారుదాసులు తమ యజమానుల వశమునుండి తప్పించుకొని స్వతంత్రులై యున్నారు. దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఏల?దుఃఖా క్రాంతులైనవారికి జీవమియ్యబడుట ఏల? వారు మరణము నపేక్షింతురు దాచబడిన ధనముకొరకైనట్టు దానిని కనుగొనుటకైవారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకక యున్నది. సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. మరుగుపడిన మార్గముగలవానికిని, దేవుడు చుట్టుకంచె వేసినవానికిని వెలుగు ఇయ్యబడనేల? భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నదినా మొఱ్ఱలు నీళ్లవలె ప్రవహించుచున్నవి. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియేనాకు సంభవించుచున్నదినాకు భీతి పుట్టించినదే నామీదికి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది.
- Ecclesiastes 2:17 ప్రసంగి 2:17ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను అంతయు వ్యర్థము గాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రదుకుట నా కసహ్యమాయెను.
- Ecclesiastes 9:4–6 ప్రసంగి 9:4–6బ్రదికి యుండువారితో కలిసి మెలిసియున్నవారికి ఆశ కలదు; చచ్చిన సింహముకంటె బ్రదికియున్న కుక్క మేలు గదా. బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; వారిపేరు మరువబడి యున్నది, వారికిక ఏ లాభమును కలుగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు.