Ecclesiastes · chapter 7 · verse 24
Ecclesiastes 7:24 in Telugu
సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు
Satyamainadi dooramugaanu bahu lotugaanu unnadi, daani parisheelana cheyagalavaadevadu
Ecclesiastes 7:24 in English
- King James Version (KJV)
- That which is far off, and exceeding deep, who can find it out?
- World English Bible (WEB)
- That which is, is far off and exceedingly deep. Who can find it out?
- American Standard Version (ASV)
- That which is, is far off and exceeding deep; who can find it out?
- Bible in Basic English (BBE)
- Far off is true existence, and very deep; who may have knowledge of it?
- Darby Translation (DBY)
- Whatever hath been, is far off, and exceeding deep: who will find it out?
- Webster's Bible (WBS)
- That which is far off, and exceedingly deep, who can find it out?
- Young's Literal Translation (YLT)
- Far off [is] that which hath been, and deep, deep, who doth find it?
Read in context
- 22నీవును అనేకమారులు ఇతరులను శపించితివని నీకే తెలిసి యున్నది గదా.
- 23ఇది అంతయు జ్ఞానముచేత నేను శోధించి చూచితిని, జ్ఞానాభ్యాసము చేసికొందునని నేననుకొంటిని గాని అది నాకు దూరమాయెను.
- 24సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు
- 25వివేచించుటకును పరిశోధించుటకును, జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతులయొక్క హేతువులను తెలిసికొనుట కును, భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెఱ్ఱితన మనియు గ్రహించుటకును, రూఢి చేసికొని నా మనస్సు నిలిపితిని.
- 26మరణముకంటె ఎక్కువ దుఃఖము కలిగించునది ఒకటి నాకు కనబడెను; అది వలల వంటిదై, ఉరులవంటి మనస్సును బంధకములవంటి చేతులును కలిగిన స్త్రీ; దేవుని దృష్టికి మంచివారైనవారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దానివలన పట్టబడుదురు.
Cross references
- Romans 11:33 రోమీయులకు 11:33ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు.
- Isaiah 55:8–9 యెషయా 55:8–9నా తలంపులు మీ తలంపులవంటిని కావు మీ త్రోవలు నా త్రోవలవంటిని కావు ఇదే యెహోవా వాక్కు ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.
- 1 Timothy 6:16 1 తిమోతికి 6:16సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్.
- Job 28:28 యోబు 28:28మరియు యెహోవాయందలి భయభక్తులే జ్ఞాన మనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను.
- Psalm 139:6 కీర్తనలు 139:6ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు.
- Psalm 36:6 కీర్తనలు 36:6నీ నీతి దేవుని పర్వతములతో సమానము నీ న్యాయవిధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే
- Job 11:7–8 యోబు 11:7–8దేవుని గూఢాంశములను నీవు తెలిసికొనగలవా?సర్వశక్తుడగు దేవునిగూర్చి నీకు పరిపూర్ణజ్ఞానముకలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమిచేయుదువు?పాతాళముకంటె లోతుగానున్నది, నీవేమి యెరుగుదువు?
- Job 28:12–23 యోబు 28:12–23అయితే జ్ఞానము ఎక్కడ దొరకును? వివేచన దొరకు స్థలము ఎక్కడ నున్నది? నరులు దాని విలువను ఎరుగరు ప్రాణులున్న దేశములో అది దొరకదు. అగాధము అది నాలో లేదనును సముద్రమునాయొద్ద లేదనును. సువర్ణము దానికి సాటియైనది కాదు దాని విలువకొరకై వెండి తూచరాదు. అది ఓఫీరు బంగారమునకైనను విలువగల గోమేధికమునకైనను నీలమునకైనను కొనబడునది కాదు. సువర్ణమైనను స్ఫటికమైనను దానితో సాటికావు ప్రశస్తమైన బంగారు నగలకు ప్రతిగా అది ఇయ్యబడదు. పగడముల పేరు ముత్యముల పేరు దానియెదుట ఎత్తనేకూడదు. జ్ఞానసంపాద్యము కెంపులకన్న కోరతగినది కూషుదేశపు పుష్యరాగము దానితో సాటికాదు. శుద్ధసువర్ణమునకు కొనబడునది కాదు. అట్లైన జ్ఞానము ఎక్కడనుండి వచ్చును? వివేచన దొరకు స్థలమెక్కడ నున్నది? అది సజీవులందరి కన్నులకు మరుగై యున్నది ఆకాశపక్షులకు మరుగుచేయబడి యున్నది. మేము చెవులార దానిగూర్చిన వార్త వింటిమని నాశన మును మరణమును అనును. దేవుడే దాని మార్గమును గ్రహించును దాని స్థలము ఆయనకే తెలియును.
- Deuteronomy 30:11–14 ద్వితీయోపదేశకాండము 30:11–14నేడు నేను నీ కాజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహిం చుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దానిని విని గైకొనునట్లు, ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మనయొద్దకు దాని తెచ్చును? అని నీ వను కొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు; మనము దాని విని గైకొనునట్లు, ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాని తెచ్చును అని నీవను కొననేల? అది సము ద్రపు అద్దరి మించునది కాదు. నీవు దాని ననుసరించు టకు ఆ మాట నీకు బహు సమీపముగా నున్నది; నీ హృద యమున నీ నోట నున్నది.